ఘటం నృత్యం!
జాతర జరిగిందంటే ఘటం నృత్యం తప్పక ప్రదర్శిస్తారు. అసలు ఘట నృత్యం లేకుండా జాతరలు జరగవు. ఈ నృత్యం ఆంధ్రదేశంలోని అన్ని పల్లెల్లో... అన్ని గ్రామాలలో ఉంటుంది. గొప్ప విశేషం ఏమిటి అంటే ఈ ఘటం నృత్యానికి ఏ విధమైన సహసాహిత్యం ఉండదు. ఉదాహరణకు భామాకలాపం, భరతనాట్యం తీసుకుంటే... అవి ప్రదర్శితమైనప్పుడు సాహిత్యంతో కూడిన అభినయం తప్పక ఉంటుంది. అది అందరికీ తెలిసిన విషయమే...
ఘట నృత్యానికి కేవలం మూకాభినయం మాత్రమే ఉంటుంది. నెత్తిమీద పసుపు, కుంకుమ, వేపాకులతో అలంకరించబడిన ఘటాన్ని ఎత్తుకుకి మూగతాండవం చేసే తీరుకే ఘటనృత్యం అని పేరు. ఇది చాలా భక్తిభావంతో, పరిపూర్ణమైన దైవభక్తితో, దేవునిమీద నమ్మకంతో చేసే నృత్యం. ఒకప్పుడు ఈ ఘటం నెత్తిమీద పెట్టుకుని ఊరేగేవారు రజక కులానికి చెందినవారై ఉండేవారు. పూర్వం పల్లెల్లో పశువులకుగానీ, మనుషులకుగానీ రోగాలు వస్తే దేవతలకు ముడుపులు కట్టి మొక్కుకునేవారు. అలా మొక్కుకుని తర్వాత కొన్ని రోజులకు జాతర జరిపి అమ్మవారిని శాంతింపజేసేవారట. అయితే ఈ మెక్కులు తీర్చుకునే సమయంలో ఉధృతంగా, ఉత్తేజంగా తప్పెట్లతో కూడిన లయబద్ధమైన నృత్యమే ఘట నృత్యం అని చెప్పుకోవచ్చు.
గ్రామదేవతలు ఏడుగురు వీరు పోచమ్మ, మైసమ్మ, ఎల్లమ్మ, బాలమ్మ, ముత్యాలమ్మ, మరిడమ్మ, మహంకాళి. వీరు కాక తెలుగు ప్రాంతంలో ఒక్కో చోట ఒక్కో పేర గ్రామ దేవతలు పూజలందు కుంటున్నారు. పల్లలమ్మ, పైడమ్మ, అంకమ్మ, గంగమ్మ అనే గ్రామ దేవతారాధనలో కనిపించే సాధారంశాలు. ఇంచుమించు అన్నిచోట్లా ఒకేలా కనిపిస్తాయి. ఈ దేవతల కొలువులు, జాతరలు, సామూహికంగా ఊరేగింపులు ఉంటాయి. ఈ దేవతలకు జంతుబలి తప్పనిసరి. ప్రత్యేకించి గుడులు ఉండవు. ఓ రాయిని పసుపు సున్నంవేసి కుంకుమతో అలంకరిస్తారు. అంటే ప్రతీకలే దేవుళ్లు. ప్రత్యేకించి పూజారులుండరు. పూజ జరిపే చోట, నిమ్నవర్గాలు, లేదా బడుగు వర్గాలు ఎవరైనా ఉండవచ్చు. కొన్ని చోట్ల పంబాలవారు బైయిండ్ల వారు, ఆసాదులు పూజారులుగా ఉన్నారు.
ఈ దేవతలు చెట్టు, గట్టు, గూడు ఎందులోనైనా కొలువుతీరి ఉంటారు. వేపచెట్లు మొదట్లో పోచమ్మ స్థిరనివాసం. అందుకే పోచమ్మలు అయినవారికి (మసూచి సోకినవారు) అమ్మవారు పోసిందని వేప ఆకు నూరి పసరుగా పూస్తారు. వేరే మందులు వాడరు. మైసమ్మ మహిషాల కాపాడే అమ్మ. పశువుల కొట్టంలో ఓ గోడకు, గూటిలో, పసుమ కుంకుమలతో అలంకరించి మైసమ్మ దేవతగా ఆరాధిస్తారు. ఈ దేవతల పూజలు వైయక్తికంగా సామూహికంగా రెండు విధాలుగా ఉంటాయి. ఎవరింటైనా శుభ కార్యం జరిగితే వ్యక్తిగతంగా పూజ ఉంటుంది. అది ఇంటికే పరిమితం. ఇక ఊరు సమష్టి భావం ఆశించి, కరవు కాటకాలు, వ్యాధులబాధలు నివారణకు చేపట్టే కొలువులు, జాతరలు ఊరు ఉమ్మడి పూజలుంటాయి. బోనాలు అటువంటి పండగ.
రంగమెక్కుటకు ముందు కుమ్మరింటినించి పచ్చి కుండ తెచ్చి భూమిలో గొంతువరకు పాతి దానిపై చేట బోర్లిస్తారు. పైన పూనకం వచ్చిన మహిళ లేదా వెల్పులోడు దానిపైకి ఎక్కి భవిష్యత్తు చెబుతారు. వాళ్లు చెప్పింది జరుగుతుందని జనం విశ్వసిస్తారు. కొందరు ప్రశ్నలు అడుగుతారు. సమాధానాలతో తౄఎప్తి పడతారు. దేవతలే తమకు ఆవిధంగా చెబుతారని భావిస్తారు. ఈ విధంగా ఆత్యంత వైభవంగా బోనాల పండగ ముగుస్తుంది. బంధు మిత్రులతో నాలుగురోజులపాటు కలసిమెలసి ఉంటారు. సుఖ సంతోషాలు పంచుకుంటారు. బడుగు బలహీనవర్గాలకు బతుకమ్మ పండగకంటే బోనాలు ముఖ్యమయిన పండగ. గుడికి వెళ్లని వాళ్లుకూడా ఈ బోనాల పండుగలో పాల్గొని భక్తిని చాటుతారు.
ఈ దేవతల పూజలు వైయక్తికంగా సామూహికంగా రెండు విధాలుగా ఉంటారుు. ఎవరింటైనా శుభ కార్యం జరిగితే వ్యక్తిగతంగా పూజ ఉంటుంది. అది ఇంటిేక పరిమితం. ఇక ఊరు సమష్టి భావం ఆశించి, కరవు కాటకాలు, వ్యాధులబాధలు నివారణకు చేపట్టే కొలువులు, జాతరలు ఊరు ఉమ్మడి పూజలుంటారు.
Courtesy: Surya Daily.

Comments