ఇంజనీరింగ్‌కు దేశవ్యాప్త పరీక్ష
* 2013 నుంచే అమల్లోకి కామన్‌ఎంట్రెన్స్
* ఇండియన్ సైన్స్ ఇంజనీరింగ్ ఎలిజిబిలిటీ టెస్ట్… ISEET
* రద్దు కానున్న ఐఐటీ, ఏఐట్రిపుల్‌ఈ, ఎంసెట్‌లు
* నష్టపోనున్న ఏపీ విద్యార్థులు
* 2014 నుంచి పెట్టాలంటున్న విద్యావేత్తలు
ఇంజనీరింగ్‌కు వచ్చే ఏడాది నుంచే దేశవ్యాప్త ప్రవేశపరీక్ష నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. ఢిల్లీలో జరిగిన రాష్ట్రాల విద్యాశాఖ మంత్రుల సమావేశంలో కేంద్రమంత్రి పురందేశ్వరి ఈ విషయాన్ని స్పష్టం చేసారు. పరీక్ష అమలుకు రెండేళ్ల టైం అడిగినా కుదరదని తేల్చి చెప్పేశారు . దేశంలో జాతీయస్థాయి ఉమ్మడి పరీక్షల కాలం ఆరంభమైంది. ఇప్పటికే మెడికల్ ఎంట్రన్స్‌కు …. నీట్‌ను పెట్టాలని నిర్నయించిన సర్కార్… ఇంజనీరింగ్‌ను అదే కోవలోకి తీసుకువస్తుంది.
ఇకపై దేశవ్యాప్తంగా ఉన్న ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశాలకు జాతీయస్థాయి పరీక్షను నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. దీనికి ఐసీట్ అనే పేరునూ ఖరారు చేసింది. ఢిల్లీలో జరిగిన రాష్ట్రాల విద్యాశాఖ మంత్రుల సమావేశలంలో కేంద్రమానవవనరుల శాఖ సహాయమంత్రి పురంధేశ్వరి తెలిపారు. ఐతే పరీక్షకు 2014 వరకూ గడువు కావాలని కోరిన రాష్ట్రాల విన్నపాన్ని ఆమె తిరస్కరించారు. వచ్చే ఏడాది నుంచే పరీక్ష నిర్వహిస్తే మన రాష్ట్ర విద్యార్థులు ఎక్కువగా నష్టపోతారు.
వచ్చే విద్యాసంవత్సరం నుంచే మన రాష్ట్ర సిలబస్‌ను జాతీయస్థాయికి అనుగుణంగా రూపొందిస్తున్నారు. అలాంటప్పుడు జాతీయస్థాయిలో జరిగే పరీక్షను ఎదర్కొనాలంటే మరో రెండేళ్లు గడువు కావాల్సిందే. ఇవన్నీ దృష్టిలో పెట్టుకోకుండా మరో వివాదానికి తెరలేపింది కేంద్రం. ఐసీట్‌లో ర్యాంక్ పొందిన విద్యార్థులు దేశవ్యాప్తంగా ఉన్న నాలుగులక్షల ఇంజనీరింగ్ సీట్లలో ఎక్కడైనా చదువుకునే అవకాశం ఉంటుంది. మరో ఏడాది గడువు ఇస్తే దీనివల్ల విద్యార్థులకు లాభం జరుగుతుందంటున్నారు విద్యావేత్తలు.
There are no posts related to ఇంజనీరింగ్‌కు దేశవ్యాప్త పరీక్ష.
Tags: ఇంజనీరింగ్, పరీక్ష

Comments