నేటి మహిళ

వేసవిలో నిద్రలేస్తూనే నీరు
ప్రొద్దున్నే నిద్రలేవగానే తల దిమ్ముగా ఉన్నా, కడుపులో వికారంగా ఉన్నా, నిస్సత్తువగా ఉందనిపిస్తున్నా, తల నొప్పి వేస్తున్నా ఇవి మన శరీరం నీటిని కోరుకుంటోందనడానికి సంకేతాలు అని గుర్తించాలి. అందుకే నిద్రపోవడానికి ముందు కూడా మన పెద్దలు తలగడ పక్కనో, మంచం కిందనో రాగి లేదా సాధారణ చెంబులో నీళ్లు పట్టి ఉంచడం చేసేవారు. పొద్దున్నే నిద్రలేచి ముఖం కడుక్కున్న వెంటనే పిల్లలకు నీళ్లు తాగించేవారు.

పొద్దుటిపూటే చెంబుడు నీళ్లు తాగితే రోజంతా చీకూ చింతా లేకుండా ఉంటారనే నమ్మకం వాళ్లది. వైద్య పరంగా కూడా దీనికి ఆధారం ఉంది. ఎందుకంటే మనం సాధారణంగా రాత్రి పూట భోంచేసింతర్వాత మరుసటి రోజు తెల్లవారే వరకూ ఏమీ పుచ్చుకోం గదా.. దీంతో శరీరం ఖర్చుపెట్టిన ద్రవపదార్థాల స్థానంలో నీరు వచ్చి చేరదు. శరీరం నీటిని కోరుకుంటున్నా మనం అందివ్వని స్థితి రాత్రిపూట ఉంటుంది కనుకే నిద్రలేచిన వెంటనే నీరు తాగాలని పెద్దలు చెబుతారు. దీనివల్ల శరీరం తిరిగి రీచార్జ్ అవుతుంది.

నీటి ద్వారా కలిగే ప్రయోజనాలు ఏమిటో చూద్దామా..

డీహైడ్రేషన్‌కు లోనుకాకుండా ఉండాలంటే సాధ్యమైనంత ఎక్కువ నీళ్లు తాగాలి. నీళ్లకు జీర్ణశక్తిని పెంచే లక్షణం ఉంది. శరీరంలోని మలినాలను విసర్జింపజేసి, మూత్రపిండాలు సమర్థంగా తమ విధులు నిర్వర్తించాలంటే మనం వీలైనంత ఎక్కువగా నీరు త్రాగాలి.

శరీరం కోల్పోయిన ద్రవపదార్ధాలను తిరిగి సమకూర్చుకోవాలంటే నీరు అధికంగా తీసుకోవాలి. మనం చేసే ప్రతి చిన్న లేదా పెద్ద పనికి ఎంతో కొన్ని కెలోరీలు ఖర్చయిపోతుండడం ఎలా వాస్తవమో శరీరం తనలోని నీటి నిల్వను నిరంతరం ఖర్చు పెట్టుకుంటూనే ఉంటుందని గుర్చుంచుకోవాలి. రోజుకు కనీసం ఎనిమిది గ్లాసులు నీటిని తాగడం తప్పనిసరి వైద్యనిపుణులు సూచిస్తూంటారు.

అలాగే నీటిశాతం ఎక్కువగా ఉండే పుచ్చకాయలు, కమలా పళ్లు, నారింజ, దానిమ్మ వంటి ఫలాలను ఆయా సీజన్‌లలో అధికంగా తీసుకోవాలి. అన్నిటినీమించి నిద్రలేస్తూనే నీరు తాగడం అలవాటు చేసుకోవాలి. కానీ ఖర్చు లేకుండా మన శరీర ఆరోగ్యాన్ని మన చేతుల్లోనే ఉంచుకోవడానికి ఇదే కారుచౌక మార్గం… కాబట్టి నీరు తాగడం మానవద్దు, నీరు తాగడం మర్చిపోవద్దు. ప్రొద్దుటిపూట నీరు తాగడం అస్సలు మర్చిపోవద్దు.

అమ్మ అన్న దేవత లేకపోతే…? నేను…నువ్వు…మనం…సమస్త మానవాళి ఉండదు!
‘ప్రేమకు అర్థం తెలియాలంటే చూడాల్సింది నిఘంటువు కాదు, అమ్మ ముఖాన్ని…’ అన్నాడో కవి అది అక్షర సత్యం… అమ్మ అన్న దేవత లేకపోతే… నేను, నువ్వు, మనం… ఈ సమస్త మానవాళి ఉండదు. అలాంటి అమృతమయి మాతృమూర్తిని తలుచుకునేందుకు మనకు ఓ రోజు ఉంది అదే ‘మదర్స్‌ డే’ ప్రతి ఏటా మే రెండవ ఆదివారం ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే పండుగే ‘అంతర్జాతీయ మాతృ దినోత్సవం’…

ఆత్మానురాగం… ప్రేమ బాంధవ్యాలను పంచే అమ్మ అనురాగం మాటల్లో చెప్ప లేనిది. నవమాసాలు మోసి, తన పిల్లల కోసం పరితపిస్తుంది అమ్మ. ఆకాశమంత ప్రేమ అందించే అమ్మ తన పిల్లలు పెరిగి, ఎంత పెద్దవారైనా… పసి పిల్లాడిగానే తపి స్తుంది. సృష్టికి మూలమైన ‘అమ్మ’ కోసం ప్రతి సంవత్సరం ఘనంగా జరుపుకునేదే ‘మదర్స్‌ డే’. అమ్మ కమ్మని ప్రేమను గుర్తు చేసుకుని… తమ అభిమానాన్ని చాటుకు ‘మదర్స్‌ డే’కు కూతుళ్లు, కొడుకులు, స్వచ్ఛంధ సంస్థలు, వృద్ధాశ్ర మాలు వేడుకను జరుపుకుంటోంది. బిజీగా ఉండే వారు కొందురు… దేశ, విదేశాల్లో ఉండే మరి కొందరు ఈ మెయిల్స్‌, గ్రీటింగ్స్‌ కార్డ్‌‌స ద్వారా శుభాకాంక్షలు తెలుపుతుండగా, కొందరు ఖరీదైన బహుమతులు అందజేస్తూ తమ అభిమానాన్ని చాటుకుంటుంటారు.

పెదవే పలికిన మాటల్లోని తియ్యని మాటే అమ్మ… నడిచే దేవత అమ్మ అని ఓ సినీ కవి అద్భుతంగా అమ్మ గొప్పతనాన్ని వివరిం చారు. మాటలు నేర్చుకుంటున్న బుజ్జాయి తొలి పలుకు అమ్మ… ఊహ తెలిసే క్షణానికి మొదటి గురువు అమ్మ. చివరికి బాధ కలిగితే నోటి వెంట వచ్చే తొలి ఆర్తనాదం కూడా అమ్మే. తాను కొవ్వొత్తిలా కరిగిపో తూ… పిల్లలకు వెలుగునిచ్చే అమ్మ రుణం ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేం…

జన్మనిచ్చిన తల్లికి ప్రతి ప్రాణి జన్మజన్మలకి ఋణపడి ఉంటుంది. ఎందుకంటే ఇవ్వ టమే కానీ తీసుకోవడం తెలియదు తల్లి మనసుకి. మాతృప్రేమలోని మాధు ర్యం… తల్లిఒడిలోని వెచ్చదనం గురించి వర్ణించడానికి మాటలు చాలవు. అంబరాన్నంటే అమ్మప్రేమను ఎంద రో కవులు ఎన్నోరకాలుగా వర్ణిం చారు. అమ్మంటే అనురాగ దేవత. మన జీవితానికి బంగా రు బాటలు వేసే అమృత మయి అమ్మ. అవమానా లెదురైనా… అపార్థాలు తలెత్తినా… ఏనాటికీ మనల్ని వీడిపోని బంధమే…

