వ్యభిచార గృహాలపై పట్టుబడిన 30 మంది ఆంధ్రప్రదేశ్ యువతులు
దేశ రాజధాని న్యూఢిల్లీలోని పలు వ్యభిచార గృహాలపై స్థానిక పోలీసులు సోమవారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో సుమారు 30 మంది వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన యువతులు పట్టుబడ్డారు. అలాగే, మరికొంతమంది ఇతర రాష్ట్రాలకు చెందిన యువతులు కూడా ఉన్నారు.
ఆంధ్రా యువతులకు సంబంధించిన సమాచారాన్ని ఏపీ సీఐడీ పోలీసు విభాగానికి ఢిల్లీ పోలీసులు అందించారు. అనంతరం వీరిని కమలాపురం పోలీసు స్టేషన్‌కు తరలించారు. సమాచారం అందుకున్న ఏపీ సిఐడి పోలీసులు అక్కడకు వెళ్లి విచారణ చేశారు. పట్టుబడిన యువతులలో కొంతమంది మైనర్లు కూడా ఉండటం గమనార్హం.
పట్టుబడిన యువతుల్లో చాలామంది మత్తుపదార్థాలు సేవించి ఉన్నారు. దీంతో వీరికి కౌన్సిలింగ్ ఇచ్చి సొంత ఊర్లకు తరలించేందుకు పోలీసులు ప్రయత్నిస్తుండగా, పలువురు యువతులు స్వగ్రామాలకు వెళ్లేందుకు ససేమిరా అంటున్నారు.
There are no posts related to వ్యభిచార గృహాలపై పట్టుబడిన 30 మంది ఆంధ్రప్రదేశ్ యువతులు.
Tags: ఆంధ్రప్రదేశ్, యువతులు, వ్యభిచార గృహాలు

Comments