సిపిఎం కార్యదర్శిగా ఐదోసారి రాఘవులే !
హై
దరాబాద్: సిపిఎం రాష్ట్ర కార్యదర్శిగా బివి రాఘవులు ఐదోసారి ఎన్నికయ్యారు. ఖమ్మంలో జరిగిన పార్టీ 23వ మహాసభల్లో పార్టీ కార్యదర్శిగా ఏకగ్రీవంగా రాఘవులును ఎన్నుకున్నారు. రాఘవులు ఎన్నిక విషయాన్ని శనివారం అధికారికంగా ప్రకటించారు. కార్యదర్శి పదవికి మరో ఇద్దరు పోటీ పడినప్పటికీ పార్టీ ఎదుర్కుంటున్న సమస్యల దృష్ట్యా తిరిగి రాఘవులునే ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. 2014 సాధారణ ఎన్నికల దృష్ట్యా రాష్ట్ర రాజకీయాలపైనా, పార్టీ సంస్థాగత వ్యవహారాలపైనా గట్టి పట్టు ఉన్న రాఘవులును కొనసాగించడమే మంచిదనే అభిప్రాయంతో మహాసభ ఆ నిర్ణయం తీసుకుంది. నల్లగొండలో 1997లో జరిగిన 19వ రాష్ట్ర మహాసభల్లో రాఘవులు మొదటిసారి రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత నుంచి వరుసగా ఆయనే ఏకగ్రీవంగా ఎన్నికవుతూ వస్తున్నారు.

Comments