‘ప్రేమకు అర్థం తెలియాలంటే చూడాల్సింది నిఘంటువు కాదు, అమ్మ ముఖాన్ని…’ అన్నాడో కవి అది అక్షర సత్యం… అమ్మ అన్న దేవత లేకపోతే… నేను, నువ్వు, మనం… ఈ సమస్త మానవాళి ఉండదు. అలాంటి అమృతమయి మాతృమూర్తిని తలుచుకునేందుకు మనకు ఓ రోజు ఉంది అదే ‘మదర్స్ డే’ ప్రతి ఏటా మే రెండవ ఆదివారం ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే పండుగే ‘అంతర్జాతీయ మాతృ దినోత్సవం’…
ఆత్మానురాగం… ప్రేమ బాంధవ్యాలను పంచే అమ్మ అనురాగం మాటల్లో చెప్ప లేనిది. నవమాసాలు మోసి, తన పిల్లల కోసం పరితపిస్తుంది అమ్మ. ఆకాశమంత ప్రేమ అందించే అమ్మ తన పిల్లలు పెరిగి, ఎంత పెద్దవారైనా… పసి పిల్లాడిగానే తపి స్తుంది. సృష్టికి మూలమైన ‘అమ్మ’ కోసం ప్రతి సంవత్సరం ఘనంగా జరుపుకునేదే ‘మదర్స్ డే’. అమ్మ కమ్మని ప్రేమను గుర్తు చేసుకుని… తమ అభిమానాన్ని చాటుకు ‘మదర్స్ డే’కు కూతుళ్లు, కొడుకులు, స్వచ్ఛంధ సంస్థలు, వృద్ధాశ్ర మాలు వేడుకను జరుపుకుంటోంది. బిజీగా ఉండే వారు కొందురు… దేశ, విదేశాల్లో ఉండే మరి కొందరు ఈ మెయిల్స్, గ్రీటింగ్స్ కార్డ్‌స ద్వారా శుభాకాంక్షలు తెలుపుతుండగా, కొందరు ఖరీదైన బహుమతులు అందజేస్తూ తమ అభిమానాన్ని చాటుకుంటుంటారు.
పెదవే పలికిన మాటల్లోని తియ్యని మాటే అమ్మ… నడిచే దేవత అమ్మ అని ఓ సినీ కవి అద్భుతంగా అమ్మ గొప్పతనాన్ని వివరిం చారు. మాటలు నేర్చుకుంటున్న బుజ్జాయి తొలి పలుకు అమ్మ… ఊహ తెలిసే క్షణానికి మొదటి గురువు అమ్మ. చివరికి బాధ కలిగితే నోటి వెంట వచ్చే తొలి ఆర్తనాదం కూడా అమ్మే. తాను కొవ్వొత్తిలా కరిగిపో తూ… పిల్లలకు వెలుగునిచ్చే అమ్మ రుణం ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేం…
జన్మనిచ్చిన తల్లికి ప్రతి ప్రాణి జన్మజన్మలకి ఋణపడి ఉంటుంది. ఎందుకంటే ఇవ్వ టమే కానీ తీసుకోవడం తెలియదు తల్లి మనసుకి. మాతృప్రేమలోని మాధు ర్యం… తల్లిఒడిలోని వెచ్చదనం గురించి వర్ణించడానికి మాటలు చాలవు. అంబరాన్నంటే అమ్మప్రేమను ఎంద రో కవులు ఎన్నోరకాలుగా వర్ణిం చారు. అమ్మంటే అనురాగ దేవత. మన జీవితానికి బంగా రు బాటలు వేసే అమృత మయి అమ్మ. అవమానా లెదురైనా… అపార్థాలు తలెత్తినా… ఏనాటికీ మనల్ని వీడిపోని బంధమే…
తల్లీబిడ్డల సంబంధం. కుటుంబం కోసం… తన సరదాల్ని ఇష్టా ల్ని… త్యాగం చేస్తుంది తల్లి. తన బిడ్డలకోసం ఎన్నింటినో త్యాగం చేసే అమ్మ చివరికి ప్రాణత్యాగానికి కూడా వెనుకాడదు. రక్త మాంసాలను పంచిన ఆ మాతృమూర్తి తన బిడ్డలను కంటికి రెప్పలా కాపాడుతూనే ఉం టుంది. కాలం మారుతున్న కొద్దీ తల్లిబిడ్డల సంబంధంలో కూడా మార్పులొస్తున్నాయి. నవ మాసాలు మోసి కనిపెంమదర్స్ డే ఎలా పుట్టింది?
