మతరహిత వివాహ ధ్రువీకరణ పత్రాలకు కేంద్రం యోచన
మతంతో సంబంధం లేకుండా వివాహ ధ్రువీకరణ సర్టిఫికెట్టను జారీ సాధ్యాసాధ్యాలను కేంద్రం పరిశీలిస్తోంది. సిక్కులతో పాటు దేశంలోని ఆయా మైనారిటీ వర్గాల నుండి వస్తున్న డిమాండ్ల కారణంగా ప్రభుత్వం ఈ దిశగా ఆలోచిస్తోంది.
ప్రస్తుతం ఉన్న వివాహ రిజిస్ట్రేషన్ చట్టంలో మార్పులు చేయాలని ఒక్క సిక్కులే కాదు మిగిలిన మైనారిటీలు కూడా కోరుతూ వస్తున్నారు. ప్రస్తుత చట్టం ప్రకారం, సిక్కులను కూడా హిందువులుగానే పరిగణిస్తున్నారు. అయితే, దీన్ని సిక్కులు వ్యతిరేకిస్తున్నారు.
దేశంలో ప్రేమ, మతాంతర వివాహాలను చేసుకునే వారి సంఖ్య కూడా పెరుగుతున్న దశలో వారికి కూడా ప్రస్తుతం ఉన్న చట్టం అవరోధంగా ఉంది. విదేశాలకు వెళ్లే వారి దంపతుల పరిస్థితి కూడా ఇంతే. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం ఇకపై జారీ చేసే వివాహ ధ్రువీకరణ పత్రాల్లో మతాన్ని ప్రస్తావించరాదని నిర్ణయించింది. దీనిపై సాధ్యాసాధ్యాలను పరిశీలించాలంటూ అధికారులను ఆదేశించింది.
There are no posts related to మతరహిత వివాహ ధ్రువీకరణ పత్రాలకు కేంద్రం యోచన.
Tags: , కేంద్రం, మతం, మతరహిత, వివాహ ధ్రువీకరణ పత్రాలు

Comments