తల్లీబిడ్డల సంబంధం. కుటుంబం కోసం… తన సరదాల్ని ఇష్టా ల్ని… త్యాగం చేస్తుంది తల్లి. తన బిడ్డలకోసం ఎన్నింటినో త్యాగం చేసే అమ్మ చివరికి ప్రాణత్యాగానికి కూడా వెనుకాడదు. రక్త మాంసాలను పంచిన ఆ మాతృమూర్తి తన బిడ్డలను కంటికి రెప్పలా కాపాడుతూనే ఉం టుంది. కాలం మారుతున్న కొద్దీ తల్లిబిడ్డల సంబంధంలో కూడా మార్పులొస్తున్నాయి. నవ మాసాలు మోసి కనిపెంమదర్స్‌ డే ఎలా పుట్టింది?

దేశదేశాల్లో మాతృ దినోత్సవాన్ని జరుపుకోవడం ఇప్పుడు ఆనవాయితీగా తయారయింది. అయితే, భారత దేశంతో సహా అనేక దేశాల లో ఈనెలలోనే అదీ రెండో ఆదివారం నాడే ఈ ఉత్సవాన్ని జరుపుకుంటూ తమకు జన్మ ఇచ్చిన మాతృదేవతలను స్మరించుకుంటున్నారు. కానుకలిచ్చి కన్నరుణం తీర్చుకుంటున్నారు. తల్లులను ఏడాదిలో ఒకరోజయినా గుర్తుం చుకుని పండగ చేసుకునే ఈ సంప్రదాయ మూలాలు కూడా మనకు విదేశాలనుంచే దిగుమతి అయ్యాయి.సంవత్సరంలో ఒక రోజుని ‘మదర్స్‌ డే’ గా గుర్తింపు సాధించడానికి దాదాపు నూట ఇరవై ఏళ్ళ క్రితమే అమెరికాలో ఒక మహిళ ఏళ్ళ తరబడి పోరాటం చేయాల్సి వచ్చిందంటే తల్లులపట్ల సమాజానికి వున్న చిన్న చూపు ఎలాంటిదో అర్ధం చేసుకోవచ్చు.

అన్నా జార్విస్‌ అనే ఈ అమ్మడు 1890 లోనే తాను నివసిస్తున్న గ్రాఫ్టన్‌ నగరం వొదిలి ఫిలడెల్ఫియాకు మకాం మార్చుకున్నది. నవ మాసాలు మోసి జన్మనిచ్చిన తల్లికి గుర్తింపు తీసుకురావాలనే ఏకైక లక్ష్యంతో వొంటరి పోరాటం ప్రారంభించింది. 1905 లో తన తల్లిని ఖననం చేసిన స్మశాన వాటికలో అమ్మ సమాధి ఎదుట నిలబడి చనిపోయిన లేదా జీవించివున్న మాతృమూర్తులపట్ల గౌరవపు రస్కారంగా ఏడాదిలో ఒక రోజుని ‘మదర్స్‌ డే’ గా గుర్తింపు తీసుకువస్తానని ప్రతిన పూ నింది. దీనికో బలమయిన కారణం వుందని కూడా చెప్పుకుంటారు. ఈవిడ తల్లి అన్నా రీవేస్‌ జార్విస్‌ మరణానికి ముందు ఏదో ఒక విషయంలో తల్లీ కూతుళ్ళ నడుమ వాదు లాట జరిగిందట. ఆ తరవాత కొద్దిసేపటికే తల్లి మరణించడం – కూతురు అన్నా జార్వి స్‌కి తీరని మనస్తాపాన్ని కలిగించిందట. ఇందులో నిజానిజాల సంగతి ఎలావున్నా ఆ తరు వాత రోజుల్లో జార్విస్‌ సాగించిన పోరా టం చరిత్రలో ఒక అధ్యాయంగా మారింది.

ఈ క్రమంలో ఆమె చేస్తున్న ఉద్యోగాన్ని వొదిలిపెట్టింది. రాజకీయ నాయకులకు, చర్చి అధికారులకు, ప్రభుత్వంపై వొత్తిడి తీసుకురాగల అవకాశం వున్న బడా పారిశ్రామిక వేత్తలకు ఉత్తరాలు రాసింది. విజ్ఞప్తులు చేసింది. దరిమిలా వెస్ట్‌ వర్జీనియా ప్రభుత్వం ముందుగా స్పందించి ఆ రాష్ట్రంలో ‘మదర్స్‌ డే’ అధికారికంగా జరపడానికి అంగీకరించింది. ఆ తరవాత 1914 లో అమెరికా కాంగ్రెస్‌ కూడా మెట్టుదిగి ఈ దిశగా ఒక తీర్మానం ఆమోదించడం ఆనాటి ప్రెసిడెంట్‌ ఉడ్రో విల్సన్‌ సంతకం చేయడం చకచకా జరిగిపోయాయి. అన్నా జార్విస్‌ పట్టుదలపై అమల్లోకి వచ్చిన ఈ ‘మదర్స్‌ డే’ ఉత్తర్వులో ఒక విశేషం వుంది. మొత్తం కుటుంబం శ్రేయస్సుకు అనుక్షణం పాటుపడే అమ్మకే ఈ గౌరవం దక్కాలన్నది జార్విస్‌ ఆకాంక్ష.

అందుకు అనుగుణంగానే ప్రజా రంగంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్న మహిళామణులను మాత్రమె గౌరవించుకునే రోజుగా కాకుండా అమ్మలగన్న అమ్మలందరికీ కృతజ్ఞతలు తెలిపే రోజుగా ‘మదర్స్‌ డే’ ని జరుపుకోవడమే అందులోని విశిష్టత. అందుకే ఇంగ్లీషులో ‘మదర్స్‌ డే’ రాసేటప్పుడు ఏకవచనంలో అంటే తల్లి దినోత్సవంగా పేర్కొంటారు. ‘మదర్స్‌ డే’ సాధించాలన్న అన్నా జార్విస్‌ పట్టుదల అయితే నెరవేరింది కానీ ఆమె కన్న మరికొన్ని కలలు మాత్రం కలలుగానే మిగిలిపోయాయి. ‘మదర్స్‌ డే’ నాడు తల్లులకు కానుకలుగా పూలూ గ్రీటింగ్‌ కార్డులూ పంపకండి, ఆమె పట్ల మీ ప్రేమానురాగాలు వ్యక్తం చేస్తూ సొంత దస్తూరీతో నాలుగు వాక్యాల ఉత్తరం ముక్క రాయండన్న అన్నా జార్విస్‌ వేడుకోలు గాలిలో కలిసిపోయింది.

