హీరోయిన్ అనుష్క త్వరలో స్క్రీన్‌పై గర్భం దాల్చబోతోనట్తించట్లు నటించనుంది . బాలీవుడ్‌లో హిట్ అయిన ‘కహానీ’ చిత్రానికి రీమేక్‌గా తెలుగు/తమిళంలో రూపొందుతున్న చిత్రంలో అనుష్క దాదాపుగా ఖరారైంది. కహానీ చిత్రంలో విద్యాబాలన్ పోషించిన పాత్రను అనుష్క పోషించనుంది.
కొన్ని రోజుల క్రితం ‘కహానీ’ చిత్రాన్ని స్వయంగా వీక్షించిన అనుష్క…..అందులో విద్యా బాలన్ పోషించిన పాత్ర పట్ల మక్కువ పెంచుకుంది. తను తనకు ఈ చిత్రంలో నటించాలని ఉందంటూ….ఆ చిత్రం దక్షిణాది రీమేక్ హక్కులు సొంతం చేసుకున్న నిర్మాతలకు సంకేతాలు పంపింది.
కనిపించకుండాపోయిన తన భర్త గురించి ఒక ఎన్‌ఆర్‌ఐ గర్భిణి చేసే అన్వేషణే ఈ కహానీ చిత్ర కథ. అనేక హాలీవుడ్ సినిమాల స్ఫూర్తి చేసిన ఈ సినిమా హిందీలో ఘన విజయం సాధించడంతో తెలుగులో కూడా చేయడానికి నిర్మాతలు తహతహలాడుతున్నారు.
* మెగాస్టార్ తనయుడు రామ్‌చరణ్, ఉపాసనల పెళ్లి ముహూర్తం ఖరారు
* జూన్ 14న వివాహం జరపడానికి నిర్ణయించిన పెద్దలు
* పెండ్లి పత్రికను తిరుమలేశుని పాదాల చెంత ఉంచిన చిరంజీవి సతీమణి
సినీ నటుడు రామ్‌చరణ్, ఉపాసనల పెళ్లి ముహూర్తం ఖరారైంది. జూన్ 14న వివాహం జరపాలని పెద్దలు లగ్నం కుదిర్చారు. రామ్‌చరణ్ , ఉపాసనల పెండ్లి పత్రికను తిరుమలేశుని పాదాల చెంత ఉంచి ఆశీస్సులు పొందారు. రామ్‌చరణ్ తేజ తల్లి సురేఖ తొలిపత్రికను తిరుమలేశునికి సమర్పించారు. అలాగే శ్రీవారి పాదాలు, తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి పాదాల వద్ద ఉంచి పూజించారు.
* ఇప్పటికీ ఎడమొహం.. పెడమొహంగానే రేఖ, జయ
* రాజ్యసభలోనూ సేమ్ సీన్ రిపీట్
* కొత్తగా ప్రమాణం చేసిన రేఖను విష్ చేయని జయ
* రాజ్యసభ టీవీపై మిస్సెస్ బచ్చన్ ఆగ్రహం
బాలీవుడ్ అందాలనటి రేఖ.. రాజ్యసభ ప్రవేశం అనేక ఆసక్తికర అంశాలకు వేదికవుతోంది. సినీ ఇండస్ట్రీలో బద్ధ విరోధులుగా చెప్పుకునే జయా బచ్చన్.. రేఖ.. ఒకే సారి రాజ్యసభలో కనిపించడం అందరినీ ఆకట్టుకున్నా.. తనను పదే పదే టీవీలో చూపించడంపై జయ మండిపడ్డారు. ఇంతకీ రేఖ రాజ్యసభలోకొస్తే జయకు ఏం ఇబ్బంది.. ? కొత్తగా సభలో అడుగుపెట్టిన సహచర ఎంపీని.. ఒక సీనియర్‌గా ఆమె పలకరిస్తే ఏమయ్యేది.. ? ఇవే ఇప్పుడు అందరి మదినీ తొలుస్తున్న ప్రశ్నలు..
ఆడవాళ్ల మధ్య స్నేహం, వైరం ఎక్కువ కాలం కొనసాగదంటారు. కానీ ఓ ఇద్దరి మధ్య ఏర్పడిన అగాధం మాత్రం ముప్పై ఏళ్లుగా అలాగే ఉంది. వాళ్లెవరో సామాన్యులు కాదు. బాలీవుడ్ నిన్నటితరానికి చెందిన అగ్రహీరోయిన్లు.. జయాబచ్చన్, రేఖ. 1970 చివర్లో వీరిద్దరి మధ్య మొదలైన విబేధాలు ఇప్పటికీ అలాగే ఉన్నాయి. ఫలితంగా వీరిద్దరూ ఇప్పటి వరకు పెద్దగా ఎదురపడ లేదు.. పొరపాటున పడ్డా… ఎడమొహం పెడమొహంగానే ఉన్నారు.
