జ్యూడిషియల్ విచారణలో భారత జాలర్ల హంతకులు
భారతీయ జాలర్లను హతమార్చిన కేసులో ఇటలీ నౌకాదళ సిబ్బందిని పోలీసులు మూడు రోజుల జ్యూడిషియల్ విచారణకు తరలించారు. కేరళ సముద్ర తీరంలో భారత జలాల్లో చేపల వేటలో ఉన్న ఇద్దరు భారత జాలర్లను ఇటలీ నౌకాదళ సిబ్బంది కాల్చి చంపినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపై తీవ్రంగా స్పందించిన భారత్, ఇటలీకి తన తీవ్ర నిరసనను తెలిపింది.
నాలుగు రోజుల పాటు ఇరు దేశాల మధ్య జరిగిన చర్చల అనంతరం నిందితులు లాటోర్ మస్సిమిలానో, సాల్వటోర్ గిరోనిలను కేరళ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
వారిద్దరూ ఇటలీ నౌకాదళ సిబ్బందిగా పనిచేస్తున్నారు. వారిని, న్యాయమూర్తి కె.జి.జాయ్ ఎదుట పోలీసులు హాజరుపరిచారు. వీరిపై భారత శిక్షా స్మృతి సెక్షన్ 302 ప్రకారం కేసు నమోదు చేశారు.
There are no posts related to జ్యూడిషియల్ విచారణలో భారత జాలర్ల హంతకులు.
Tags: జ్యూడిషియల్

Comments