దేశ రాజధాని న్యూఢిల్లీలో పాకిస్థాన్ గూఢాచారి అరెస్టు
పాక్‌స్థాన్ గూఢాచారిగా అనుమానిస్తున్న కమ్రాన్ అక్బర్‌ను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. భారత్ రక్షణ శాఖకు సంబంధించిన రహస్య పత్రాల కోసం కమ్రాన్ అక్బర్‌ను పాక్ మిలిటెంట్లు పురమాయించినట్లు ఢిల్లీ పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. 1992 సంవత్సరం నుంచి కోల్‌కత్తాలో ఉంటున్న కమ్రాన్ అక్బర్ మూడేళ్ల క్రితం స్థానిక యువతిని వివాహం చేసుకున్నాడు. గత కొంత కాలంగా అతనిపై వస్తున్న సమాచారంతో పాక్‌కు చెందిన అక్బర్‌ను ఢిల్లీ రైల్వేస్టేషన్‌లో అరెస్ట్ చేసినట్లు డీసీపీ (క్రైం) అశోక్ చంద్ తెలిపారు.
కమ్రాన్ అక్బర్ నుంచి భారత రక్షణ శాఖకు సంబంధించిన కొని పత్రాలను స్వేకరించి పాకిస్థాన్‌కు పంపే ఉద్దేశ్యంతో ఢిల్లీకి వచ్చినట్లు సమాచారం అందటంతో కోల్‌కత్తా రైలు ఎక్కుతుండగా అతన్ని అరెస్ట్ చేసినట్లు అశోక్ చంద్ తెలిపారు. పలు ముఖ్యమైన రక్షణ శాఖకు సంబందించిన డాక్యూమెంట్లను స్వాధినం చేసుకున్నట్లు వివరించారు.
1990 సంవత్సరంలో చదువును మధ్యలోనే మానేసి ఆయన అట్టారీ సరిహద్దు ద్వారా కోల్‌కత్తాలోని తమ బంధువులైన మహ్మద్ సలీం ఇంటికి కమ్రాన్ అక్బర్ వచ్చాడు. కాగా వీరు గోవాలో వీరికి గైడ్‌గా పనిచ్సిన అష్రఫ్‌తో కలసి అక్కడ దొంగతనాలకు పాల్పడుతూ జైలు పాలయ్యారు. తరువాత విడుదలైన అక్బర్ తిరిగి కోల్‌కత్తాకు తిరిగి వచ్చి అసీఫ్ హుస్సేన్ పేరుతో నకలీ పాస్‌పోర్టు సంపాధించాడు.
There are no posts related to దేశ రాజధాని న్యూఢిల్లీలో పాకిస్థాన్ గూఢాచారి అరెస్టు.
Tags: గూఢాచారి, న్యూఢిల్లీ, పాకిస్థాన్, రాజధాని

Comments