1981 లో వచ్చిన సూపర్ హిట్ సినిమా సిల్‌సిలాలో కలిసి నటించిన ఈ హీరోయిన్ల మధ్య.. అమితాబ్ విషయంలో పొరపొచ్చాలు వచ్చాయని ప్రచారం. అమితాబ్, రేఖ మధ్య నడిచిన ప్రేమాయణం.. మిస్సెస్ బచ్చన్ అగ్రహానికి కారణమని చెప్పవచ్చు. ఆ తర్వాత అంతా సద్దుమణిగినా.. వీరిద్దరి మధ్య ఏర్పడిన అగాధం మాత్రం అలాగే ఉండిపోయింది. తాజాగా రేఖ రాజ్యసభ ఎంపీగా ప్రమాణస్వీకారం చేసినప్పుడు కూడా.. జయ ముభావంగానే కనిపించారు. ముక్కు నలుపుకుంటూ చిరాగ్గా కనిపించారు. చివరికి.. రేఖ సీటు తనకు దగ్గర్లో ఉంటుందని తెలిసి.. తన స్థానం కూడా మార్పించుకున్నారంటే.. వీరిద్దరి మధ్య ఎలాంటి వాతావరణం ఉందో అర్థం చేసుకోవచ్చు.
రేఖ సభలోకి రావడం జయకు గిట్టలేదో ఏమో.. ఆమెపై ఉన్న అక్కసును రాజ్యసభ టీవీ వారిపై తీశారు. రేఖ ప్రమాణస్వీకారం చేస్తుంటే పదే పదే తనను ఎందుకు చూపించడమంటూ మండిపడ్డారు. దీనిపై ఆమె ఛైర్మన్ కు ఫిర్యాదు చేశారని వార్తలు వచ్చినా.. అవేమీ లేదంటూ రాజ్యసభ సెక్రటేరియట్ కొట్టిపారేసింది. మొత్తం మీద… జయ పాత విషయాలను ఇంకా మర్చిపోలేదనడానికి ఈ ఘటన ఓ ఉదాహరణగా చెప్పవచ్చు. అయితే ఓ సహచర ఎంపీ కొత్తగా సభలోకి వస్తే కనీసం పలకరించవచ్చు కదా అనే వాళ్లూ లేకపోలేదు.

పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ లో సెన్సార్ వారు కొన్ని సీన్స్ డిలేట్ చేసారు. అలాగే కొన్ని డైలాగులును తొలిగించారు. వాటిని దర్శకుడు హరీష్ శంకర్..తన ఫేస్ బుక్ ఎక్కౌంట్ లో ఉంచారు. అవేమిటంటే…
2. విలన్ : నువ్వు సింహం తో పెట్టుకున్నావని గుర్తుంచుకో…
3. గబ్బర్ సింగ్: నీలాంటి సింహాలు జింకల దగ్గరో,కుక్కల దగ్గరో ప్రతాపం చూపించాలి గనీ..నా లాంటి వేటగాడు ఎదురు వచ్చనప్పుడు వళ్లు దగ్గర పెట్టుకోవాలి.
తొలిగించిన విజువల్స్ …
1.గూండాలతో కబ్బడి ఆడేటప్పుడు ..వారిని బెల్ట్ తో కొడుతుప్పుడు అశోక్ చక్రం ఎంబ్లం ని బ్లర్ చేసారు.
2. కసై అనే పదం తొలిగించారు.
3. మందు బాబులం పాటలో …పోలీస్ సింబల్,అశోక్ ఎంబ్లం,అబ్దుల్ కలాం ఫోటో విజువల్స్ బ్లర్ చెయ్యమన్నారు.
4. క్లైమాక్స్ లో విలన్ చెప్పే …దీనిమ్మ తల్లి కూడా తేడానా అనే డైలాగు తొలిగించారు.
5. గాయిత్రి చెప్పే..ఆకు ఎండిపోవటం కన్నా చిరిగిపోవటం బెటర్ ..అనే డైలాగుని..ఆకు ఎండిపోవటం కన్నా ఏదో అయిపోవటం బెటర్ అనే డైలాగుతో మార్చమన్నారు.
6. కబడ్డి సీన్ లో అలీ చెప్పే నీ అయ్యి డైలాగుని తీసేసారు.
7. మీరు గీకాలే కానీ రేషన్ కార్డు అయినా తీసుకుంటాం అనే డైలాగుల ..గీకాలే కానీ అనే పదం తొలిగించారు.
