తండ్రి ఎంతో కొడుకు అంతే
డాన్సర్, నటుడు, డైరెక్టర్ ప్రభుదేవా పెండ్లి గురించి చర్చ జరుగుతూనే ఉంది. అయితే సినిమా పెళ్లిళ్లు ఉత్తిత్తివని భావించే కొందరికి ఇది మాంచి టాపిక్ అయింది. నయనతారకు ప్రభుదేవాకు ఎక్కడ లింక్ కుదిరిందో గానీ వీరి పెళ్లప్పుడవుతుందని కొంతమంది సినీ జీవులు బుర్రలు బద్ధలు కొట్టుకుంటున్నారు.
ఐతే రోజురోజుకూ ఒకరిపై ఒకరికి ఇంట్రస్ట్ తగ్గిపోయి ఇద్దరి మధ్య వ్యత్యాసం రావడంతో ఇద్దరూ చాలా దూరమైపోయారట. కొందరు కొరియోగ్రాఫర్లు మాత్రం ఈ విషయాన్ని ఖండించారు. తమ డాన్స్ మాస్టర్ ప్రభుదేవా అటువంటివాడు కాదని వాదిస్తున్నారు.
ఇదిలావుంటే తాజాగా ప్రభుదేవా నాన్న సుందరం మాస్టర్… మరో డాన్సర్ తారను ఏళ్ల క్రితమే రహస్య వివాహం చేసుకున్నాడనీ, సుందరంకు తనకు పుట్టిన మగబిడ్డకు న్యాయం చేయాలని ఆమె రచ్చకెక్కింది. ఇదే సమయంలో ప్రభుదేవాల వివాహం పెడాకులు కావడంతో, సుందరం మేస్టారు కుటుంబమే అంత అని అనుకుంటున్నారట కోలీవుడ్ సినీజనం.
There are no posts related to తండ్రి ఎంతో కొడుకు అంతే.

Comments