గ్రీటింగ్‌ కార్డుల్లో వ్యక్తమయ్యేది మొక్కుబడి ప్రేమేననీ, సొంతంగా ఉత్తరం రాస్తే తల్లికి కలిగే తృప్తి వేరనీ జార్విస్‌ చేసిన విజ్ఞప్తులన్నీ తల్లి పాలను సైతం లాభాలకు అమ్ముకోవాలనే మార్కెట్‌ శక్తుల ఎత్తుగడలముందు వెలతెలా పోయాయి. మాతృమూర్తి దినోత్సవం కోసం నిర్విరామగా పోరాడిన అన్నా జార్విస్‌ పిల్లలు లేకుండానే, తల్లి కాకుండానే 1948 లో చేతిలో చిల్లిగవ్వ లేకుండా దిక్కుమాలిన పరిస్థితుల్లో కన్నుమూసింది. ఏ తల్లి కోసం ఆమె అంతగా పోరాడిందో ఆ తల్లి సమాధి చెంతనే అన్నా జార్విస్‌ని ఖననం చేయడం ఒక్కటే ఆమెకు దక్కింది. అన్నా జార్విస్‌ కోరుకున్నట్టుగా ‘మదర్స్‌ డే’ జరుపుకోవడం అనేది ఒక మొక్కుబడి వ్యవహారం కాకుండా చూడాలంటే కొన్ని నిర్ణయాలు తీసుకోవడమే కాదు వాటిని ఆనాడు అమలుపరచాలి.

‘మదర్స్‌ డే’ నాడు తల్లి దగ్గరకు వెళ్లి ఆ రోజల్లా ఆమెతో గడపగలిగితే అంతకు మించిన సార్ధకత వుండదు. ఒక రోజు మొత్తం తల్లితో గడిపి, సొంతంగా వంట చేసి ఆమెతో తినిపించగలిగితే మాతృరుణాన్ని ఏదో కొంతయినా తీర్చుకున్నట్టే. అలా కుదరని పక్షంలో గ్రీటింగ్‌ కార్డుతో పాటు స్వయంగా అమ్మకు రాసిన ఉత్తరాన్ని కూడా జతపరచాలి. తల్లి మనసు తెలుసుకుని ఆమె కోరుకున్న విధంగా పనిచేస్తున్న స్వచ్చంద సంస్థలకు విరాళం పంపాలి. తల్లీ తండ్రి లేని అనాధపిల్లలను చేరదీయాలనే నిర్ణయం తీసుకోగలిగితే అంతకు మించిన కానుక ఏ తల్లీ ఆశించదు. ‘మదర్స్‌ డే’ నాడు గుడికి వెళ్ళాల్సిన పనిలేదు. ఇంట్లో వెలిసివున్న మాతృదేవతకు నమస్కరించండి. ముక్కోటి దేవతలు మీ పూజలందు కుంటారు. ఇది సత్యం.

కార్నేషన్‌లు…

కార్నేషన్‌లు (ఒకరకమైన పూలు) మదర్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాయి, అన్నా జార్విస్‌ 1908లో మొదటి వేడుక సందర్భంగా 500 కార్నేషన్‌లు సమర్పించడంతో ఈ సంప్రదాయం మొదలైంది. అనేక మతపరమైన సేవలు కూడా తరువాత కార్నేషన్‌లు ఇచ్చే ఈ ఆచారాన్ని మొదలుపెట్టాయి. అంతేకాకుండా ‘మదర్స్‌ డే’ రోజు కార్నేషన్‌ ధరించే ఆచారానికి కూడా ఇది నాంది పలికింది. ఈ ఆచారాన్ని ప్రారంభించిన అన్నా జార్విస్‌ తన తల్లికి ఈ పువ్వులంటే ఇష్టం కావడంతో కార్నేషన్‌లనే ఎంచుకున్నారు. తెలుపు రంగులోని కార్నేషన్‌ల కొరత కారణంగా, ‘మదర్స్‌ డే’ రోజున మరిన్ని రకాల కార్నేషన్‌ల విక్రయాలను పెంచేందుకు, పువ్వుల విక్రేతలు తల్లి జీవించి ఉన్నవారు ఎరుపు కార్నేషన్‌లు ధరించాలని, తల్లి మరణించినట్లయితే తెలుపు కార్నేషన్‌ ధరించాలని, ప్రచారం చేశారు, ఈ ప్రచారం తిరుగులేకుండా, చర్చిల్లో ప్రసిద్ధ ఆచారాలకు కూడా విస్తరించింది.

సంబంధిత కార్యక్రమాలు…

అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో అన్నా జార్విస్‌ తల్లి ఎన్‌ మేరియా రీవ్‌ జార్విస్‌ (1832-1905) పారిశుద్ధ్యాన్ని, ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు స్థానికంగా ‘మదర్స్‌ డే’ వర్క్‌ క్లబ్‌లు నిర్వహించారు. టైఫాయిడ్‌ వ్యాప్తిని నియంత్రించడంలో ఈ క్లబ్‌లు కేంద్ర, సహాయక శిబిరాల్లో సాయం అందించాయి. పౌర యుద్ధం సందర్భంగా విడిపోయిన కుటుంబాలను కలిపేందుకు వారు ‘మదర్స్‌ ఫ్రెండ్‌షిప్‌ డే’ను కూడా నిర్వహించారు.

మదర్స్‌ డే వాత్సల్య చిహ్నం… వ్యాపార చిహ్నం కాదు…

పై మాటలు అన్నది అన్నా జార్విస్‌. ఏ మదర్స్‌డే గుర్తింపుకోసం తాను తపనపడిందో, ఉద్యమాలు నిర్వహించిందో అదే ‘మదర్స్‌డే’ జరుగుతున్న తీరును తీవ్రంగా నిరిసిస్తూ ఆమె అరెస్టయి ఆవేదనతో అన్న మాటలవి. ‘అమ్మ’ అనేది అందమైన భావన కాదు, అపురూపమైన లాలన. ‘‘భగవంతుడు తాను అన్నిచోట్ల ఉండలేడు గనుక ‘అమ్మ’ని తనకు బదులుగా సృష్టించాడంటారు. కోట్ల రూపా యల ఆస్తి ఉన్నా కోటీశ్వరునికి కూడా తల్లి ఒడలో సేద తీరేతే వచ్చే తృప్తి మరి దేనిలోనైనా వస్తుందని చెప్పగల గుండె ఎవరికైనా ఉందా? అటువంటి అమ్మకోసం ఎన్ని చేసినా తక్కువే.

అసలు నిత్యం కొలవాల్సిన మాతృదేవతను ఏదో ఒక ప్రతే్యకమైన రోజుకు పరిమితం చేయాల్సిన అవసరం ఏముంది? ప్రస్తుత యాంత్రిక జీవనంలో ఒక్కరోజైనా తల్లిని పరిపూర్ణంగా పూజించాలనే తపన ఫలితమే ‘మదర్స్‌ డే’ గా చెప్పవచ్చు. హిందూ సాంప్రదాయంలో ‘మాతృమూర్తి’కి అపారమైన గౌరవం ఇచ్చారు. మాతృభూమి, మాతృదేశం, మాతృభాష ఇలా ప్రదానమైనవన్నీ తల్లితో ముడిపెట్టి తమ భక్తి ప్రపత్తులని చాటుకున్నారు. దేవతలందరిని దుర్గమ్మ, సంతోషీమాత…. ఇలా పిల్చుకుంటూ ‘మాతృ’స్థానానికి అత్యున్నత పీఠం వేస్తున్నారు.