8. గాయిత్రితో పవన్ కళ్యాణ్ …తగులుకుంటారు అని చెప్పే పదాన్ని తొలిగించారు.
9. జాకెట్ నుంచి మొబైల్ తీసే విజువల్ ని తొలిగించారు. అలాగే హస్త ప్రధాన శాల వద్ద మీకు చూపిస్తే చాలా…ఇన్ కమింగ్ ఫ్రీ డైలాగులు తీసేసారు.
10. కెవ్వు కేక పాటలో మలైకా అరోరా క్లోజప్ క్లవరేజ్ ఎక్సపోజర్ బ్లర్ చేసేసారు.
* సీక్వెల్ నడవదనే నమ్మకం చెరిపేస్తానంటున్న మహేష్
* త్వరలో సీక్వెల్‌కు రడీ అవుతున్న సూపర్‌స్టార్
* సీక్వెల్స్ అచ్చిరావనే నమ్మకంతో టాలీవుడ్
టాలీవుడ్‌లో సీక్వెల్స్‌కి అచ్చిరాలేదు. అయితే ఆ నమ్మకాన్ని చెరిపేద్దామనుకుంటున్నాడు మహేష్‌బాబు. ఇంతకీ ప్రిన్స్ చేయబోతున్న సీక్వెల్ ఏమిటి? తన సినిమాకా లేక కృష్ణ నటించిన ఏదైనా సినిమాకు సీక్వెల్ చేస్తాడా? ప్రస్తుతం ఫాన్స్‌లో ఉత్కంఠ రేపుతున్న సందేహాలు ఇవే.
రాజమౌళి ఈగ కోసం ఇండ్రస్ట్రీ వర్గాలే కాదు కామన్ ఆడియెన్స్ కూడ తెగ వెయిట్ చేస్తున్నారు. ఒక ఈగ ని బేస్ చేసుకొని రూపొందిన ఈగ ఎలా వుంటుందనే క్యూరియాసిటీ మూవీ పై ఓ రేంజ్ ఎక్స్ పెక్టేషన్స్ ని పేంచేసాయి. ఇక లేటెస్ట్ గా రిలీజు చేసిన ప్రొమో తో మరింత అట్రాక్ట్ చేస్తున్నారు రాజమోళి. మరి రిలీజు తర్వాత ఈగ ఎన్ని రికార్డ్సుని బద్దలు కొడుతుందో .
కోల్‌కతా నైట్‌రైడర్స్ సహయజమాని షారుఖ్ ఖాన్ ముంబయి క్రికెట్ అసోసియేషన్‌కు కౌంటర్ ఎటాక్ ఇచ్చారు. మైదానంలోకి వచ్చినప్పుడు తానసలు తాగి లేనని అన్నారు. తనకూ ఎమ్‌సీఎ అధికారులకు మధ్య జరిగిన వాగ్వాదం సమయంలో అధికారులు అమ్మాయిల పట్ల అసభ్యంగా ప్రవర్తించారని ఆరోపించారు.
అలా వాళ్లు ప్రవర్తించేసరికి తనకు కోపం కట్టలు తెంచుకున్నదని అన్నారు. ఒకవైపు తాను మాట్లాడుతుండగానే కొంతమంది అధికారులు పిల్లల్ని వెనుక నుంచి కొడుతున్నారని అన్నారు.
దాంతో వాళ్లను దారిలో పెట్టేందుకు ఏవో నాలుగు మాటలు అన్న మాట నిజమేనని ఒప్పుకున్నారు. ఐతే ఆ నాలుగు మాటలు అనడానికి కారణం మాత్రం అధికారులేనని చెప్పుకొచ్చారు. కనుక తనకు భేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
తనపై నిషేధం విధించనున్నారనే వార్తలు రావడంపై తనకు ఏమీ తెలియదన్నారు. అయినా తానేం తప్పు చేశానని నిషేధిస్తారంటూ నిలదీశారు. తప్పు చేసిందంతా ఎమ్‌సీఎ అధికారులేననీ, చర్య తీసుకుంటే వారిపైనే తీసుకోవాలన్నారు.
తమిళ తంబీలు మనసు మార్చుకున్నారా..? భారీ ఎద అందాలున్న భామలుంటేనే సినిమాలు చూసే తమిళ తంబీలు తమ ట్రెండ్‌ను మార్చుకున్నట్లే కనబడుతోందంటున్నారు కోలీవుడ్ జనం. అదేంటయా..? ఖుష్బూ, నగ్మా మొదలుకొని నమిత వరకూ ఎద అందాలు పుష్కలంగా ఉంటేనే ఆదరించారు.. అలాంటిది ఈ ట్విస్ట్ ఏమిటీ.. అనుకుంటున్నారా.. ఇక్కడే ఉంది అసలు కథ.