దేశదేశాల్లో మాతృ దినోత్సవాన్ని జరుపుకోవడం ఇప్పుడు ఆనవాయితీగా తయారయింది. అయితే, భారత దేశంతో సహా అనేక దేశాల లో ఈనెలలోనే అదీ రెండో ఆదివారం నాడే ఈ ఉత్సవాన్ని జరుపుకుంటూ తమకు జన్మ ఇచ్చిన మాతృదేవతలను స్మరించుకుంటున్నారు. కానుకలిచ్చి కన్నరుణం తీర్చుకుంటున్నారు. తల్లులను ఏడాదిలో ఒకరోజయినా గుర్తుం చుకుని పండగ చేసుకునే ఈ సంప్రదాయ మూలాలు కూడా మనకు విదేశాలనుంచే దిగుమతి అయ్యాయి.సంవత్సరంలో ఒక రోజుని ‘మదర్స్ డే’ గా గుర్తింపు సాధించడానికి దాదాపు నూట ఇరవై ఏళ్ళ క్రితమే అమెరికాలో ఒక మహిళ ఏళ్ళ తరబడి పోరాటం చేయాల్సి వచ్చిందంటే తల్లులపట్ల సమాజానికి వున్న చిన్న చూపు ఎలాంటిదో అర్ధం చేసుకోవచ్చు.
అన్నా జార్విస్ అనే ఈ అమ్మడు 1890 లోనే తాను నివసిస్తున్న గ్రాఫ్టన్ నగరం వొదిలి ఫిలడెల్ఫియాకు మకాం మార్చుకున్నది. నవ మాసాలు మోసి జన్మనిచ్చిన తల్లికి గుర్తింపు తీసుకురావాలనే ఏకైక లక్ష్యంతో వొంటరి పోరాటం ప్రారంభించింది. 1905 లో తన తల్లిని ఖననం చేసిన స్మశాన వాటికలో అమ్మ సమాధి ఎదుట నిలబడి చనిపోయిన లేదా జీవించివున్న మాతృమూర్తులపట్ల గౌరవపు రస్కారంగా ఏడాదిలో ఒక రోజుని ‘మదర్స్ డే’ గా గుర్తింపు తీసుకువస్తానని ప్రతిన పూ నింది. దీనికో బలమయిన కారణం వుందని కూడా చెప్పుకుంటారు. ఈవిడ తల్లి అన్నా రీవేస్ జార్విస్ మరణానికి ముందు ఏదో ఒక విషయంలో తల్లీ కూతుళ్ళ నడుమ వాదు లాట జరిగిందట. ఆ తరవాత కొద్దిసేపటికే తల్లి మరణించడం – కూతురు అన్నా జార్వి స్‌కి తీరని మనస్తాపాన్ని కలిగించిందట. ఇందులో నిజానిజాల సంగతి ఎలావున్నా ఆ తరు వాత రోజుల్లో జార్విస్ సాగించిన పోరా టం చరిత్రలో ఒక అధ్యాయంగా మారింది.
