జోరుగా నకిలీ నోట్ల చెలామణి
* పోలీసుల అదుపులో ముగ్గురు
* 6లక్షల నకిలీ కరెన్సీ స్వాధీనం
పాకిస్తాన్‌లో తయారవుతున్న నకిలీ కరెన్సీ దేశంలో చలామణి అవుతుందా.? రాజమండ్రిలో ఫేక్ కరెన్సీ ముఠా పట్టుబడటంతో ఇది నిజమేననిపిస్తోంది. పశ్చిమ బెంగాల్‌కు చెందిన ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేసి ఆరులక్షల నకిలీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. రాజమండ్రిలో ఫేక్ కరెన్సీ ముఠా గుట్టురట్టయింది. తూర్పు రైల్వే స్టేషన్‌లో అనుమానాస్పదంగా తిరుగుతున్న ముగ్గుర్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
పశ్చిమ బెంగాల్ మల్దా జిల్లాకు చెందిన మజబీర్ షేక్, హైదర్ అలీ, సయ్యద్ అలీ నకిలీ కరెన్సీ మార్పిడి చేసేందుకు రాజమండ్రి వచ్చారు. 40వేలు అసలు కరెన్సీ ఇస్తే…. లక్ష నకిలీ కరెన్సీ ఇచ్చేందుకు ఓ వ్యక్తితో బేరం కుదిరింది. సుమారు ఆరు లక్షల నకిలీ నోట్లను రాజమండ్రిలో చెలామణి చేసేందుకు ప్లాన్ వేసి అడ్డంగా దొరికిపోయారు.
వీరి నుంచి పోలీసులు ఆరు లక్షల నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. అరెస్టైన ముగ్గురు పశ్చిమ బెంగాల్‌కు చెందిన వారు కావడంతో వారి ప్రాంతాల్లో పరిస్థితులపై పోలీసులు కూపీ లాగుతున్నారు. దీని వెనుక ఉన్న ముఠాపై సమాచారాన్ని సేకరిస్తున్నారు.
There are no posts related to జోరుగా నకిలీ నోట్ల చెలామణి.
Tags: నకిలీ నోట్లు

Comments