వేములవాడ రాజన్న ఆలయంలో ఉద్రిక్తత
* భక్తులకు, పోలీసులకు మధ్య తోపులాట
* భక్తులపై లాఠీలు ఝళిపించిన పోలీసులు
* పలువురు భక్తులకు గాయాలు
* ఆలయ అధికారులపై భక్తుల ఆగ్రహం
వేములవాడ రాజరాజేశ్వరస్వామి దేవాలయంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. భక్తులపై లాఠీలు ఝళిపించి హడలెత్తించారు. శివరాత్రి సందర్భంగా ఎంపీ పొన్నం ప్రభాకర్, విప్ ఆరెపల్లి మోహన్ స్వామిని దర్శించుకునేందుకు రావడంతో భక్తులను పోలీసులు అరగంట సేపు ఆపివేశారు. దీంతో భక్తులకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది.
చివరకు సహనం కోల్పోయిన పోలీసులు భక్తులపై లాఠీలు ఝుళిపించారు. ఈ ఘటనలో పలువురు భక్తులు గాయపడ్డారు. పోలీసుల వైఖరిపై నిరసన వ్యక్తం చేశారు. సౌకర్యాలు కల్పించడంలో ఆలయ అధికారులు విఫలమయ్యారని ఆరోపించారు. వీఐపీల కోసం తమను ఇబ్బందులు పెడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
There are no posts related to వేములవాడ రాజన్న ఆలయంలో ఉద్రిక్తత.

Comments