Thursday, February 23, 2012
 

విదేశీ పెట్టుబడుల (FDI) వల్ల మనకొచ్చే నష్టాలు?

ఎఫ్ డి ఐ (foreign direct investments)
యురోపియన్ దేశాల నుండి మన దేశానికి కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తున్నాయి.కావున లక్షల కొలది ఉద్యోగాలు వస్తునాయని సంబర పడుతున్నారు.కాని ఇంత డబ్బు ఎక్కడనుండి వస్తున్నాయి?దివాలా తీసే యురోపియన్ కంపెనీలు మరియు అమెరికన్ కంపెనీలు మన దేశంలోఎలా పెట్టుబడులు పెడతాయి? అదే యురోపియన్ దేశాలలో ఆర్ధిక మాంద్యo వలన నిరుద్యోగము,కరువుల వంటి సమస్యలు పెరిగాయి.మరి అలాంటప్పుడు వాళ్ళ దేశాలలోనే పెట్టుబడులు పెట్టి వారి ప్రజలకే ఉపాధి కల్పించకుండా,మన దేశంలోకి వచ్చి మన దేశ ప్రజలకు ఉపాధి కల్పించ వలసిన అవసరం ఏమిటి?
ఇప్పుడు ఏయే కంపెనీలు అయితే పెట్టుబడులు పెట్టుటకు మన దేశానికి రాబోతున్నాయో అవే కంపెనీలు 260 సం||ల క్రితం ఈస్ట్ ఇండియా కంపనీలుగా పిలువబడేవి.ఇప్పుడు అవే కంపెనీలు పేరు మార్చుకొని “మల్టీ నేషనల్ కంపెనీలు” అని చెప్పుకొంటూ మన దేశంలోకి పునఃప్రవేశించాయి.
రెండు వందల అరవై సంవత్సరాల క్రితం ఇదే కంపెనీలు మన దేశంలోకి ప్రవేశించిన విధానం :
“వ్యాపార నిమిత్తం వచ్చిన బ్రిటిషర్లచే స్థాపించబడిన కంపెనీలే “ఈస్టిండియా కంపెనీలు ”
ఈ ఈస్టిండియా కంపెనీలు 260 సం||ల క్రితం వ్యాపార నిమిత్తం మెల్లగా మన దేశంలో వాళ్ళ పెట్టుబడులను పెట్టి మన దేశపు పరిశ్రమలను అనగా చేనేత పరిశ్రమలు,ఉప్పు తయారీ మొదలగు వాటిని అణచివేసిన విషయం మనకు తెలిసిందే.అవే కంపెనీలే వివిధ భాగాలుగా విడిపోయి 260 సంవత్సరాల తర్వాత మన దేశంలోకి” Multi National Companies ” రూపంగా పునఃప్రవేశిస్తునాయి.ఈ ప్రక్రియ మన దేశంలో చాల మందికి తెలియదు.ఎందుకంటే మన దేశపు విద్యా వ్యవస్థ(Education system) చాలా దీన పరిస్తితిలో ఉంది.ఉదాహరణకు ఇంజనీరింగ్ వంటి కోర్సులలో చదివేది ఒకటైతే చేసే ఉద్యోగం మరొకటి.ఇక చరిత్ర విషయానికి వస్తే మన దేశపు వాస్తవ చరిత్ర ఎవ్వరికి తెలియదు.
విదేశీ పెట్టుబడుల (FDI) వల్ల మనకొచ్చే నష్టాలు :
ఈ విదేశీ పెట్టుబడుల (FDI) వలన మన దేశ ప్రజలకు లక్షల కొలది ఉద్యోగాలు వస్తాయని సంబరపడుతున్నారు.కాని అందులోని అంతరంగికం చాలా భయంకరమైనది. అది ఏమిటనగా పది లక్షల జనాభా ఉన్న ప్రతి నగరంలోనూ వారు పెట్టుబడులు పెడుతున్నారు. ఉదాహరణకు వంద నగరాలలో పెట్టుబడులు పెట్టారనుకుంటే అప్పుడు మొత్తం జనాభా పది కోట్లు అవుతుంది.ఇందులో తొంభై శాతం మంది విదేశీ దిగుమతులనే కొంటారు.దాని వలన మన దేశంలోని చిన్న,పెద్ద పరిశ్రమలు మరియు కుటీర పరిశ్రమలు,అలాగే ముడిసరుకుల వ్యాపారవేత్తలు ఘోరంగాదెబ్బ తింటారు. తద్వారా ఈ కంపెనీలు మన దేశ ప్రజల నుండి పొందిన లాభాల్ని వారి దేశాలకు తరలించుకొంటారు.