ఈ క్రమంలో ఆమె చేస్తున్న ఉద్యోగాన్ని వొదిలిపెట్టింది. రాజకీయ నాయకులకు, చర్చి అధికారులకు, ప్రభుత్వంపై వొత్తిడి తీసుకురాగల అవకాశం వున్న బడా పారిశ్రామిక వేత్తలకు ఉత్తరాలు రాసింది. విజ్ఞప్తులు చేసింది. దరిమిలా వెస్ట్ వర్జీనియా ప్రభుత్వం ముందుగా స్పందించి ఆ రాష్ట్రంలో ‘మదర్స్ డే’ అధికారికంగా జరపడానికి అంగీకరించింది. ఆ తరవాత 1914 లో అమెరికా కాంగ్రెస్ కూడా మెట్టుదిగి ఈ దిశగా ఒక తీర్మానం ఆమోదించడం ఆనాటి ప్రెసిడెంట్ ఉడ్రో విల్సన్ సంతకం చేయడం చకచకా జరిగిపోయాయి. అన్నా జార్విస్ పట్టుదలపై అమల్లోకి వచ్చిన ఈ ‘మదర్స్ డే’ ఉత్తర్వులో ఒక విశేషం వుంది. మొత్తం కుటుంబం శ్రేయస్సుకు అనుక్షణం పాటుపడే అమ్మకే ఈ గౌరవం దక్కాలన్నది జార్విస్ ఆకాంక్ష.
అందుకు అనుగుణంగానే ప్రజా రంగంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్న మహిళామణులను మాత్రమె గౌరవించుకునే రోజుగా కాకుండా అమ్మలగన్న అమ్మలందరికీ కృతజ్ఞతలు తెలిపే రోజుగా ‘మదర్స్ డే’ ని జరుపుకోవడమే అందులోని విశిష్టత. అందుకే ఇంగ్లీషులో ‘మదర్స్ డే’ రాసేటప్పుడు ఏకవచనంలో అంటే తల్లి దినోత్సవంగా పేర్కొంటారు. ‘మదర్స్ డే’ సాధించాలన్న అన్నా జార్విస్ పట్టుదల అయితే నెరవేరింది కానీ ఆమె కన్న మరికొన్ని కలలు మాత్రం కలలుగానే మిగిలిపోయాయి. ‘మదర్స్ డే’ నాడు తల్లులకు కానుకలుగా పూలూ గ్రీటింగ్ కార్డులూ పంపకండి, ఆమె పట్ల మీ ప్రేమానురాగాలు వ్యక్తం చేస్తూ సొంత దస్తూరీతో నాలుగు వాక్యాల ఉత్తరం ముక్క రాయండన్న అన్నా జార్విస్ వేడుకోలు గాలిలో కలిసిపోయింది.
గ్రీటింగ్ కార్డుల్లో వ్యక్తమయ్యేది మొక్కుబడి ప్రేమేననీ, సొంతంగా ఉత్తరం రాస్తే తల్లికి కలిగే తృప్తి వేరనీ జార్విస్ చేసిన విజ్ఞప్తులన్నీ తల్లి పాలను సైతం లాభాలకు అమ్ముకోవాలనే మార్కెట్ శక్తుల ఎత్తుగడలముందు వెలతెలా పోయాయి. మాతృమూర్తి దినోత్సవం కోసం నిర్విరామగా పోరాడిన అన్నా జార్విస్ పిల్లలు లేకుండానే, తల్లి కాకుండానే 1948 లో చేతిలో చిల్లిగవ్వ లేకుండా దిక్కుమాలిన పరిస్థితుల్లో కన్నుమూసింది. ఏ తల్లి కోసం ఆమె అంతగా పోరాడిందో ఆ తల్లి సమాధి చెంతనే అన్నా జార్విస్‌ని ఖననం చేయడం ఒక్కటే ఆమెకు దక్కింది. అన్నా జార్విస్ కోరుకున్నట్టుగా ‘మదర్స్ డే’ జరుపుకోవడం అనేది ఒక మొక్కుబడి వ్యవహారం కాకుండా చూడాలంటే కొన్ని నిర్ణయాలు తీసుకోవడమే కాదు వాటిని ఆనాడు అమలుపరచాలి.
