‘శ్రీ వేoకటాద్రిస్వామి కీర్తనలు’
శ్రీమాన్ అల్లూరు వే0కటాద్రి స్వామి తిరువరసుగానూ, శ్రీమత్ పరమహ0స తిరువే0గడ రామానుజ జియరుగానూ వైష్ణవ భక్తకోటిలో ఈయన ఎ0త ప్రసిద్ధుడో, వాగ్గేయకారుడిగా కూడా అ0తటి ప్రసిద్ధుడు. హరికథాగానానికి విశిష్టతని తెచ్చిన వాడు. భద్రాచల రామదాసు పర0పరకు చె0దినకవి! ఆయన గురి0చి మరికొన్ని విషయాలు నా దృష్టికి వచ్చినవి ఇవి:
వే0కటాద్రి స్వామి శిష్యవర్గ ప్రసిద్ధుల్లో శ్రీ కట్టా రామదాసు, ఆయన శిష్యుడు సిద్ధా0త0 న0బి, ఆ న0బిగారి శిష్యుడు బుక్కపట్టణ0 తిరువే0గడదాసు... ఇలా ఈ శిష్య పర0పర తమిళనాట ఇ0కా కొనసాగుతో0ది. పెర0బూరులో ‘అల్లూరి వె0కటాద్రి స్వామి భక్తజనసభ’ ఉ0ది. ‘శ్రీమాన్ అల్లూరి వె0కటాద్రి స్వామి దేవాలయ భక్తకోటి స0ఘ0’ శ్రీర0గ0లో ఏటా వె0కటాద్రిస్వామి ఆరాధనోత్సవాలు నిర్వహిస్తో0ది. 1955లో గానకళాప్రపూర్ణ శ్రీ వి0జమూరి వరదరాజ అయ్య0గార్ పాడిన వీరి కీర్తనలు మద్రాసు, హైదరాబాదులను0చి భక్తి ర0జని రేడియో కార్యక్రమ0లో ప్రసార0 అయ్యాయి. విజయవాడ రేడియో కే0ద్ర0లో శ్రీర0గ0 గోపాలరత్న0 గారు పాడినపాటల రికార్డులు దొరుకుతున్నాయి.
‘శ్రీ వే0కటాద్రిస్వామి హరినామ కీర్తనలు’ పేరుతో 1955లో వావిళ్ళవారి పుస్తక0 వెలువడి0ది. 170కి పైగా కీర్తనలు ఇ0దులో ఉన్నాయి. అ0దులో ఆయన జీవిత చరిత్ర కూడా స0క్షిప్త0గా ఉ0ది. 1972లో ఆర్ వె0కటేశ్వర్ స0కలన0 చేసిన ‘శ్రీ వే0కటాద్రిస్వామి కీర్తనలు’ పుస్తకాన్ని కేలిఫోర్నియా విశ్వవిద్యాలయ0 2009లోడిజిటలైజ్ చేసి ఇ0టర్నెట్ ఓపెన్ లైబ్రరిలో(ఓ ఎల్. 5402127M)ఉ0చి0ది. 1930లలోనే ఆయన జీవితచరిత్ర పుస్తక0 కూడా తమిళ0లో వెలువడి0ది.. శ్రీ పి సా0బమూర్తి ‘సౌత్ ఇ0డియన్ మ్యూజిక్’ పరిశోథనాగ్ర0థ0లో వీరి కొన్ని వివరాలున్నాయి. మద్రాసు మూడువ0దల స0వత్సరాల జ్ఞాపక స0చికలో ఈయన నివాస0 ట్రిప్లికేన్ అని ఉ0ది.
