ప్రభుత్వ పాఠశాలల్లో రిజల్ట్స్‌కు టీచర్లదే జవాబుదారీ
* హెచ్‌ఎంలు, సబ్జెక్ట్ టీచర్లే జవాబుదారీ
* జిల్లా సగటుకంటే ఉత్తీర్ణత తగ్గితే సీరియస్ యాక్షన్
* ఫస్ట్‌టైం వార్నింగ్, తర్వాత దూరప్రాంతాలకు బదిలీ
* ఇంక్రిమెంట్‌లు కట్… క్రమశిక్షణా చర్యలు
* ఫలితాలపై దృష్టిపెట్టిన మంత్రి పార్థసారధి
* మంత్రి తీరుపై ఉపాధ్యాయసంఘాల ఫైర్
* ప్రభుత్వానిదే తప్పంటున్న టీచర్లు
* డిఈవో, ఎంఈఓ పోస్టుల భర్తీపై దృష్టిపెట్టాలని సూచన
టీచర్ల నిర్లక్ష్యమే సర్కారీ బడులకు శాపం అంటున్నారు మంత్రి పార్థసారధి. ఇకపై ఫలితాల్లో ఏమాత్రం వెనుకడుగు వేసినా సహించేది లేదంటున్నారు. పదోతరగతి రిజల్ట్స్ తగ్గితే దానికి టీచర్లు, డిఈవోలదే భాధ్యతంటున్నారు మంత్రి. బడుల్లో పిచ్చిపనులు చేస్తున్న పంతుళ్లకు శిక్షలు తప్పవంటున్నారాయన. ఐతే టీచర్ల సంఘాలు మాత్రం దీనిపై మండిపడుతున్నాయి……. అన్ని ప్రభుత్వ ఉద్యోగాల్లోకెల్లా హ్యాపీగా ఉండేది టీచర్‌జాబ్ అనుకొంటారంతా. సర్కారీ స్కూల్స్‌లో పనిచేసే టీచర్లు ఇదే ఫాలో అవుతుంటారు.
ఐతే ఇలా ఫీలయ్యేవారికి ఇకపై కష్టాలు తప్పవేమో. ప్రభుత్వ బడులను కార్పొరేట్ స్థాయికి తీర్చిదిద్దాలనుకుంటుంది సర్కార్. ఇకపై ఫలితాల్లో ప్రైవేట్‌కు గట్టిపోటీ ఇచ్చే బాధ్యత ప్రభుత్వ పాఠశాలలపై వేస్తుంది. ఈ విద్యాసంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో వచ్చే ఫలితాలకు సంబంధిత స్కూల్ టీచర్లు, డిఈవోలనే భాధ్యులను చేస్తామంటున్నారు విద్యాశాఖ మంత్రి పార్థసారధి. ఒక ఏడాది వార్నింగ్ ఇచ్చి… మళ్లీ రిపీట్ అయితే కఠినచర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు.
దూరప్రాంతాలకు ట్రాన్స్‌ఫర్ చేయడం, ఇంక్రిమెంట్‌లు కట్ చేయటం…. ఇలా ఏదొక పనిష్మెంట్ ఇస్తామంటున్నారు. అప్పటికైనా మారకపోతే సీరియస్ యాక్షన్‌లే అంటున్నారు మంత్రి. ఇక బడుల్లో వెధవ పనులు చేసే టీచర్లనూ వదలమంటున్నారాయన. మరోవైపు మంత్రి వ్యాఖ్యలపై ఉపాధ్యాయసంఘాలు సీరియస్ అవుతున్నాయి. ఇప్పటికే 16 జిల్లాల్లో డిఈవో పోస్టులు, 800కి పైగా ఎంఈవో పోస్టులు ఖాళీగా ఉండటంతో పాఠశాలలపై పర్యవేక్షణ ఎవరు చేస్తారంటున్నారు
సంఘాల నేతలు. తప్పు ప్రభుత్వంపై పెట్టుకొని టీచర్లను భాధ్యులను చేస్తామనటం విడ్డూరంగా ఉందంటున్నారు. మౌళిక వసతులపై దృష్టి పెట్టకుండా ఇష్టమొచ్చిన వ్యాఖ్యలు చేయటం సరైంది కాదంటున్నారు. ప్రభుత్వ పాఠశాలల దుస్థితికి మీరంటే…. కాదు మీరంటూ టీచర్లు, విద్యాశాఖమంత్రి ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఇప్పటికైనా అంతకంతకూ దిగజారిపోతున్న ప్రభుత్వ పాఠశాలలపై ప్రభుత్వం, అటు పంతుళ్లు దృష్టిపెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
There are no posts related to ప్రభుత్వ పాఠశాలల్లో రిజల్ట్స్‌కు టీచర్లదే జవాబుదారీ.
Tags: టీచర్లు, పాఠశాల, రిజల్ట్స్

Comments