కలిసి ఉద్యమించం- కోదండరాం
హై
దరాబాద్: అన్ని పార్టీలు తెలంగాణపై స్పష్టమైన వైఖరి చెప్పే వరకు తెలంగాణలో తిరగనివ్వవద్దని తెలంగాణ రాజకీయ జెఎసి చైర్మన్ కోదండరామ్ పిలుపునిచ్చారు. తెలంగాణపై స్పష్టమైన వైఖరిని చెప్పని పార్టీలతో కలిసి ఉద్యమించేది లేదని ఆయన స్పష్టం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, కొందరు స్వార్థపరుల కబంధహస్తాల్లో చిక్కుకున్నందు వల్లనే తెలంగాణపై నిర్ణయం తీసుకోలేకపోతున్నాయని ఆయన అన్నారు. హైదారాబాదులోని బాగ్ లింగపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ రైల్వే ఉద్యోగుల డైరీని ఆయన శనివారం ఆవిష్కరించారు. ప్రచారం, నిర్మాణం, ఆందోళనలే లక్ష్యంగా ముందుకు సాగాలని ఆయన తెలంగాణవాదులకు పిలుపునిచ్చారు. ఏప్రిల్ తర్వాత ప్రారంభమయ్యే ఉద్యమ ఉధృతి గురించి హైదరాబాదులో పెద్ద యెత్తున చాటి చెప్పాలని ఆయన అన్నారు. తెలంగాణ కోసం పోరుయాత్ర పేరుతో జిల్లాల్లో పర్యటిస్తున్న బిజెపి అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డికి ఆయన అభినందనలు తెలిపారు.
There are no posts related to కలిసి ఉద్యమించం- కోదండరాం .

Comments