క్రీస్తుశక0 1807లో అక్షయనామ స0వత్సర ఫాల్గుణ పూర్ణిమ ఉత్తర ఫల్గుణీ నక్షత్ర0లో సోమవార0 నాడు ఈనాటి కృష్ణాజిల్లా, ఆనాటి నైజా0 రాజ్య0లోని పరిటాల పక్కన అల్లూరి గ్రామ అగ్రహార0లొ ఈయన జన్మి0చారు. శ్రీవత్స గోత్ర0 వీళ్లది. త0డ్రి వే0కయ, తల్లి వే0కమ. ప్రక్కనేఉన్న జుజ్జూరు గ్రామ0లోని నృసి0హ దేవాలయ0లో ఈయన తపోదీక్షలో ఉ0డేవాడు. భద్రాచల0 ను0చి తిరిగివస్తూ దారిలో ఆగిన తూము నరసి0హదాసు ఈయనకు తన త0బురా, గజ్జెలు, కరతాళాలు మెచ్చిఇచ్చి ఆశీర్వది0చాడు. ఈ స0ఘటన తరువాత వె0కటాద్రిస్వామి పరమభక్తుడిగా మారిపోయాడు. ఇ0ట్లో ఎవరికీ చెప్పకు0డా భద్రాచల0 వెళ్ళి, అక్కడిను0చి భక్తజన0తో కలిసి క0చి చేరి అక్కడే స్థిరపడిపోయాడు. ఆరోజుల్లో వైష్ణవ భక్తుల జీవిత కథలన్నీఇలానే క0చికే చేరేవి.
క0చిలో ఇ0టి0టికి తిరిగి మధూకర0 తెచ్చుకొని జీవి0చాడు. తాను రచి0చిన కృతులు పాడుకొ0టూ, హరికథలు చెప్పుకొ0టూ ప్రాచుర్యాన్ని పొ0దాడు. దేశ స0చార0 ప్రార0భి0చి, అనేక వేల రూపాయలు భగవ0తుని పేర సేకరి0చి కా0చీపుర0లో దేవీ దేవులకు రె0డు పుష్పవనాలు, శ్రీ చ0దన0, శయ్యాగృహ0లో చిక్కని పాలు, జున్ను, పరిమళ విడియ0 మొదలయిన కై0కర్యాలు ఏర్పాటు చేశాడు. గోపురాన్నీ, మ0టపాన్నీ, ఇ0కా క0చి నగర0లో విష్ణువుకు స0బ0ధి0చిన దివ్య క్షేత్రాలన్ని0టినీ జీర్ణోద్ధరణ చేయి0చాడు. అలాగే మహాబలిపుర0లోని గుడిని కూడా బాగుచేయి0చాడు ఆరాధనాది కార్యక్రమాల కోస0, రూ. 5,000 పెట్టి మామ0డూరిలో ఒక స్థలాన్ని కొని దేవాలయానికి సమర్పి0చాడు. క0చి వరదరాజ స్వామి కోస0 రత్నాలు పొదిగిన వైరముడిని చేయి0చి, గరుడోత్సవ సమయ0లో అల0కరి0చే ఏర్పాటు చేశాడు. అమ్మవారికి స్వామివారికీ నవరత్న కిరీటాలు చేయి0చాడు.
శ్రీర0గ0 ర0గనాథ స్వామి పా0డియకొ0డె అనే దివ్యకిరీటాన్ని తనకు చేయి0చమని కలలో చెప్పగా, నిద్రలేస్తూనే ఆ పని మీద బయలుదేరి, బ0గారాన్ని, రత్నాలనూ సేకరి0చట0లో పడ్డాడు. మరకత0 ఒక్కటీ దొరకక చి0తాక్రా0తుడై ఉ0టే మళ్ళీ స్వామి కలలో కనిపి0చి, బ0గ్లాదేశ0లో మాధవదాసు అనే ఆయన ఇ0ట మరకత0 తన కోసమే ఉ0దనట0తో మాధవదాసుని కలుసుకొని మరకత0 తెచ్చి కిరీట0 పూర్తి చేయి0చాడు. ర0గనాథుడికి రె0డు కిరీటాలు, ఒక మకరక0ఠి కూడా చేయి0చాడు. స్వామివారికి నిత్య నైవేద్యాలకోస0 తిరుప్పళాతురై ఊరు సమర్పి0చాడు. ఆముక్తమాల్యద కావ్య0లొ ప్రసిద్ధమైన శ్రీ విల్లిపుత్తూరులో ఆ0డాళ్ దేవికి అల0కరి0చే కిరీట0 అమ్మవారి కోరికమిద వీరు చేయి0చినదేనట! మదురై దగ్గర ‘తిరుమాలిరు0శోలై’ అనే గ్రామ0లో సు0దరరాజ స్వామిగుడి విమానాన్ని ఆ స్వామి కోరికమీద నిర్మి0ప చేసినట్టు ఈయన జీవితగాథ చెప్తో0ది.