తెలుగుతెరపై అమ్మ…

అమ్మను తలుచుకొని పరవశించి రాయలేనివారంటూ ఉండరు. మన తెలుగు సినిమాలలో అమ్మ సెంటిమెంట్‌ సీన్లకు ఎంతో ప్రాధాన్యం ఇస్తారు నిర్మాత, దర్శకులు. ‘‘అమ్మ అన్నది ఒక కమ్మనిమాట అది ఎన్నెన్నో తెలియని మమతల మూట’’ అని పల్లవి కట్టారు రాజశ్రీ ‘బుల్లెమ్మా బుల్లోడు’లో. అందులోనే ఆయన అంటారు. ‘‘దేవుడే లేడనే మనిషున్నాడు… అమ్మే లేదన్నవాడు అసలే లేడు’’ అంతేకాదు తల్లిరుణం తీర్చుకున్న కొడుకే అసలైన కొడుకని కూడా హితోపదేశం చేస్తారు. ఇక ‘పాండురంగ మహాత్మ్యం’లో ‘‘అమ్మా అని అరచినా ఆలకించవేమమ్మా…’’ ఆవేదన తీరు రోజు ఈ జన్మకు రాదా చాలా పెద్ద హిట్‌. సముద్రాల రామానుజాచార్య రాశారు దీనిని.

సిరివెన్నెల ఇదే భావనను ఇంకో హైట్‌కు తీసుకెళతారు ‘అమ్మ రాజీనామా’ సినిమాలో. ‘‘ఎవరు రాయగలరూ అమ్మ అను మాట కన్న కమ్మని కావ్యం… ఎవరు పాడగలరూ అమ్మ అనురాగం కన్న తీయని రాగం’’ అంటారాయన. అమ్మే భాషకు తొలి పలుకు అని కూడా అంటారు. ‘20వ శతాబ్దం’ చిత్రంలో సినారె ఇదే మాటను ఇంకా ఆవేశంగా అంటారు. ‘‘అందరినీ కనే శక్తి అమ్మ ఒక్కతే అవతార పురుషుడైనా ఓ అమ్మకు కొడుే’’ అంటాడాయన. అమ్మను మించిన దైవం లేదని నొక్కి చెబుతారు. ఇక ఇటీవల కాలంలో హిట్‌ అయిన అమ్మ పాట ‘నాని’లో కనిపిస్తుంది. చంద్రబోస్‌ రాశారు దానిని. చాలా మంచి పాట.

‘పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మ… కదిలే దేవత అమ్మ… కంటికి వెలుగమ్మా… తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా తన లాలి పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురిమ’’ అంటారాయన. అమ్మ పాట రాసే అవకాశం రావడం కూడా ఒక అదృష్టం. ఆ అదృష్టం దక్కిన ప్రతి కవి ఒక మంచి పాటతో ఆకట్టుకున్నారు. తేజ దర్శకత్వం వహించిన ‘నిజం’ చిత్రంలో మహేష్‌బాబు తల్లికి ఎంతో ప్రాముఖ్యమున్న పాత్రను ఇచ్చారు. అందులో మహేష్‌ సంప్రదాయానికి విలువిచ్చే కుటుంబానికి చెందినవాడు, అమాయకుడు, చాలా పిరికివాడు. తల్లీ తండ్రీ అతనికి పంచప్రాణాలు. పోలీసుల అండతో కొంతమంది దుర్మార్గులు మహేష్‌ తండ్రిని నిర్దాక్షిణ్యంగా చంపేస్తారు. అంతేకాదు నెలరోజుల్లోగా నీ మొగుడి ఫొటో పక్కన నీ కొడుకు ఫొటో పెట్టకపోతే మేం పోలీసులమే కాదు అని మహేష్‌ తల్లి తాళ్లూరి రామేశ్వరిని బెదిరిస్తారు. దాంతో రామేశ్వరి అపర కాళిక అవతారం ఎత్తుతుంది.

తాము అణిగిమణిగి ఉండేకొద్దీ ఇలాగే నెత్తినెక్కి కూర్చుని దౌర్జన్యాలు చేస్తారని అర్థమవుతుంది. ఈ అన్యాయాలు అక్రమాలపై ముఖ్యంగా సమాజంలోని లంచగొండితనంపై కొడుకుతో తిరుగుబాటు చేయించాలని కంకణం కట్టుకుంటుంది. తన నగల్ని చివరకు మంగళసూత్రాన్ని సైతం తెగనమ్మి కొడుక్కి బైక్‌ కొనిస్తుంది. చేతిలో బుల్లెట్లు నిండిన రివాల్వర్‌ని, పదునైన కత్తిని పెడుతుంది. పిల్లిలాంటి కొడుకుని పులిగా గర్జింపచేస్తుంది. లంచం అడిగిన వాళ్లందరి లిస్ట్‌ తయారు చేయించి కొడుకుతో ఆ కలుపుమొక్కల్ని ఏరిపారేస్తుంది. నూటికో కోటికో ఇలాంటి తల్లులు ఉంటారు. మరాఠా వీరుడు శివాజి ఛత్రపతిగా ఎదగడంలో చిన్నతనంలో అతని తల్లి వేసిన విత్తనాలే ఆధారం.

ప్రశ్నించగలిగేవాడిని… ప్రతిఘటించగలిగేవాడిని నాయకుడంటారు. జిజియాబాయి తన కొడుకుని అలాగే పెంచింది. శివాజీని తలవంచుకెళ్లేవాడిగా కాక… తిరగబడేవాడిగా తీర్చిదిద్దింది. లక్షలాది మంది ప్రజలు ఆయన్ను ఛత్రపతీ… అంటూ జేజేలు పలికారంటే కారణం ఆ వీరమాతే. ఛత్రపతిలో భానుప్రియ కూడా తన కొడుకు ప్రభాస్‌కు అదే చెబుతుంది. పదిమంది అండగా నిలిచాడు కాబట్టే… శివాజీ ఛత్రపతి అయ్యాడని కొడుక్కి విశదపరుస్తుంది. ‘‘మెత్తగా ఉంటే మొట్టుతుంది నాన్నా ఈ సమాజం. తప్పును తప్పని ధైర్యంగా ఎత్తిచూపినప్పుడే అది తలొంచుతుంది’’ అని పసివయసులోనే కొడుక్కి అన్యాయాన్ని ప్రతిఘటించే తెగువను నూరిపోస్తుంది. శ్రీలంక శరణార్థులైన ఆ తల్లీ కొడుకులు అక్కడ జరిగే గొడవల కారణంగా ఒకరికొకరు దూరమైపోతారు.

పసివయసులోనే తల్లికి దూరమై వైజాగ్‌కి చేరుకుంటాడు ప్రభాస్‌. అమ్మకు దూరమైనా అమ్మ మాటకు దూరం కాడు తను. అక్కడ జరిగే అన్యాయంపై తిరగబడతాడు. సాటి వారికి అండగా నిలిచి ఛత్రపతిగా ఎదుగుతాడు. ముల్లును ముల్లుతోనే తీయాలి. వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి అన్నట్టుగా… దుష్టశక్తుల ఆటకట్టించడానికి తాను కూడా ఓ శక్తిలా మారతాడు. ఒకానొక సందర్భంలో తల్లి తనకు చేరువలోనే ఉందన్న విషయం ప్రభాస్‌కి తెలుస్తుంది. తన కొడుకు ఇలా సంఘవ్యతిరేక శక్తిగా మారాడని తెలిస్తే ఆ తల్లి గుండె తట్టుకోలేదు. అందుకే నిజం దాస్తాడు. చివరకు తమ్ముడిని దుర్మార్గుల నుంచి కాపాడే క్రమంలో తుపాకీ తూటాలకు గురవుతాడు. ‘‘ఎందుకు చేశావ్‌ ఇదంతా’’ అని అమ్మ అడుగుతుంది.

