మష్రుమ్ ఫ్రైడ్ రైస్…!
* మష్రుమ్ ఫ్రైడ్ రైస్
కావలసిన పదార్ధాలు:
బాస్మతి బియ్యం: 3 cups
మష్రుమ్స్(పుట్టగొడుగులు): 1 packt
ఉల్లిపాయ: 2
క్యాప్సికమ్: 2
బీన్స్ : 1/2cup
అల్లం వెల్లుల్లి పేస్ట్: 2 tsp
సోయా సాస్: 2 tsp
టమోటో పేస్ట్: 2 tsp
జీలకర్ర: 1 tsp
మిరియాల పొడి: 1 tsp
నూనె: 1/2 కావలసినంత
వెల్లుల్లి రెబ్బలు: 6-8
అల్లం: చిన్న ముక్క
నీళ్ళు: సరిపడ
ఉప్పు: రుచికి తగినంత
తయారు చేయు విధానము:
1. నూనెను వేడి చేసి, శుభ్రంగా కడిగిన బాస్మతి బియ్యాన్ని మూడు ఐదు నిమిషాల పాటు వేయించాలి. తర్వాత తగినంత నీరు పోసి ఉడికించుకొని, ఈ అన్నాన్ని పక్కకు తీసి చల్లారనివ్వాలి.
2. మరో గిన్నెలో నూనె పోసి ఉల్లిపాయ ముక్కలు, జీలకర్ర, చిన్నగా తరిగిన అల్లం వెల్లుల్లి ముక్కులు, క్యాప్సికమ్, బీన్స్ వేసి రెండు నిమిషాల పాటు వేయించాలి.
3. తర్వాత సోయాసాస్, టమోటోపేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ మిరియాల పొడి, ఉప్పు వేయాలి. దోరగా వేగిన తర్వాత ముక్కలుగా తరిగిన పుట్టగొడుగు ముక్కలు వేసి బాగా కలిపి ఐదు నిమిషాలు వేయించాలి.
4. ఈ ముక్కలు బాగా మెత్తబడిన తర్వాత ముందుగా తయారు చేసి చల్లారబెట్టిన అన్నాన్ని వేసి అన్నిటినీ బాగా కలపాలి.
5. పది నిమిషాలు తక్కువ మంట మీద ఉంచి దించేసుకోవాలి. అంతే ఘుమఘుమలాడే మష్రుమ్ ఫ్రైడ్ రైస్ రెడీ...

Comments