‘మదర్స్ డే’ నాడు తల్లి దగ్గరకు వెళ్లి ఆ రోజల్లా ఆమెతో గడపగలిగితే అంతకు మించిన సార్ధకత వుండదు. ఒక రోజు మొత్తం తల్లితో గడిపి, సొంతంగా వంట చేసి ఆమెతో తినిపించగలిగితే మాతృరుణాన్ని ఏదో కొంతయినా తీర్చుకున్నట్టే. అలా కుదరని పక్షంలో గ్రీటింగ్ కార్డుతో పాటు స్వయంగా అమ్మకు రాసిన ఉత్తరాన్ని కూడా జతపరచాలి. తల్లి మనసు తెలుసుకుని ఆమె కోరుకున్న విధంగా పనిచేస్తున్న స్వచ్చంద సంస్థలకు విరాళం పంపాలి. తల్లీ తండ్రి లేని అనాధపిల్లలను చేరదీయాలనే నిర్ణయం తీసుకోగలిగితే అంతకు మించిన కానుక ఏ తల్లీ ఆశించదు. ‘మదర్స్ డే’ నాడు గుడికి వెళ్ళాల్సిన పనిలేదు. ఇంట్లో వెలిసివున్న మాతృదేవతకు నమస్కరించండి. ముక్కోటి దేవతలు మీ పూజలందు కుంటారు. ఇది సత్యం.
కార్నేషన్‌లు…
కార్నేషన్‌లు (ఒకరకమైన పూలు) మదర్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాయి, అన్నా జార్విస్ 1908లో మొదటి వేడుక సందర్భంగా 500 కార్నేషన్‌లు సమర్పించడంతో ఈ సంప్రదాయం మొదలైంది. అనేక మతపరమైన సేవలు కూడా తరువాత కార్నేషన్‌లు ఇచ్చే ఈ ఆచారాన్ని మొదలుపెట్టాయి. అంతేకాకుండా ‘మదర్స్ డే’ రోజు కార్నేషన్ ధరించే ఆచారానికి కూడా ఇది నాంది పలికింది. ఈ ఆచారాన్ని ప్రారంభించిన అన్నా జార్విస్ తన తల్లికి ఈ పువ్వులంటే ఇష్టం కావడంతో కార్నేషన్‌లనే ఎంచుకున్నారు. తెలుపు రంగులోని కార్నేషన్‌ల కొరత కారణంగా, ‘మదర్స్ డే’ రోజున మరిన్ని రకాల కార్నేషన్‌ల విక్రయాలను పెంచేందుకు, పువ్వుల విక్రేతలు తల్లి జీవించి ఉన్నవారు ఎరుపు కార్నేషన్‌లు ధరించాలని, తల్లి మరణించినట్లయితే తెలుపు కార్నేషన్ ధరించాలని, ప్రచారం చేశారు, ఈ ప్రచారం తిరుగులేకుండా, చర్చిల్లో ప్రసిద్ధ ఆచారాలకు కూడా విస్తరించింది.
సంబంధిత కార్యక్రమాలు…
అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో అన్నా జార్విస్ తల్లి ఎన్ మేరియా రీవ్ జార్విస్ (1832-1905) పారిశుద్ధ్యాన్ని, ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు స్థానికంగా ‘మదర్స్ డే’ వర్క్ క్లబ్‌లు నిర్వహించారు. టైఫాయిడ్ వ్యాప్తిని నియంత్రించడంలో ఈ క్లబ్‌లు కేంద్ర, సహాయక శిబిరాల్లో సాయం అందించాయి. పౌర యుద్ధం సందర్భంగా విడిపోయిన కుటుంబాలను కలిపేందుకు వారు ‘మదర్స్ ఫ్రెండ్‌షిప్ డే’ను కూడా నిర్వహించారు.
మదర్స్ డే వాత్సల్య చిహ్నం… వ్యాపార చిహ్నం కాదు…
పై మాటలు అన్నది అన్నా జార్విస్. ఏ మదర్స్‌డే గుర్తింపుకోసం తాను తపనపడిందో, ఉద్యమాలు నిర్వహించిందో అదే ‘మదర్స్‌డే’ జరుగుతున్న తీరును తీవ్రంగా నిరిసిస్తూ ఆమె అరెస్టయి ఆవేదనతో అన్న మాటలవి. ‘అమ్మ’ అనేది అందమైన భావన కాదు, అపురూపమైన లాలన. ‘‘భగవంతుడు తాను అన్నిచోట్ల ఉండలేడు గనుక ‘అమ్మ’ని తనకు బదులుగా సృష్టించాడంటారు. కోట్ల రూపా యల ఆస్తి ఉన్నా కోటీశ్వరునికి కూడా తల్లి ఒడలో సేద తీరేతే వచ్చే తృప్తి మరి దేనిలోనైనా వస్తుందని చెప్పగల గుండె ఎవరికైనా ఉందా? అటువంటి అమ్మకోసం ఎన్ని చేసినా తక్కువే.
