అంతర్వేదికి నూతన శోభ
వైభవంగా లక్ష్మీనరసింహస్వామి కళ్యాణోత్సవం
* భారీగా తరలివచ్చిన భక్తులు
తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది లక్ష్మీనర్సింహస్వామి కళ్యాణ మహోత్సవం కనుల పండువగా జరిగింది. వేద మంత్రోచ్చారణల మధ్య స్వామి వారి వివాహం వైభవంగా జరిపించారు. లక్షలాది మంది భక్తులు తరలివచ్చి స్వామి వారిని దర్శించుకుని తరించిపోయారు. అంతర్వేది లక్ష్మినరసింహస్వామి కళ్యాణోత్సవం వైభవంగా జరిగింది. వేదపండితులు ఉభయ దేవేరులతో స్వామివారి కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు.
ట్రెజరీ నుంచి తీసుకువచ్చిన ఏడు వారాల నగలను స్వామి వారికి అలంకరించారు. స్వామివారికి నూతన వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు. నరసింహుని కళ్యాణానికి లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు. కళ్యాణం అనంతరం త్రివేణి సంగమంలో స్నానాలు చేశారు. విద్యుత్ దీప కాంతులతో అంతర్వేది నూతన శోభను సంతరించుకుంది. స్వామి వారి కళ్యాణానికి పలువురు ప్రముఖులు కూడా తరలివచ్చారు.
మంత్రి పినిపే విశ్వరూప్‌తో పాటు కలెక్టర్ రవిచంద్ర, ఎస్పీ త్రివిక్రమ్ వర్మ , పలువురు ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఇవాళ మధ్యాహ్నం స్వామివారి రథోత్సవాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలిరానున్నారు.
There are no posts related to అంతర్వేదికి నూతన శోభ.

Comments