
జగనంత కుటుంబం నాది..ఏ గని చూసినా నాది..ఏ పని చూసినా నాది.. భారతి స్టీల్స్ నాది..సరస్వతి స్టీల్స్ నాది..ఇడుపుల పాయలో ..ముడుపుల మాయల గూర్చిన పాట ఇది.అంతటా మారుమ్రోగి పోతోంది..
కొన్నాళ్ళ క్రితం పాద యాత్రతో ఆంధ్ర ప్రదేస్ మొత్తాన్ని స్కాన్ చేసి-స్కాం లకి ప్లాన్ వేసి…రాష్ట్రం మొత్తం చుట్ట చుట్టిన సారు – హిరణ్యాక్షుడు భూమిని చుట్ట చుట్టినట్టుగా – చుట్ట చుట్టి చట్టాలకు దొరక్కుండా – చిట్టి తనయుడికి- చుట్టలకి చిట్టా పంచి ఇచ్చేశాడు.
కొండల్-కోనలు- లోయలు-ఇడుపుల పాయలు..ఒక్కటీ వదలకుండా కడప లో మొదలెట్టి – భూమి కడుపులో ఉన్నదంతా దోచుకుని దాచుకునే లైసెన్సులిచ్చేసాడు..
తండ్రి అధికారం సాక్షి గా సంపాదించిందంతా పెట్టుబడిగా లైఫ్ లు మార్చేసే సరికొత్త ఐడియాలతో కోట్లు సంపాదించేసాడు.తండ్రి అండతో చాప కింద ‘నీరు ‘ లా కనపడకుండా నీతికి ‘నిప్పు ‘ పెట్టి ‘గలి ‘ తోదవడంతో సంపాదనే ధ్యేయంగా ‘ఆకాశం ‘ కింద ఉన్న ‘భూమి ‘ అంతా కొల్లగొట్టే పని లో ఉన్నాడు.
అవినీతి సంపాదనకి ‘సాక్షి ‘ గా ఓ పత్రిక – ఓ టీ వీ చానెల్ కూడా ఉండడంతో చేసిన తప్పుల్ని ఒప్పులుగా చూపించడం.. ప్రతిపక్షం మీదే కాక స్వపక్షం మీద కూడా బురద జల్లడం..
తరలించిన జనాన్ని – డబ్బుకోసం వచ్చే నాయకులని – అభిమానులుగా- అనుచరులుగా చూపించి.. అధిష్టానాన్ని బెదిరించడం – ఓదార్పు యాత్ర పేరుతో – పార్టీ ఓర్పును పరీక్షించడం -
లాంటి పొలిటికల్ ఫాక్షనిజం తో జనాలకి ‘నిజం ‘ తెలీకుండా చేసే ప్రయత్నం లో ఉన్నాడు — ప్రస్తుతం రాజ్యాధికారం దక్కని ‘ యువ ” రాజు ‘ ..ఏమిటో అనుకున్నా కానీ ధనం! మూలమిదం “జగత్” అంటే ఇప్పుడే అర్ధం తెలుస్తోంది..
“సార్! మీ ఆవిడ నుంచి ఫోన్” సెక్రటరీ అన్నాడు బాస్‌తో.
రెండు నిముషాలు అలాగేపట్టుకు నిలబడి ఆ తర్వాత ఇవ్వు!
“అదేమిటి సార్?”
“ప్రారంభంలో ఓ రెండు నిముషాలు.. డిష్యుం – డిష్యుంలుంటాయి.
అసలు సంగతి తర్వాతకు గానీ చెప్పే అలవాటు లేదావిడకి”.
“మామూలు తాళంతో బాటు కాంబినేషన్ లాక్ కూడా ఉన్న ఆ
బీరువాను నువ్వు ఎలా తెరవగలిగావు…?” అడిగాడు జడ్జి.