అసలు నిత్యం కొలవాల్సిన మాతృదేవతను ఏదో ఒక ప్రతే్యకమైన రోజుకు పరిమితం చేయాల్సిన అవసరం ఏముంది? ప్రస్తుత యాంత్రిక జీవనంలో ఒక్కరోజైనా తల్లిని పరిపూర్ణంగా పూజించాలనే తపన ఫలితమే ‘మదర్స్ డే’ గా చెప్పవచ్చు. హిందూ సాంప్రదాయంలో ‘మాతృమూర్తి’కి అపారమైన గౌరవం ఇచ్చారు. మాతృభూమి, మాతృదేశం, మాతృభాష ఇలా ప్రదానమైనవన్నీ తల్లితో ముడిపెట్టి తమ భక్తి ప్రపత్తులని చాటుకున్నారు. దేవతలందరిని దుర్గమ్మ, సంతోషీమాత…. ఇలా పిల్చుకుంటూ ‘మాతృ’స్థానానికి అత్యున్నత పీఠం వేస్తున్నారు.
తెలుగుతెరపై అమ్మ…
అమ్మను తలుచుకొని పరవశించి రాయలేనివారంటూ ఉండరు. మన తెలుగు సినిమాలలో అమ్మ సెంటిమెంట్ సీన్లకు ఎంతో ప్రాధాన్యం ఇస్తారు నిర్మాత, దర్శకులు. ‘‘అమ్మ అన్నది ఒక కమ్మనిమాట అది ఎన్నెన్నో తెలియని మమతల మూట’’ అని పల్లవి కట్టారు రాజశ్రీ ‘బుల్లెమ్మా బుల్లోడు’లో. అందులోనే ఆయన అంటారు. ‘‘దేవుడే లేడనే మనిషున్నాడు… అమ్మే లేదన్నవాడు అసలే లేడు’’ అంతేకాదు తల్లిరుణం తీర్చుకున్న కొడుకే అసలైన కొడుకని కూడా హితోపదేశం చేస్తారు. ఇక ‘పాండురంగ మహాత్మ్యం’లో ‘‘అమ్మా అని అరచినా ఆలకించవేమమ్మా…’’ ఆవేదన తీరు రోజు ఈ జన్మకు రాదా చాలా పెద్ద హిట్. సముద్రాల రామానుజాచార్య రాశారు దీనిని.
సిరివెన్నెల ఇదే భావనను ఇంకో హైట్‌కు తీసుకెళతారు ‘అమ్మ రాజీనామా’ సినిమాలో. ‘‘ఎవరు రాయగలరూ అమ్మ అను మాట కన్న కమ్మని కావ్యం… ఎవరు పాడగలరూ అమ్మ అనురాగం కన్న తీయని రాగం’’ అంటారాయన. అమ్మే భాషకు తొలి పలుకు అని కూడా అంటారు. ‘20వ శతాబ్దం’ చిత్రంలో సినారె ఇదే మాటను ఇంకా ఆవేశంగా అంటారు. ‘‘అందరినీ కనే శక్తి అమ్మ ఒక్కతే అవతార పురుషుడైనా ఓ అమ్మకు కొడుే’’ అంటాడాయన. అమ్మను మించిన దైవం లేదని నొక్కి చెబుతారు. ఇక ఇటీవల కాలంలో హిట్ అయిన అమ్మ పాట ‘నాని’లో కనిపిస్తుంది. చంద్రబోస్ రాశారు దానిని. చాలా మంచి పాట.