ఈ వంద నగరాలలో ఉన్న పది కోట్ల జనాభా 1 / ౩ వంతు అమెరికా జనాభాకు సమానం.అలాగే 2 / ౩ వంతు యురోపియన్ దేశాల జనాభాకు సమానం.
పైన చెప్పిన విధంగా మన దేశం నుండి వాళ్ళకు వచ్చిన లాభాలు వాళ్ళ దేశాల యొక్క ఆర్ధిక పరిస్థితి,ఉద్యోగ పరిస్థితి మెరుగు పరచుకోవటానికి ఉపయోగపడుతాయి. క్రమంగా వాళ్ళ ఆర్ధిక మరియు ఉద్యోగ మాంద్యాల్ని మన పైకి తోస్తారు.ఇక ఆ కంపెనీలు మన దేశంలోఒక్క క్షణం కూడా నిలవకుండా వెళ్ళిపోతాయి.
ఇదే మన దేశ నాయకులు సాధించబోయే ఘనత.మన నాయకులు ప్రమాణం చేసి చెప్పిన విధంగా 2020 లో “super power country”గా కాదుకదా,ఆర్ధిక మాంద్యత గల దేశంగా మారుతుంది.
గమనిక:
2008 లో అమెరికా మరియు ఇతర ఐరోపా దేశాలలో దివాలా తీసి ఇప్పటికి ఇంకా తెరుకోలేని స్థితిలో ఉన్న (ఉదా:Walmart,Nike,etc.,)కంపెనీలు ఇప్పుడు మన దేశంలో పెట్టుబడులకు సిద్దపడుతున్నాయి.ఈ కంపెనీలు నాటి నుండి నేటి వరుకు తమ తమ ప్రభుత్వాలను ఈ మాంద్యం ఉచ్చు నుండి కాపాడమని వేడుకుంటూనే ఉన్నాయి.మరి ఇలా దివాలా తీసిన కంపెనీలు నేడు మనల్ని,మన దేశ ఆర్ధిక పరిస్థితులను ఎలా మెరుగు పరచగలవు?
దీన్ని క్షుణ్ణంగా పరిశీలించగా,ఈ కంపెనీలు మన దేశాన్ని బాగుపరుచక పోగా,మన దేశ ఆర్ధిక పరిస్థితిని దిగాజార్చటమే కాక,మన దేశంలో ఉన్న వివిధ రకాల వనరులను దోచుకొనుటకు పెద్ద పథకం పన్నినట్లుగా ఉంది.
కావున ఈ సమయంలో ప్రతి భారతీయుడు భాద్యతగా వ్యవహరించి జరగబోయే దుర్మార్గాన్ని ఎదుర్కొనవలసిన అవసరం ఎంతైనా ఉంది.

Source: True Citizen

 

Tags: , ,

Comments

No comments so far.
  • Leave a Reply
     
    Your gravatar
    Your Name
     
     
     
     
     
 
About PravasaRajyam

ఎక్కడో పుట్టి… ఎక్కడో పెరిగి… ఎక్కడో వున్నాము…వి్వ వ్యాప్తంగా విస్తరించి వున్న మన తెలుగు ప్రజలందరం ఒక్క చోట చేరాలన్న ఆకాంక్షతో చేస్తున్న నా ఈ చిరు ప్రయత్నమే “ప్రవాసరాజ్యం”( www.pravasarajyam.com )

NRI Network

For info please go through NRI

For NRI Gallery Click NRI Events

Get in touch

UAE Phone: +971 509 772055
Email: uae@pravasarajyam.com

USA Phone: 912-246-6649
Email: usa@pravasarajyam.com

India Phone: +91-40-64592288
Email: ind@pravasarajyam.com

www.pravasarajyam.com