‘‘ఒట్టేసి ఒకటి ఒట్టేయకుండా ఒకటి చెప్పనమ్మా…’’ అని చిన్నప్పుడు అన్న మాటను మళ్లీ అమ్మతో అంటాడు ప్రభాస్‌. అతని మెడలోని ఆమె తొడిగిన గొలుసును చూసి గుర్తుపడుతుంది భానుప్రియ. అతడు తన బిడ్డే అని తెలుసుకుని భోరున విలపిస్తుంది. ఇందులో ప్రభాస్‌కి భానుప్రియ కన్నతల్లి కాదు.. సవతి తల్లి. కనినా, పెంచినా… అమ్మ అమ్మే కదా.రోజులు మారాయి. అమ్మనుంచి అనురాగం పొందే పిల్లలు ఆమెనో ఫ్రెండ్‌గా ట్రీట్‌ చేసే రోజులొచ్చాయి. తమ ఫీలింగ్స్‌ను ఆమెతో షేర్‌ చేసుకునే రోజులొచ్చాయి.

‘అమ్మ- నాన్న- తమిళమ్మాయి’ సినిమా ఇటువంటి ట్రెండ్‌కు అంకురార్పణ చేసింది. ఇందులో అమ్మగా యాక్ట్‌ చేసిన జయసుధ అమ్మ పాత్ర రూపురేఖల్నే మార్చిపారేసింది. ఏజ్‌బార్‌ అమ్మశకం ముగిసిపోయి గ్లామరస్‌ అండ్‌ ఫ్రెండ్లీ అమ్మ తరం మొదలైంది జయసుధతోనే. ‘అమ్మా-నాన్న-ఓ తమిళ అమ్మాయి’లో జయసుధ, రవితేజను చూస్తే ఎవ్వరూ తల్లీకొడుకులనుకోరు. బెస్ట్‌ ఫ్రెండ్స్‌లాగా అనిపిస్తారు. ఈ సినిమాలో తల్లి కొడుకుతో కలిసి కాఫీషాపుకెళ్తుంది. పబ్‌కెళ్తుంది. అల్లరి చేస్తుంది. మారాం చేస్తుంది. కొడుకు కిక్‌ బాక్సింగ్‌ ప్రాక్టీస్‌ చేస్తుంటే తను ఎంకరేజ్‌ చేస్తూ ఉంటుంది.

‘‘రేయ్‌ మలేరియాలాగా… నీకు పెళ్లేరియా వచ్చేసింది. ఏజ్‌ బార్‌ అయ్యి ముదురు బెండకాయలా అయిపోతున్నావ్‌. త్వరగా పెళ్లి చేసుకో’’ అంటూ కొడుకు మీదే సెటైర్‌ వేస్తుంది. జయసుధ భర్త ప్రకాశ్‌రాజ్‌ పేరొందిన కిక్‌ బాక్సర్‌. సంసార బాధ్యతలు నెత్తిన లేకపోతే కెరీర్‌లో నేనింకా షైన్‌ అయ్యేవాణ్నంటాడు ప్రకాష్‌రాజ్‌. భర్త కెరీర్‌ కోసం కొడుకును తీసుకొని బయటకొస్తుంది జయసుధ. తండ్రి తమనలా రోడ్డు మీద వదిలేశాడని రవితేజకు కోపం. రవితేజ ఓ తమిళ అమ్మాయిని ప్రేమిస్తాడు. వీరిద్దరినీ జయసుధే కలుపుతుంది. కొడుకుపై ప్రేమతో నిండిపోయిన ఆమె హార్ట్‌పైై ఎటాక్‌ జరుగు తుంది. డాక్టర్లు శ్రమించినా ఫలితం దక్కదు. చనిపోయే ముందు కొడుకుతో నా చివరి కోరిక తీర్చరా. నీ మిగిలిన జీవితమంతా మీ నాన్నతో గడపాలి అని మాట తీసుకుంటుం ది. కొడుకు బుగ్గల్ని తడుముతూ ప్రాణం విడుస్తుంది. ఇలాంటి సన్నివేశాల్ని మనం సినిమాలలో చాలా సహజంగానే చూస్తుంటాం. అమ్మకుండే ప్రాధాన్యత అలాంటిది మరి…

మాతృమూర్తి గురించి ప్రముఖుల నిర్వచనం….

అమ్మలో ఉన్న వైభవం, దివ్యత్వం ప్రపంచంలో ఎవరి వద్దా చూడలేదు. ప్రపంచంలో దేశదేశాల్ని చుట్టి, లక్షలాది మందిని కలిసినా అమ్మ వంటి అపురూప వ్యక్తి ఎక్కడా తారసపడలేదు. నేను సంపాదించిందంతా ఆమె చరణాల వద్ద పోసినా ఇంకా బాకీ పడతాను. – చార్లీ చాప్లిన్‌

నా తల్లి దీవెనలు, ప్రార్థనలు అనుక్షణం నన్ను అంటిబెట్టుకునే ఉంటాయని నా విశ్వాసం. అవే నన్ను ఎల్లవేళలా కాపాడుతాయి. - అబ్రహం లింకన్‌

నేను ఇప్పటి వరకు ఈ భూమండలంపై మా తల్లినిమించిన అందగత్తెను చూడ లేదు. జీవితాంతం నా తల్లికి రుణపడి ఉం టాను. ఇప్పటి వరకు నేను సంపాదించిన జ్ఞానం, విద్య, ఉన్నత ఆలోచనలు అన్నీ మా తల్లి బోధించినవే. ఆమె చలవవల్లే నేను ఈ స్థితిలో ఉన్నాను.- జార్జ్‌ వాషింగ్టన్‌

నా తల్లికున్న ఓపిక, సహనం ఏ స్ర్తీకి ఉండదేమో. అమాయకత్వం కలబోసిన మోముతో సున్నితంగా ఉంటూనే అవసరమైతే ధైర్యంగా, సింహంలా ఎదురొడ్డి నిలుస్తుంది. బాల్యంలో ఆమె నేర్పిన బుద్ధులే ప్రస్తుతం నాకు మార్గదర్శకంగా నిలిచాయి.- ఆండ్రూ జాక్సన్‌

అమ్మదనంలో ఉండే తీయదనం, ఆహ్లాదం.. ప్రకృతిలో సహజ సిద్ధంగాఉండే వనరుల నుండి కూడా పొందలేము.- బార్బరా కింగ్‌సోల్వర్‌

ప్రపంచంలో పరమ పవిత్రమైన పదం ‘అమ్మ’. అమ్మదనంలో ఉన్న సౌందర్యం ప్రపంచంలోని ఏ కళలోనూ ఉండదు. అందులో లభించే ఆనందం, సంతోషం, తృప్తి ఏ వృత్తిలోనూ లభించదు.- డేవిడ్‌ ఒ. మెక్‌కే

చిన తల్లిని భారంగా భావిస్తున్నారు కొందరు పిల్లలు. వృద్ధాశ్రమంలో చేర్పిస్తున్నారు. ప్రాణానికి ప్రాణంగా పెంచి పెద్ద చేసిన మాతృమూర్తిని మరిచిపోతున్నారు. అమ్మను బాధ పెడితే… సమస్త దేవతల్ని బాధ పెట్టినట్లే. ఈ నిజం తెలుసుకున్నవారే నిజమైన పిల్లలు.

Source: Surya Daily.

వేసవిలో తినాల్సినవి.. తినకూడనివి.
వేసవిలో ఎలాంటి ఆహారం తీసుకోవాలి. వేటిని తీసుకోకూడదని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. వేసవిలో శరీరంలో నీటిశాతాన్ని సక్రమంగా ఉంచుకోవాలి. అయితే నీటిని మాత్రమే తాగడంతో శరీరంలోని నీటి శాతాన్ని సరైన స్థాయిలో ఉంచుకోవడం కుదరదు. అందుచేత నీటిశాతం అధికంగా ఉన్న కూరగాయలను తీసుకోవడం చాలా మంచిది.