‘పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మ… కదిలే దేవత అమ్మ… కంటికి వెలుగమ్మా… తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా తన లాలి పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురిమ’’ అంటారాయన. అమ్మ పాట రాసే అవకాశం రావడం కూడా ఒక అదృష్టం. ఆ అదృష్టం దక్కిన ప్రతి కవి ఒక మంచి పాటతో ఆకట్టుకున్నారు. తేజ దర్శకత్వం వహించిన ‘నిజం’ చిత్రంలో మహేష్‌బాబు తల్లికి ఎంతో ప్రాముఖ్యమున్న పాత్రను ఇచ్చారు. అందులో మహేష్ సంప్రదాయానికి విలువిచ్చే కుటుంబానికి చెందినవాడు, అమాయకుడు, చాలా పిరికివాడు. తల్లీ తండ్రీ అతనికి పంచప్రాణాలు. పోలీసుల అండతో కొంతమంది దుర్మార్గులు మహేష్ తండ్రిని నిర్దాక్షిణ్యంగా చంపేస్తారు. అంతేకాదు నెలరోజుల్లోగా నీ మొగుడి ఫొటో పక్కన నీ కొడుకు ఫొటో పెట్టకపోతే మేం పోలీసులమే కాదు అని మహేష్ తల్లి తాళ్లూరి రామేశ్వరిని బెదిరిస్తారు. దాంతో రామేశ్వరి అపర కాళిక అవతారం ఎత్తుతుంది.
తాము అణిగిమణిగి ఉండేకొద్దీ ఇలాగే నెత్తినెక్కి కూర్చుని దౌర్జన్యాలు చేస్తారని అర్థమవుతుంది. ఈ అన్యాయాలు అక్రమాలపై ముఖ్యంగా సమాజంలోని లంచగొండితనంపై కొడుకుతో తిరుగుబాటు చేయించాలని కంకణం కట్టుకుంటుంది. తన నగల్ని చివరకు మంగళసూత్రాన్ని సైతం తెగనమ్మి కొడుక్కి బైక్ కొనిస్తుంది. చేతిలో బుల్లెట్లు నిండిన రివాల్వర్‌ని, పదునైన కత్తిని పెడుతుంది. పిల్లిలాంటి కొడుకుని పులిగా గర్జింపచేస్తుంది. లంచం అడిగిన వాళ్లందరి లిస్ట్ తయారు చేయించి కొడుకుతో ఆ కలుపుమొక్కల్ని ఏరిపారేస్తుంది. నూటికో కోటికో ఇలాంటి తల్లులు ఉంటారు. మరాఠా వీరుడు శివాజి ఛత్రపతిగా ఎదగడంలో చిన్నతనంలో అతని తల్లి వేసిన విత్తనాలే ఆధారం.
ప్రశ్నించగలిగేవాడిని… ప్రతిఘటించగలిగేవాడిని నాయకుడంటారు. జిజియాబాయి తన కొడుకుని అలాగే పెంచింది. శివాజీని తలవంచుకెళ్లేవాడిగా కాక… తిరగబడేవాడిగా తీర్చిదిద్దింది. లక్షలాది మంది ప్రజలు ఆయన్ను ఛత్రపతీ… అంటూ జేజేలు పలికారంటే కారణం ఆ వీరమాతే. ఛత్రపతిలో భానుప్రియ కూడా తన కొడుకు ప్రభాస్‌కు అదే చెబుతుంది. పదిమంది అండగా నిలిచాడు కాబట్టే… శివాజీ ఛత్రపతి అయ్యాడని కొడుక్కి విశదపరుస్తుంది. ‘‘మెత్తగా ఉంటే మొట్టుతుంది నాన్నా ఈ సమాజం. తప్పును తప్పని ధైర్యంగా ఎత్తిచూపినప్పుడే అది తలొంచుతుంది’’ అని పసివయసులోనే కొడుక్కి అన్యాయాన్ని ప్రతిఘటించే తెగువను నూరిపోస్తుంది. శ్రీలంక శరణార్థులైన ఆ తల్లీ కొడుకులు అక్కడ జరిగే గొడవల కారణంగా ఒకరికొకరు దూరమైపోతారు.
