ఒకే వ్యక్తికి రెండుసార్లు పద్మశ్రీలు
దేశ వ్యాప్తంగా లక్షలాది మంది ప్రముఖులు పద్మశ్రీ బిరుదుల కోసం చకోర పక్షుల్లా ఎదురుచూస్తుంటే ఒకాయనకు మాత్రం అది ఏకంగా రెండుసార్లు దక్కేసింది. ఆయన పేరు సునీల్ జనా. వయసు 94 సంవత్సరాలు. నిబంధనల ప్రకారం ఎవరికయినా పద్మశ్రీని ఒకసారే ఇస్తారు. మరి ఈ పెద్దాయనకు రెండోసారి కూడా పద్మశ్రీని ఎందుకు ప్రకటించారని కొందరికి అనుమానం వచ్చింది. వారు ఆరా తీయగా దానికి కారణం కేంద్ర ప్రభుత్వ పొరపాటని తేలింది.
బెంగాల్ కరవు నాటి దయనీయ దృశ్యాలను కెమెరాలో బంధించిన సునీల్ వాటిని మిగతా ప్రపంచం కళ్లముందుంచారు. ఆయన సేవలను గుర్తించిన ఇందిరాగాంధీ ప్రభుత్వం 1972లో పద్మశ్రీ బిరుదునిచ్చి గౌరవించింది. కానీ, తిరిగి మళ్లీ 40 సంవత్సరాల అనంతరం, ఈ ఏడాది గణతంత్ర వేడుకలను పురస్కరించుకుని కేంద్రం ప్రకటించిన పద్మశ్రీల జాబితాలో సునీల్ పేరు కూడా ఎక్కింది.
ఆ తరువాత జరిగిన పొరపాటును గుర్తించిన హోంమంత్రిత్వశాఖ నాలుక కరుచుకుంది. ఆయనకు ప్రకటించింది పద్మశ్రీ కాదని, పద్మభూషణ్ అని సంబంధిత అధికారి ఒకరు వివరించారు.
There are no posts related to ఒకే వ్యక్తికి రెండుసార్లు పద్మశ్రీలు.
Tags: పద్మశ్రీ

Comments