జయసుధ గారూ.. ఓ డ్యూయట్ పాడుకుందామా : చిరంజీవి
సికింద్రాబాద్ ఎమ్మెల్యే, సినీ నటి జయసుధను చూడగానే మెగాస్టార్ చిరంజీవికి పాత వెండితెర మధుర జ్ఞాపకాలు గుర్తుకు వచ్చాయి. మనస్సులో ఉన్న విషయాన్ని ఏమాత్రం దాచుకోకుండా కుండబద్ధలు కొట్టినట్టు చెప్పే గుణం ఉన్న చిరంజీవి… జయసుధతో ఓ డ్యూయట్ పాడుకుందామా అంటూ చమత్కరించారు. ఈ మాటలకు జయసుధ ముసిముసి నవ్వుల నవ్వుకుంటూ ముందుకు సాగిపోయారు.
ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా అసెంబ్లీ లాబీలో చిరంజీవి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచారు. మాటల సమయంలో జయసుధ అక్కడకు వచ్చారు. ఆమెను చిరంజీవి చూడగానే… ఏదో డ్యూయెట్ గుర్తుకు వస్తుందంటూ నవ్వుతూ అన్నారు. దీంతో సహజనటి ముసిముసినవ్వులు నవ్వారు. ఇక్కడే ఉంటే ఎవరో ఒకరు మ్యూజిక్ వాయిస్తారు ముందుకు వెళ్లండి అంటూ సహజనటితో చిరంజీవి అనడంతో అక్కడ నుంచి వారిద్దరు సభలోకి వెళ్లిపోయారు.
అలాగే, చిరంజీవిని చూసిన తెదేపా ఎమ్మెల్యే మోత్కుపల్లి నర్సింహులు… ఏమండీ చిరంజీవి గారు బాగా సన్నబడ్డారు.. గ్లామర్ ఏమాత్రం తగ్గలేదే, ఏం చేస్తున్నారేంటీ అని ప్రశ్నించారు. అలాగే, మూడు రోజుల క్రితం చిరంజీని చూసిన తెదేపా ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ… ఈ రోజు అసెంబ్లీకి మీరే హాట్ అని, ప్రేమికుల దినోత్సవం రోజు మీరే సెంటర్ అట్రాక్షన్ అని అన్నారు.
అందుకు చిరంజీవి ఎందుకు అని అడగ్గా అందుకు పయ్యావుల.. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ ‘ఐ లవ్యూ’ అంటూ మీ వెంట పడుతున్నారు కదా అని అన్నారు. అందుకు చిరంజీవి నవ్వుతూ వెళ్లి పోయిన విషయం తెల్సిందే.
There are no posts related to జయసుధ గారూ.. ఓ డ్యూయట్ పాడుకుందామా : చిరంజీవి.

Comments