పసివయసులోనే తల్లికి దూరమై వైజాగ్‌కి చేరుకుంటాడు ప్రభాస్. అమ్మకు దూరమైనా అమ్మ మాటకు దూరం కాడు తను. అక్కడ జరిగే అన్యాయంపై తిరగబడతాడు. సాటి వారికి అండగా నిలిచి ఛత్రపతిగా ఎదుగుతాడు. ముల్లును ముల్లుతోనే తీయాలి. వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి అన్నట్టుగా… దుష్టశక్తుల ఆటకట్టించడానికి తాను కూడా ఓ శక్తిలా మారతాడు. ఒకానొక సందర్భంలో తల్లి తనకు చేరువలోనే ఉందన్న విషయం ప్రభాస్‌కి తెలుస్తుంది. తన కొడుకు ఇలా సంఘవ్యతిరేక శక్తిగా మారాడని తెలిస్తే ఆ తల్లి గుండె తట్టుకోలేదు. అందుకే నిజం దాస్తాడు. చివరకు తమ్ముడిని దుర్మార్గుల నుంచి కాపాడే క్రమంలో తుపాకీ తూటాలకు గురవుతాడు. ‘‘ఎందుకు చేశావ్ ఇదంతా’’ అని అమ్మ అడుగుతుంది.
‘‘ఒట్టేసి ఒకటి ఒట్టేయకుండా ఒకటి చెప్పనమ్మా…’’ అని చిన్నప్పుడు అన్న మాటను మళ్లీ అమ్మతో అంటాడు ప్రభాస్. అతని మెడలోని ఆమె తొడిగిన గొలుసును చూసి గుర్తుపడుతుంది భానుప్రియ. అతడు తన బిడ్డే అని తెలుసుకుని భోరున విలపిస్తుంది. ఇందులో ప్రభాస్‌కి భానుప్రియ కన్నతల్లి కాదు.. సవతి తల్లి. కనినా, పెంచినా… అమ్మ అమ్మే కదా.రోజులు మారాయి. అమ్మనుంచి అనురాగం పొందే పిల్లలు ఆమెనో ఫ్రెండ్‌గా ట్రీట్ చేసే రోజులొచ్చాయి. తమ ఫీలింగ్స్‌ను ఆమెతో షేర్ చేసుకునే రోజులొచ్చాయి.
‘అమ్మ- నాన్న- తమిళమ్మాయి’ సినిమా ఇటువంటి ట్రెండ్‌కు అంకురార్పణ చేసింది. ఇందులో అమ్మగా యాక్ట్ చేసిన జయసుధ అమ్మ పాత్ర రూపురేఖల్నే మార్చిపారేసింది. ఏజ్‌బార్ అమ్మశకం ముగిసిపోయి గ్లామరస్ అండ్ ఫ్రెండ్లీ అమ్మ తరం మొదలైంది జయసుధతోనే. ‘అమ్మా-నాన్న-ఓ తమిళ అమ్మాయి’లో జయసుధ, రవితేజను చూస్తే ఎవ్వరూ తల్లీకొడుకులనుకోరు. బెస్ట్ ఫ్రెండ్స్‌లాగా అనిపిస్తారు. ఈ సినిమాలో తల్లి కొడుకుతో కలిసి కాఫీషాపుకెళ్తుంది. పబ్‌కెళ్తుంది. అల్లరి చేస్తుంది. మారాం చేస్తుంది. కొడుకు కిక్ బాక్సింగ్ ప్రాక్టీస్ చేస్తుంటే తను ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది.
