ఇండస్ట్రీని గుప్పిట్లో ఆడిస్తున్న సురేష్ బాబు
అవుననే తెలుగు ఇండస్ట్రీలో చిన్న నిర్మాతలు అంటున్నారు. తన గుప్పెట్లో ఇండస్ట్రీని పెట్టుకుని కార్మికులను కూడా ఆడించేస్తున్నారని ఆరోపిస్తున్నారు. కార్మికుల వేతనాలకోసం దీక్ష చేపడితే.. నిర్మాతలకు పలు సమస్యలున్నాయని… ఏకంగా షూటింగ్‌లనే బంద్ చేసేందుకు కారకులు సురేష్‌బాబనే విమర్శ ఉంది.
అలాగే థియేటర్లు కూడా చిన్న నిర్మాతలకు దొరక్కపోవడానికి ఇండస్ట్రీ పెద్దల్లో ఆ నలుగురిలో సురేష్‌బాబే కీలకమని చెపుతున్నారు. కాగా, సెంట్రల్ గవర్నరమెంట్ సినిమా రంగానికి విధించాలనుకున్న వ్యాట్‌కు వ్యతిరేకంగా ఈనెల 23న దేశవ్యాప్త సమ్మె చేయాలని నిర్ణయించాయి. ఇందుకు అనుగుణంగా అన్ని రాష్ట్రాలు ఓకే అన్నాయి.
కానీ.. ఒక్క తెలుగు ఇండస్ట్రీ మాత్రం వెనుకంజ వేసింది. దీనికి కారణం డి.సురేష్‌బాబేనని వేలెత్తి చూపుతున్నారు. తను ప్రణబ్‌ముఖర్జీతో మాట్లాడాననీ, ఇండస్ట్రీ సమస్యలు చెప్పాననీ… త్వరలో పరిష్కారం చూపిస్తానని హామీ ఇచ్చారని అందుకే బంద్ జరపడం లేదని చెబుతున్నారు.
అయితే సురేష్‌బాబు మాటలతో మరికొందరు ఏకీభవించడం లేదట. తాము కలిశాం… కానీ…. ఆయన మాట ఎంతమాత్రం ఆమోదయోగ్యంగా లేదని వారు వాదిస్తున్నారట. మొత్తమ్మీద… అందరూ ఒక దారిలో వెళుతుంటే… తెలుగు పరిశ్రమ మరో దారిలో వెళుతోంది. ఈ పరిణామం ఎలాంటి మలుపులు తిప్పుతుందో చూడాలి.
There are no posts related to ఇండస్ట్రీని గుప్పిట్లో ఆడిస్తున్న సురేష్ బాబు.
Tags: సురేష్ బాబు

Comments