వీలైనంత వరకు కూరగాయలను ఉడికించకుండా తీసుకోవడం మంచిది. కావాలంటే కాసేపు ఉడికించుకోవచ్చు. కానీ అధికంగా కాయగూరలను ఉడికించి తినడం ద్వారా ఎలాంటి ప్రయోజనం ఉండదనేది గుర్తు పెట్టుకోవాలి. ఇక వేసవిలో శుభ్రమైన నీటిని సేవించాలి. ముఖ్యంగా కూల్‌డ్రింక్స్, ఎనర్జీ డ్రింక్స్‌ను సేవించడాన్ని చాలా మటుకు తగ్గించాలి.

ఇక పుచ్చకాయ ముక్కలు తీసుకోవచ్చు. పుచ్చకాయలో 90 శాతం నీటి శాతం ఉండటంతో శరీరానికి తగిన నీటి శాతాన్ని పుచ్చకాయ అందిస్తుంది. ఇంకా కీరదోస ముక్కల్ని కూడా అధికంగా తీసుకోవచ్చు. వేసవిలో నీటిద్వారా వ్యాధులు వ్యాపిస్తాయి కాబట్టి ఎప్పడూ చేతిలో వాటర్ బాటిల్‌ను ఉంచుకోవడం మంచిది.

ఉల్లిపాయలను కూడా అధికంగా తీసుకోవచ్చు. వేసవిలో కొంచెం కొంచెంగా కార్బొహైడ్రేడ్‌తో కూడిన ఆహారాన్ని తీసుకోవడం ద్వారా మంచి శక్తి లభిస్తుంది. బంగాళాదుంపలు, బీన్స్, అన్నం వంటివి కొంచెం కొంచెంగా తీసుకోవడం చాలా మంచిది. కూల్‌డ్రింక్స్, సీసాల్లో అమ్మే జ్యూస్‌లతో ఎలాంటి లాభం లేదు. ఇవి శరీరంలో కెలోరీల శాతాన్ని పెంచడం వరకేనని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

ఆరోగ్యవ౦తమైన ఆహార ద్రవ్య౦ “నిప్పట్లు” తెలుగు పుల్కాలు!
“దోసియలు సేవియలు న౦గర పూవియలు, సారసెత్తులు, జొత్తరలు చక్కిల౦బులు…”అ౦టూ కాశీఖ౦డ౦ కావ్య౦లో శ్రీనాథ మహాకవి “అ౦గరపూవియ” అనే వ౦టకాన్ని ప్రస్తావి౦చాడు. స౦స్కృత౦లో అ౦గారపోళికా అ౦టే ఇదేనని సూర్యరాయా౦ధ్ర నిఘ౦టువు పేర్కొ౦ది. నిప్పులమీద కాల్చి చేసే వ౦టక౦ అని దీని భావ౦. శ్రీనాథుడి తర్వాత 200 ఏళ్లకు వెలువడిన హ౦సవి౦శతి కావ్య౦లో అయ్యలరాజు నారాయణామాత్యుడు “గారెలు బూరెలు మోరు౦డ ల౦గరొల్లెలు …గూళ్ళాపిడలాదిగా గల భక్ష్య౦బు…” లను ప్రస్తావి౦చాడు. గణపవరపు వే౦కటకవి తన “ప్రబ౦థరాజ వే౦కటేశ్వర విజయ౦” కావ్య౦లో “మోరు౦డలు మనోహర౦బులు గారెలు బూరెలు మ౦డె౦గ ల౦గరొల్లెలు మణుగు బువ్వులు, పేణీ లొబ్బట్లు కడియపుటట్లు….” అ౦టూ కొన్ని వ౦టకాల పేర్లు చెపుతూ అ౦గరొల్లెలను గురి౦చి పేర్కొన్నాడు. అ౦గర పొలియ, అ౦గ పూవియ, అ౦గరొల్లె,అ౦గరుల్లె లా౦టి పేర్లను అనేక మ౦ది కవులు ప్రస్తావి౦చారు. ఇవన్నీ అ౦గారపోళిక అనే స౦స్కృతనామానికి పర్యాయాలే!

ఆప్టే స౦స్కృత నిఘ౦టువులో “పోలికా” పదానికి గోధుమ పి౦డితో చేసిన భక్ష్య విశేష౦ అనే అర్థ౦ ఉ౦ది. గోధుమ పి౦డిని తడిపి, నెయ్యి లేక నూనెతో మర్ది౦చి ముద్దగా చేసిన దాన్ని పోలి అ౦టారు. ఈ పోలితో చేసిన వ౦టక౦ పోలిక లేదా పోళిక. “పోళీ” అనే ప్రయోగ౦ కూడా ఉ౦ది. పలుచగా వత్తి, కాల్చిన రొట్టెని మరాఠీ భాషలో “పోలె౦” అ౦టారు. ఈ పోలికా అనేది స౦స్కృత పదమేనా అనేది ఆలోచి౦చాల్సిన ప్రశ్న. ద్రావిడ భాషల్లో పొలి, పోలి పదాలు పొ౦గారు, పెద్దదగు అనేఅర్థాలలో మాత్రమే కన్పిస్తాయి. పూర్వ ద్రావిడ భాషలో pol-i- పదానికి to acquire, gain, prosper అర్థాలే కనిపిస్తాయి. ద్రవిడియన్ ఎటిమలాకకకల్ డిక్ష్నరీ DEDR 4550 కూడా “పోలి” పదానికి తెలుగు, తమిళ, కన్నడ, మళయాళ తదితర ద్రావిడ భాషలలో ఇదే అర్థ౦ ఉన్నట్టు పేర్కొ౦ది. వీటిల్లో దేనికీ ఆహార పదార్థ౦ అనే అర్థ౦ లేదు.

కానీ, ప్రాకృత౦లో “పోలి-అ”, స౦స్కృత౦లో “పోలిక” తెలుగు తదితర ద్రావిడ భాషల్లో పూప, పోపిక, పౌల్చ, పోల్చ,లేదా పోళిక పదాలు కాల్చిన రొట్టె అనే అర్థాన్నిచ్చేవిగానే కన్పిస్తాయి. నిప్పులమీద గానీ. సన్న సెగమీద గానీ కాల్చి తయారు చేసిన రొట్టెల్ని పోళి అ౦టారని మౌలిక౦గా ఒక నిర్ణయ౦ చేయవచ్చు. పోళీ అ౦టే బొబ్బట్లు అని తెలుగువ్యుత్పత్తి కోశ౦లో ఉ౦ది. ఒకప్పుడు బొబ్బట్లను అలా చేసేవారేమో తెలియదు. బసవ పురాణ౦లో పోలె అనే వ౦టకాన్నిప్రస్తావి౦చటాన్ని బట్టి తెలుగు నేల మీద కనీస౦ వెయ్యేళ్ళ చరిత్ర దీనికి ఉ౦దని మన౦ భావి౦చవచ్చు. కన్నడ౦లో పోలిగె,మోళిగే అ౦టే, పెన౦ మీద కాల్చిన బియ్యపు పి౦డి రొట్టె అని! పోళిక అనేది ద్రావిడ భాషలన్ని౦టా ఇ౦త వ్యాప్తిలో ఉ౦డి, దానికి ద్ర్తావిడ పరమైన వ్యుత్పత్తి కనిపి౦చకపోవట౦ ఆశ్చర్యమే! మరి౦త లోతుగా చూస్తే వాస్తవాలు వెలుగులోకి రావచ్చు.

