సమాధులు తవ్వి ఎముకలు తిన్న జనం
జాతరంటే…. జంతువులను నరకడం.. రక్తాన్ని ఏరులై పారించడం కామన్. కానీ తమిళనాడులోని ఓ ఊళ్లో జాతర చూస్తే ఎవ్వరైనా షాక్ అవ్వాల్సిందే. వాళ్లు చేష్టలు చూస్తే గుండెలు గుభేల్ మనాల్సిందే. ఇంతకీ ఆ వేడుకంటే …అక్కడి జనం చేసే వింతలేంటీ….? మీరే చూడండి. ఇది చిత్తూరు జిల్లా కుప్పం సరిహద్దులో ఉన్న కావేరి పట్నం. తమిళనాడుకు చెందిన ఈ ఊరు ఊరంతా శ్రీ ఆంకాళ పరమేశ్వరీ జాతర జరుపుకున్నారు.
మూడు రోజుల పాటు ఆ దేవిని మనసరా కొలిచారు. చిత్రవిచిత్రమైన వేషాలతో ఎగిరి గంతులేశారు. ఇంతవరకు బాగానే అన్పించినా…చివరి రోజు సీన్ కాస్త భయంకరంగా మారింది. సంతానం లేనివాళ్లు , ఇంకా ఏవైనా కోరికలు ఉన్నవాళ్లు…..అంతా శ్మశానికి క్యూకట్టారు. ఇలా సమాధులు తవ్వేసి శవాల ఎముకల్ని చెరుకు గడలా మాదిరి కొరికి తినేశారు. వినడానికి విడ్డూరంగా …చూడ్డానికి అదోలా ఉన్న ప్రతి ఏటా జాతరలోనూ ఇదే తంతు.
అదేంటనీ అడిగితే…ఇలా చేయడం తమ ఆచారమంటున్నారు గ్రామస్తులు. ఇలా చేస్తేనే తమ దేవత కరుణిస్తుందంటున్నారు. వీళ్ల సంప్రాదాయం కాస్త మొరటుగా ఉన్నా…ఈ జాతరకు చాలా మందే ఫ్యాన్స్ ఉన్నారు. ఈ వేడుకల్ని చూడ్డానికి పెద్దయెత్తన జనం తరలివచ్చారంటే ….అంకాళమ్మ పవర్ ఏంటో అర్థం చేసుకోవచ్చు.
There are no posts related to సమాధులు తవ్వి ఎముకలు తిన్న జనం.

Comments