ఎన్.సి.టి.సి ఏర్పాటుపై రాష్ట్రాలతో చర్చలకు సిద్ధం
జాతీయ ఉగ్రవాద వ్యతిరేక సమాఖ్య (ఎన్.సి.టి.సి) ఏర్పాటు అంశంపై దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో విస్తృతస్థాయి చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నట్టు కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. ఎన్.సి.టి.సిని వ్యతిరేకిస్తున్న రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు ఇతర రాష్ట్రాలకు కూడా ఏమానా అనుమానాలు ఉన్నాయా అనే కోణంలో కూడా ప్రభుత్వం చర్చలు జరిపేందుకు ఆసక్తి చూపుతోంది.
దీనిపై కేంద్ర కేంద్ర టెలికాం, మానవవనరుల శాఖామంత్రి కపిల్ సిబల్ మాట్లాడుతూ ఎన్‌సిటిసి కేంద్ర మండలిలో ప్రతి రాష్ట్రానికి ఇప్పటికే ప్రాతినిథ్యం కల్పించారని, ఒక వేళ ఇంకా ఏమైనా అనుమానాలు, అపోహలు ఉంటే చర్చల ద్వారా వాటిని తొలగించడానికి కేంద్రం సిద్ధంగా ఉందన్నారు.
ఎన్‌సిటిసిని ఏర్పాటు చేయడం వెనకు ఉన్న హేతుబద్ధతను మంత్రి వివరిస్తూ ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాల కోసం ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం వద్ద ఉన్న అధికారాలను ఎన్‌సిటిసికి అప్పగిస్తున్నట్లు ఆయన చెప్పారు. ముఖ్యంగా ఎన్‌సిటిసి కేంద్ర మండలిలో ఎన్‌సిటిసి డైరెక్టర్, జాయింట్ డైరెక్టర్లు, ప్రతి రాష్ట్రానికి చెందిన ఉగ్రవాద వ్యతిరేక సంస్థలు, లేదా బలగాల చీఫ్‌లు ప్రతినిధులుగా ఉంటారని మంత్రి సిబాల్ చెప్పారు.
There are no posts related to ఎన్.సి.టి.సి ఏర్పాటుపై రాష్ట్రాలతో చర్చలకు సిద్ధం.
Tags: ఎన్.సి.టి.సి

Comments