24 నుంచి యాదగిరిగుట్ట బ్రహ్మోత్సవాలు
* భారీ ఏర్పాట్లు చేసిన ఆలయ అధికారులు
ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనర్సింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరిపేందుకు ఏర్పాట్లు చేశారు. ఈనెల 24 నుంచి మార్చి 5వరకు బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించనున్నారు. మార్చి 1న స్వామివారి ఎదుర్కోలు, 2న కళ్యాణం, 3న దివ్యవిమాన రథోత్సవాలు జరుగుతాయి. 30లక్షల నిధులతో ఆలయంలో అన్ని సదుపాయాలు కల్పిస్తున్నారు. చలువ పందిళ్లు, ప్రతిరోజు అన్నదానం, భక్తులకు సరిపడే ప్రసాదాలను తయారు చేశారు.
Tags: బ్రహ్మోత్సవాలు, యాదగిరిగుట్ట

Comments