తాజాగా అజిత్ నటించే ఓ సినిమాకు తొలుత రిచా గంగోపాధ్యాయను అనుకున్నారట దర్శకులు. ఫోటో షూట్ కూడా చేశారట. ఇంతలో ఏమైందో ఏమోగానీ ఆమె ప్లేస్‌లో తాప్సీని తీసుకుంటున్నట్లు ప్రకటించేశారట సదరు దర్శకనిర్మాతలు.
ఏమైందయా.. రిచాను కాదని తాప్సిని ఎందుకు తీసుకున్నారని అడిగితే… రిచా ఎద అందాలు మరీ మితిమీరినట్లు కనబడటంతో ఆమెను కాదనుకున్నట్లు చెప్పుకొచ్చాడట సదరు డైరెక్టర్. అదేసమయంలో తాప్సీ ఎద అందాలను స్లిమ్‌గా చూడముచ్చటగా మెయిన్‌టైన్ చేయడమే కాకుండా మితిమీరినట్లు లేవనీ, అందువల్లనే ఆమెకు ఆఫర్ కట్టబెడుతున్నట్లు చెప్పుకొచ్చాడట ఆయన.
ఏమి ఇండస్ట్రీయో ఏంటో.. ఎక్స్‌పోజింగ్ చేయకపోతే ఏమీ చూపట్లేదు.. అందుకే ఆఫర్లు లేవంటారు.. చూపించేందుకు కష్టపడి మెయిన్‌టైన్ చేస్తే… అబ్బో ఎక్కువైందంటారు.. ప్చ్.. అని నిట్టూరుస్తోందట రిచా.
ఫ్లాపులతో నెగెటివ్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న శ్రుతిహాసన్ గబ్బర్‌సింగ్‌తో హిట్ హీరోయిన్‌గా మారిపోయింది. హరీష్ శంకర్, పవన్ కళ్యాణ్ చిత్రం కావడంతో వారు బాగా తీశారనీ, అందులో నేను నటించడం గర్వంగా ఉందని చెప్పింది. మంగళవారం రాత్రి మీడియా ముందుకు వచ్చింది.
హిట్ టాక్‌తో మీరెలా ఫీలవుతున్నారు అని అడిగితే…. చాలా ఆనందంగా ఉంది. మొదట నన్ను తీసుకునేటప్పుడు చాలామంది ఐరన్‌లెగ్ అని అన్నారని దర్శకులే చెప్పారు. నేనూ విన్నాను. ఇప్పుడు షడన్‌గా గబ్బర్‌సింగ్ హిట్టుతో గోల్డెన్ లెగ్ అంటున్నారు. పరిస్థితులను బట్టి మాట్లాడేవారి గురించి నేను పట్టించుకోను అంది.
కానీ, ఇక్కడో విషయం చెప్పాలి. గబ్బర్‌సింగ్ సినిమా చేస్తున్నాను. అనగానే పాజిటివ్ రియాక్షన్స్ కొన్ని కన్పించాయి. ఇది హిట్ అవుతుందనే నమ్మకం వచ్చింది. అలాగే అనుకున్నట్లు జరిగింది. దీనికి ప్రధానకారకుడు పవన్‌కళ్యాణే. ఆయన చాలా గ్లామర్‌గా కన్పించడంతోపాటు… ఒన్‌మాన్ షోగా సినిమా మోసారు.
మీ నాన్నగారు ఎలా స్పందించారు అన్న ప్రశ్నకు….. ఇండస్ట్రీలో గెలుపు ఓటములు మామూలే… నువ్వేఫీలవ్వకు. అని మొదటి సినిమా చేసేటప్పుడు చెప్పారు. ఇప్పుడు ఆయన చాలా హ్యాపీగా ఉన్నారు అంది
ఎక్కడో పుట్టి… ఎక్కడో పెరిగి… ఎక్కడో వున్నాము…వి్వ వ్యాప్తంగా విస్తరించి వున్న మన తెలుగు ప్రజలందరం ఒక్క చోట చేరాలన్న ఆకాంక్షతో చేస్తున్న నా ఈ చిరు ప్రయత్నమే “ప్రవాసరాజ్యం”( www.pravasarajyam.com )
UAE Phone: +971 509 772055
Email: uae@pravasarajyam.com
USA Phone: 912-246-6649
Email: usa@pravasarajyam.com
India Phone: +91-40-64592288
Email: ind@pravasarajyam.com