తెలుగులో “పోలు” శబ్దానికి వృత్తిపరమైన మరో అర్థ౦ కూడా ఉ౦ది. ఇదే ముఖ్యమై౦ది కూడా…! కు౦డలుచేయట౦ కోస౦ సారె మీద లి౦గాకార౦లో ఉ౦చిన మట్టిముద్దను పోలు అ౦టారు. జిగురు వచ్చే౦తవరకూ బాగా మర్ది౦చిన మట్టి ముద్దని పోలు అ౦టారు. పోలుని సారె చక్ర౦ మీద ఉ౦చి, లోపల బోలుగా ఉ౦డేలా కావలసిన ఆకార౦లోకి  మలచటాన్ని“పోలుపట్టట౦” అ౦టారు. కు౦డల తయారీ మన ప్రాచీన విద్య. ఈ తొలినాటి విద్యలకు స౦బ౦ధి౦చినసా౦కేతిక పదాలు మన భాషలోనే రూపొ౦ది ఉ౦డట౦ సహజ౦. అలా రూపొ౦దట౦ తెలుగుభాష ప్రాచీనతకు తెలుగుప్రజల ప్రాచీనతకు నిదర్శన౦ కూడా! క్రమేణా ఇలా౦టి సా౦కేతిక పదాలు నిత్యవ్యవహార౦ లోకి కూడా చేరి అనేక కొత్త అర్థాలనిస్తాయి. కు౦డల తయారీకి స౦బ౦ధి౦చిన “పోలి” అనే పదాన్ని జిగురు వచ్చేదాకా మర్ది౦చిన పి౦డి ముద్దకు తెచ్చి పెట్టటమే ఇ౦దుకు తార్కాణ౦. ఇలా౦టిదే మరో ఉదాహరణ చూడ౦డి. కార్తీక మాస౦ అమావాస్య వెళ్ళిన పాడ్యమితెల్లవారుఝాముసమయ౦లో పసుపు ముద్దతో చేసిన గౌరమ్మను పూజి౦చి, అరటి దొన్నెలలో దీపాలు వెలిగి౦చి నీళ్ళలో వదులుతారు. పోలిని స్వర్గానికి ప౦పే కార్యక్రమ౦ ఇది. పసుపు ముద్ద(పోలి) ఈ పూజలో ప్రధానమై౦ది. గోధుమ పి౦డితోపోలెను తయారు చేసి, పలుచగా గు౦డ్ర౦గా వత్తి, సన్న సెగను కాలిస్తే అది పోలిక అనే వ౦టక౦ అయ్యి౦దన్నమాట! దాన్నేఇప్పుడు పుల్కా అ౦టున్నారు. నిప్పుల మీద కాల్చట౦ అనేది ప్రత్యేక౦ కాబట్టి అ౦గార పోళిక అనే పేరు బాగా అవ్యాప్తి లోకి వచ్చి౦ది. శ్రీనాథుడు చెప్పిన “అ౦గార పూవియలు” అ౦టే నిప్పులమీద కాల్చిన రొట్టెలేనని ఈ నిరూపణలను బట్టి అర్థ౦ చేసుకోవచ్చు. అయితే శ్రీనాథుడు నిప్పట్లు గొల్లెడలు దోసియు (కాశీ. 7-186) అ౦టూ నిప్పట్లు గురి౦చి కూడాఅదే గ్ర౦థ౦లో ప్రస్తావి౦చాడు. నిప్పులమీద కాల్చిన అట్టు అనే దీనికీ మన౦ అర్థ౦ చెప్పుకొ౦టే, అ౦గారపూవియలనూ,నిప్పట్లనూ వేర్వేరు రకాలుగా కాల్చి తయారు చేసుకొనే వారని ఊహి౦చవచ్చు.

భావప్రకాశ అనే స౦స్కృత వెైద్య గ్ర౦థ౦ 15వ శతాబ్ది కాల౦ నాటిదిగా భావిస్తున్నారు. తెలుగునాట ఇది బాగాప్రసిద్ధి చె౦దిన గ్ర౦థ౦. శ్రీనాథుడి తరువాతి కాలానికి చె౦దిన ఈ గ్ర౦థ౦లో దక్షిణాది ప్రజల ఆహార విహారాలు, వారిస౦స్కృతికి స౦బ౦ధి౦చిన అనేక అ౦శాలు కనిపిస్తాయి. ఇ౦దులో “అ౦గారకర్కటి” అనే ఒక వ౦టక౦ గురి౦చి వివర౦గాఉ౦ది. గోధుమ పి౦డిని తడిపి బాగా నేతితో మర్ది౦చి తీపిగానీ కార౦గానీ కలిపి నున్నటి బ౦తిలా చేస్తే దాన్ని పోలి అ౦టారు కదా…! ఈ పోలిని  కు౦పటిలో ఎర్రగాగా కాలుతున్ననిప్పులలో వేసి మగ్గనిస్తారు. వేరుశనగ కాయలను త౦పట వేసుకొనే పద్ధతిలో ఈ పోలిని కాలుస్తారన్నమాట! లేదా వేడి కుమ్ములో పెడతారు. చల్లారిన తరువాత పైన మాడుబెరడును తొలగిస్తే లోపల బాగా మాగిన పి౦డి తెల్లని పువ్వులా విచ్చుకొని ఉ౦టు౦ది. దీన్నే బహుశా అ౦గార పూవియగా శ్రీనాథుడు పేర్కొని ఉ౦టాడని నా ఊహ. తియ్యని పాలలో గానీ, కారపు సూపులో గానీ దీన్ని న౦జుకొని తినవచ్చు. తెలుగువారి తొలి బేకి౦గ్ప్రక్రియ ఇది. త౦డూరి పొయ్యలు తెలియని ఆ రోజులలోనే నిప్పట్లు, అ౦గార పోళికలు ఇలా౦టివి తయారు చేసుకొన్నారు మన పూర్వీకులు. ఇప్పుడు చెప్ప౦డి, జీవితాన్ని వాళ్ళు ఆనాడు ఎక్కువ ఎ౦జాయ్ చేశారా… నాగరకులమనే భ్రమలో కనీస పోషక విలువలు లేని పిజ్జాలు, బర్గర్ల వ౦టివి తి౦టూ మన౦ ఎక్కువ ఎ౦జాయ్ చేస్తున్నామా…? ఇలా౦టివి చేసుకోవటానికి ఇప్పుడు కు౦పట్లు ఎక్కడ దొరుకుతాయ౦డీ అని పెదవి విరిచేయక౦డీ…! గ్యాసు పొయ్యి మీద గానీ, మైక్రోవోవెన్లో గ్రిల్ల్  మీద గానీ నిప్పట్లు, అ౦గార పొలియలూ నిరభ్య౦తర౦గా కాల్చుకోవచ్చు.

కొ౦చె౦ మనసు పెడితే, స్కూలు ను౦చి రాగానే పిల్లలకూ, వృధ్ధులకూ, అలసిఆఫీసును౦చి వచ్చే ఉద్యోగులకూ, అ౦దరికీ పెట్టదగిన ఆరోగ్యవ౦తమైన ఆహార ద్రవ్య౦ ఇది. ఆరోగ్యానిచ్చే దాన్ని పాతద౦టూ ఈసడి౦చుకోకు౦డా సద్వినియోగ పరచుకోవలసిన అవసర౦ ఉ౦ది కదా…!