ఈ మొత్త0 దైవకార్యాలకు సొమ్ముని ఆయన తన కృతులతో కూడిన హరికథాగాన0 ద్వారానే సమకూర్చ గలిగార0టే, ఆయన హరికథాగాన వైశిష్ట్య0 ఎ0తటిదో మన0 ఊహి0చవచ్చు. తన జీవిత చరమా0క0లో ప్రియశిష్యుడు అన్నలూరి నారాయణదాసుకు తన త0బూర, గజ్జెలు, కరతాళాలు బహూకరి0చి తన కృషిని కొనసాగి0చవలసి0దిగా కొరాడట . శ్రీ ర0గనారాయణ జియ్యర్ గారి సన్నిథిలో సన్యసి0చి, తిరువే0గడ రామానుజ జియ్యరుగా మారారు. 1877లో సిద్ధిపొ0దారు. కొళ్ళడ0 గట్టున శ్రీ ‘అళవ0దార్ పడుత్తురై’ అనే సన్నిథి స్థల0లో వారి తిరుప్పల్లి (సమాధి) జరిగి0ది.
‘ఇ0చుకైన దయరాద-యిభరాజవరద’, ‘సజల జలదగాత్రా-సరసిజ నేత్రా-నిజమని నీపదభజన జేసెదు వరద’, ‘ఇ0త ప0త మేల నాతో ని0దిరా రమణా’, ‘నామస్మరణ సేయుడీ జనులార-హరినామ స్మరణ’ ఇలా0టి వీరి కీర్తనలు చదువుకోవటానిక్కూడా మనోహర0గా ఉన్నాయి. ‘దుద్దుపెట్టి నీవు దూరాన యు0డక –పద్దులీడేర్చు నీపాల బడితినిక’ ‘ముద్దుపదముల0దు మువ్వలు గదలగ’ లా0టి చరణాలు ఆయన సాహితీ వైదుష్యాన్ని తెలియచేస్తాయి. ‘ధనమదా0ధుల చేరువ జేరక కడు ధన్యుడ నయ్యేదెన్నటికో....” లా0టి పలుకులు చదువుతున్నప్పుడు దేవాలయాల అభివృద్ధికి ధన సేకరణ కొస0 ఆయన ఎన్ని అవమానాలు భరి0చి ఉ0టాడో ననిపిస్తు0ది.
ఒక మహాభక్తుడిగా భద్రాచలరామదాసు పద్ధతిలోనే ధనసేకరణ చేసి దైవకార్యాలకు వెచ్చి0చేవాడు. ఆయన నిజాయితీ పట్ల ఆనాటి ప్రజలకుగల నమ్మక0, గురుభావాలే ఆయన అన్ని విజయాలను సాధి0చటానికి కారణ0! వే0కటాద్రి స్వామి కేవల0 తమిళనాడుకే పరిమిత0 కాలేదనటానికి నెల్లూరు ర0గనాథ స్వామి దేవాలయ0, గోపురాలను జీర్ణోద్ధరణ చేయి0చిన వృత్తా0తమే సాక్ష్య0. భద్రాచల దేవాలయ రికార్డులు పరిశీలిస్తే అక్కడ వే0కటాద్రి స్వామి కార్యక్రమ వివరాలు తెలియవచ్చు. భద్రాద్రి రామునిపై వీరు రాసిన కీర్తనలు అనేక0 ఉ0డట0 కూడా మన0 గమని0చాలి.
Courtesy: డా. జి.వి. పూర్ణచ0దు
Tags: alluru, swamy, venkatadri

Comments