వైఎస్ఆర్ కాంగ్రెస్‌లో చేరే ప్రసక్తే లేదు
తాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్టు వస్తున్న మీడియాలో వస్తున్న వార్తలను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి వైఎస్ఆర్ సోదరుడు వైఎస్.వివేకానంద రెడ్డి తోసిపుచ్చారు. ఇప్పట్లో కాంగ్రెస్ పార్టీలో చేరే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు.
రాజ్యసభ టిక్కెట్ కోసం ఆయన ముమ్మరంగా ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇందులోభాగంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేతలు అహ్మద్ పటేల్, గులాం నబీ ఆజాద్‌లతో ఆయన నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారు. ఇందుకోసం ఆయన ఢిల్లీలో మకా వేసి ఉన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యసభ సీటు కోసమే తాను ఢిల్లీ వచ్చినట్లు మాజీ మంత్రి వైఎస్.వివేకానంద రెడ్డి చెప్పారు. రాయలసీమకు గత 15 ఏళ్ళ నుంచి రాజ్యసభ టికెట్ కేటాయించలేదని ఆయన గుర్తు చేశారు. అందువల్ల ఈ దఫా అయిన కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ దఫా కాంగ్రెస్ అధినాయకత్వం తమ ప్రాంతానికి అవకాశం ఇస్తుందనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఇదిలావుండగా, మాజీ కేంద్ర మంత్రి రేణుకాచౌదరి కూడా రాజ్యసభ సీటును ఆశిస్తున్నారు. తమ వర్గానికి గత 20 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా రాజ్యసభ సీటు కేటాయించాలేదన్నది ఆమె వాదన.
There are no posts related to వైఎస్ఆర్ కాంగ్రెస్‌లో చేరే ప్రసక్తే లేదు.
Tags: కాంగ్రెస్, వైఎస్.వివేకానంద రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్

Comments