‘‘రేయ్ మలేరియాలాగా… నీకు పెళ్లేరియా వచ్చేసింది. ఏజ్ బార్ అయ్యి ముదురు బెండకాయలా అయిపోతున్నావ్. త్వరగా పెళ్లి చేసుకో’’ అంటూ కొడుకు మీదే సెటైర్ వేస్తుంది. జయసుధ భర్త ప్రకాశ్‌రాజ్ పేరొందిన కిక్ బాక్సర్. సంసార బాధ్యతలు నెత్తిన లేకపోతే కెరీర్‌లో నేనింకా షైన్ అయ్యేవాణ్నంటాడు ప్రకాష్‌రాజ్. భర్త కెరీర్ కోసం కొడుకును తీసుకొని బయటకొస్తుంది జయసుధ. తండ్రి తమనలా రోడ్డు మీద వదిలేశాడని రవితేజకు కోపం. రవితేజ ఓ తమిళ అమ్మాయిని ప్రేమిస్తాడు. వీరిద్దరినీ జయసుధే కలుపుతుంది. కొడుకుపై ప్రేమతో నిండిపోయిన ఆమె హార్ట్‌పైై ఎటాక్ జరుగు తుంది. డాక్టర్లు శ్రమించినా ఫలితం దక్కదు. చనిపోయే ముందు కొడుకుతో నా చివరి కోరిక తీర్చరా. నీ మిగిలిన జీవితమంతా మీ నాన్నతో గడపాలి అని మాట తీసుకుంటుం ది. కొడుకు బుగ్గల్ని తడుముతూ ప్రాణం విడుస్తుంది. ఇలాంటి సన్నివేశాల్ని మనం సినిమాలలో చాలా సహజంగానే చూస్తుంటాం. అమ్మకుండే ప్రాధాన్యత అలాంటిది మరి…
మాతృమూర్తి గురించి ప్రముఖుల నిర్వచనం….
అమ్మలో ఉన్న వైభవం, దివ్యత్వం ప్రపంచంలో ఎవరి వద్దా చూడలేదు. ప్రపంచంలో దేశదేశాల్ని చుట్టి, లక్షలాది మందిని కలిసినా అమ్మ వంటి అపురూప వ్యక్తి ఎక్కడా తారసపడలేదు. నేను సంపాదించిందంతా ఆమె చరణాల వద్ద పోసినా ఇంకా బాకీ పడతాను. – చార్లీ చాప్లిన్
నా తల్లి దీవెనలు, ప్రార్థనలు అనుక్షణం నన్ను అంటిబెట్టుకునే ఉంటాయని నా విశ్వాసం. అవే నన్ను ఎల్లవేళలా కాపాడుతాయి. - అబ్రహం లింకన్
నేను ఇప్పటి వరకు ఈ భూమండలంపై మా తల్లినిమించిన అందగత్తెను చూడ లేదు. జీవితాంతం నా తల్లికి రుణపడి ఉం టాను. ఇప్పటి వరకు నేను సంపాదించిన జ్ఞానం, విద్య, ఉన్నత ఆలోచనలు అన్నీ మా తల్లి బోధించినవే. ఆమె చలవవల్లే నేను ఈ స్థితిలో ఉన్నాను.- జార్జ్ వాషింగ్టన్
నా తల్లికున్న ఓపిక, సహనం ఏ స్ర్తీకి ఉండదేమో. అమాయకత్వం కలబోసిన మోముతో సున్నితంగా ఉంటూనే అవసరమైతే ధైర్యంగా, సింహంలా ఎదురొడ్డి నిలుస్తుంది. బాల్యంలో ఆమె నేర్పిన బుద్ధులే ప్రస్తుతం నాకు మార్గదర్శకంగా నిలిచాయి.- ఆండ్రూ జాక్సన్
అమ్మదనంలో ఉండే తీయదనం, ఆహ్లాదం.. ప్రకృతిలో సహజ సిద్ధంగాఉండే వనరుల నుండి కూడా పొందలేము.- బార్బరా కింగ్‌సోల్వర్
ప్రపంచంలో పరమ పవిత్రమైన పదం ‘అమ్మ’. అమ్మదనంలో ఉన్న సౌందర్యం ప్రపంచంలోని ఏ కళలోనూ ఉండదు. అందులో లభించే ఆనందం, సంతోషం, తృప్తి ఏ వృత్తిలోనూ లభించదు.- డేవిడ్ ఒ. మెక్‌కే
చిన తల్లిని భారంగా భావిస్తున్నారు కొందరు పిల్లలు. వృద్ధాశ్రమంలో చేర్పిస్తున్నారు. ప్రాణానికి ప్రాణంగా పెంచి పెద్ద చేసిన మాతృమూర్తిని మరిచిపోతున్నారు. అమ్మను బాధ పెడితే… సమస్త దేవతల్ని బాధ పెట్టినట్లే. ఈ నిజం తెలుసుకున్నవారే నిజమైన పిల్లలు.
Source: Surya Daily.