ముద్దాయి కాస్త సందేహిస్తూ “ఇలాంటి కిటుకులు చెప్పడానికి
సాధారణంగా వెయ్యి రూపాయల వరకూ ఫీజు తీసుకుంటా…” అన్నాడు.
ఓ కమర్షియల్ కాంప్లెక్స్‌లో కొత్తగా ఎస్కలేటర్‌ని పెట్టారు.
పక్కనే బోర్డుమీద ఇలా రాసి ఉంది.
“ఎస్కలేటర్ మీదకెళ్లదల్చుకున్నవాళ్లు కుక్కల్ని చేత్తో ఎత్తుకొని పట్టుకోవాలి.”
“పైఫ్లోర్‌కి వెళ్లాలనుకున్న ఒకాయన అది చూసి ఇదెక్కడి గొడవరా బాబు!
ఇప్పుడు కుక్కని వెతికి తెచ్చుకోవాలా! అనుకుంటూ వీధిలోకెళ్లాడు కుక్కనువెతకడానికి.”
“నాన్నా…! ఎదురింటబ్బాయి నాకు కన్నుకొడుతున్నాడు…” అంది కూతురు.
“వాడెప్పుడూ అంతే నమ్మా… ఏదో ఒకటి తీసుకొని ఎవరో ఒకర్ని
కొడుతూనే ఉంటాడు. ఈ సారి నువ్వుకూడా కొట్టేయ్…”
పరధ్యానంగా అన్నాడు తండ్రి.
“బాబయ్యా… బాబయ్యా.. గుడ్డివాణ్ణి ఓ రూపాయి
ధర్మం చేయండి బాబయ్యా….!”
“అబద్ధం నీవు గుడ్డివాడివి కాదు. నీకు ఓ కన్నుకనిపిస్తోంది….”
“పోనీ అర్థరూపాయి ఇవ్వండి బాబయ్య….”
ఆ మహిళా సంఘం వాళ్లు నన్ను చుట్టుముట్టి పదిటికెట్లు కొనేదాకా వదలలేదు.
నువ్వు ఒక్కటిక్కెట్టూ కొనకుండా ఎలా తప్పించుకోగలిగావురా బాబు! అన్నాడు వెంకట్.
“ఏముందీ! మీ పదిమంది దగ్గరాటిక్కెట్లు కొనగలను. మీలో కాస్త పెద్ద
వయసువాళ్లు ముందుఇస్తే సరి! అన్నాడు. అంతే అందరూ మాయమయ్యారు.”
అసలు కిటుకు చెప్పాడు సూర్యం.
సావిత్రి : “పైసా ఖర్చు లేకుండా అమ్మాయి పెళ్ళిచేశారంటే గొప్పే
అన్నయ్యగారు భలే సంబంధం వెతికారే.!”
లత : “మీ అన్నయ్యగారు ఏమీ వెతకలేదు వదినా అమ్మాయే
కష్టపడి వెతుక్కుంది”
“మొన్న రిలీజైన కొత్తసినిమాలో ఒకరోలు వేశానన్నావు.
ఫస్ట్‌డే – ఫస్ట్ షో చాలా జాగ్రత్తగా చూశాను. ఎక్కడా కనిపించలేదే?”
“పిచ్చివాడా! ఆ సినిమాలో హీరోయిన్ పెళ్లిరోజు, పేరాంటాళ్లు దంచిన
పసుపు “రోలు” సెట్లో వేసిందెవరనుకున్నావు, నేనే!”
“పేషంట్‌కు రెండొందలు బిల్లు వేశారు బాగానేవుంది. మరి…
పేషెంట్‌తో పాటు వచ్చినాయనకి కూడా రెండొందలు బిల్లు వేశారేం?”
“అవును! పేషెంట్ బిల్లు వినగానే తీసుకువచ్చినాయన పడిపోయాడు.
ఆయనకు రెండు సెలైన్స్ ఎక్కించాం మరి!”