రాష్ట్ర ప్రభుత్వం వీధి రౌడి అంటూ జేపీ ఆరోపణ
రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం చట్టాన్ని ఉల్లంఘించి, వీధి రౌడీలా ప్రవర్తిస్తోందని లోక్‌సత్తా అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ ధ్వజమెత్తారు. రాష్ట్రంలో పంట ఉత్పత్తి పెరిగినా మద్దతు ధర పెరగడం లేదని జేపీ మంగళవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. ఇప్పటికే మద్దతు ధర పెంచలేమని రాష్ట్ర సర్కారు కేంద్రానికి లేఖ రాసిందని, కర్ణాటకలో కంటే రాష్ట్రంలో మద్దతు ధర తక్కువేనని జేపీ వ్యాఖ్యానించారు.
రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టిందని ఒప్పకుంటోందని, దిగుమతులపై పన్ను విధించడం లేదని జేపీ అన్నారు. రైతన్నలకు గిట్టుబాటు ధరను డిమాండ్ చేస్తూ వచ్చేవారం నిజామాబాద్ నుంచి నాదేండ్ వరకు, తడ నుంచి తమిళనాడు వరకు ధాన్యాలను తరలిస్తామని జేపీ తెలిపారు.
రైతు సమస్యలపై లోక్‌సత్తా చేస్తున్న పోరుకు తెరాస సహకరిస్తుందని ఇప్పటికే హామీ ఇస్తుందని, ఈ పోరులో అన్ని పార్టీలను కలుపుకుని పోతామని జేపీ వెల్లడించారు. ఇక ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని, పోటీ చేస్తున్న స్థానాలపై చర్చిస్తున్నామని ఆయన వ్యాఖ్యానించారు.
There are no posts related to రాష్ట్ర ప్రభుత్వం వీధి రౌడి అంటూ జేపీ ఆరోపణ.
Tags: జేపీ, రాష్ట్ర ప్రభుత్వం, వీధి రౌడి

Comments