-డా జి వి పూర్ణచ౦దు.

పచ్చిమామిడితో వెరైటీ వంటలు!
* Mango Chicken Curry

Mango chicken is undeniably a specialty of the coasts. This Indian curry recipe is characteristically more popular in the island city of Mumbai and the ‘gaons’ of Goa. Chicken embroiled in rich mango curry could only be delicious but it is a very summer specific recipe. The best time to try this Indian curry recipe with chicken is when the mangoes are just about half ripe (which is now, in the month of March).

Mango chicken is not a very delicate dish to prepare but this easy chicken recipe fares well with coconut oil for cooking. If you do not like the flavour then mustard oil could be a good replacement. If you like your mango curry to be really tangy then choose unripe mangoes or else the sweet and sour flavour of half ripe mangoes is really intoxicating. This Indian curry recipe has to enjoyed leisurely with plain rice to taste all the flavours properly.

Ingredients For Mango Chicken:

1. Chicken (boneless) 500 grams

2. Baby onions 2 (paste)

3. Mango 1 (peeled and cut into small pieces)

4. Coconut (grated) 1 cup

5. Garlic 2 cloves

6. Ginger 1 inch piece

7. Green chillies 2

8. Dry Red Chillies 2

9. Fennel seed 1 teaspoon

10. Turmeric powder 1 teaspoon

11. Red chilli powder 1 teaspoon

12. Mustard seeds 1 teaspoon

13. Cardamom 4 pods

14. Cinnamon sticks 1 inch

15. Bay leaf 1

16. Coconut oil 3 tablespoons

17. Slat as per taste

Procedure For Mango Chicken:

* Make a paste out of garlic, chillies, ginger and dry red chillies. You can either use a blender or do it roughly by hand.

* Marinate the chicken chicken with this paste and keep it overnight in the refrigerator.

* Fry the grated coconut and the onion paste in a pan. When it starts smelling good and browns a little, keep it aside.

* Heat oil in a deep bottomed pan. Season it with bay leaves, cardamom, cinnamon sticks, mustard seeds and fennel seeds.

* Add the chicken with the marinade into the oil and let it cook on low flame for 5-6 minutes.

* When the oil separates from the curry add the fried coconut onion paste to it. Add the powdered spices and stir well.

* Now add the chopped mango pieces and pour 2 cups of water. Add salt; cover and cook for 8-10 minutes on low flame.

Serve mango chicken with steamed rice as a summer delicacy.

Courtesy: Chekuri Gouthama Raju.

Real Barbies Valeria, Venus & Dakota
Living dolls are becoming the new internet sensation, with a Ukrainian, a Brit and an American leading the march. All have huge eyes, flawless porcelain skin, endless legs, shiny hair and vacant stares to match their little-girl outfits.

Valeria Lukyanova, 21, has sparked so much speculation about whether she has gone under the knife or been Photoshopped that Taiwan’s New Media Animation has even uploaded a spoof cartoon about her purported plastic surgery on YouTube.

In her own YouTube response, Lukyanova recorded a video titled “Doll’s appearance is not everything”.

She writes on the page: “The easiest way to slander and to me as a doll, for outer beauty is, nothing (sic).

“No one said that my looks, it is hard work for many years and good genes. Not mentioned in his video that I rawfoodist, that I do not drink, I do not smoke.”

Lukyanova is not the only living doll. In hot contention are the lisping British 15-year-old, Venus Palermo, who speaks with a fake Japanese accent, and 16-year-old Dakota Rose.

How they stack up

Valeria Lukyanova

Age: 21

Nationality: Ukrainian

Doll name: None

Hair colour: Blonde

Followers: 161,350

YouTube videos watched: 3.4 million

Venus Palermo

Age: 15

Nationality: British

Doll name: Venus Angelic

Hair colour: Blonde

Tutorials watched: 12 million times

Followers: 20,000

YouTube videos watched: 13.4 million

Dakota Rose

Age: 16

Nationality: American

Doll name: Dakotakoti

Hair colour: Light brown

Videos watched: 19 million times

Followers: 42,340

YouTube videos watched: 19.7 million

Source: Yahoo.com

గుండె వ్యాధిని కలిగించే నిద్రలేమి..!!
నిద్రలేమితో బాధపడుతున్నారా? రోజుకు కనీసం ఆరుగంటలైనా గాడనిద్ర పోలేకపోతున్నారా? అయితే మీ ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండండి. నిద్రసరిగ్గా పట్టని వారు, కలత నిద్రతో కంటినిండా నిద్రపోలేని వారు ఆరోగ్యం విషయంలో జాగ్రత్త పడాల్సిందేనని తాజాగా జరిపిన ఒక పరిశోధనలో తేలింది.

శిశువులు, చిన్నపిల్లలు రోజుకు 12 నుంచి 16 గంటలపాటు నిద్రపోవాలి. అదే యుక్తవయస్కులైతే రోజుకు కనీసం 9 గంటలపాటు నిద్రపోవాలి. 30 ఏళ్లు దాటిన వారైతే రోజుకు 6 నుంచి 8 గంటలపాటు నిద్రపోవాలని వైద్య నిపుణులు చెబుతున్నారు.

రోజుకు ఆరు గంటలు కూడా నిద్రపోని వారికి గుండె వ్యాధులు వచ్చే అవకాశం 36 శాతం అధికంగా ఉందని ఒక అధ్యయనంలో వెల్లడైంది. కాగా ఆరు గంటలు కూడా నిద్రపోని స్త్రీలలో ఛాతీలో కణుతులు వచ్చే అవకాశం 60 శాతానికి పైగా ఉందని జపానులో జరిపిన మరో అధ్యయనం చెబుతోంది. నిద్రలేమి వల్ల బ్లడ్ ప్రెషర్ పెరిగి హార్మోన్ల ఉత్పత్తికి అడ్డం ఏర్పడుతుందని, ఇది గుండెపై ప్రభావం చూపుతుందని పరిశోధకులు అంటున్నారు.

మీరు ఎత్తు తక్కువగా కనిపిస్తున్నారా..?!!
మీరు ఎత్తు తక్కువగా కనిపిస్తున్నారు? అయితే పెద్దగా శ్రమపడాల్సిన పనిలేకుండా కొన్ని చిట్కాలతో పొడవుగా ఉన్నట్లు ఎదుటివారికి భ్రమకలిగించవచ్చు.

* ధరించే దుస్తులు ఒకదానికొకటి విభిన్నంగా ఉన్న రంగులను వాడటం వల్ల మరింత పొట్టిగా కనిపించే అవకాశం ఉంటుంది. అందువల్ల దుస్తులను ఎంపిక చేసుకునేటప్పుడు ఆభరణాలు మొదలుకొని, కాలి చెప్పులు వరకూ మ్యాచింగ్ పాటించాలి.

* పెద్దపెద్దగా డిజైన్లు ఉండే దుస్తులను వేసుకుంటే మరింత పొట్టిగా కనిపిస్తారు. వీలైనంత వరకూ చిన్న చిన్న ప్రింట్లతో తయారు చేసిన దుస్తులను ఎంచుకోవాలి.

* అడ్డగీతలతో రూపొందించిన దుస్తులు పొట్టిగా, లావుగా కనిపించేలా చేస్తాయి. నిలువుగీతలు ఉన్న దుస్తులను వాడడం వల్ల సాధారణంగా ఉన్న ఎత్తుకంటే పొడవుగా ఉన్నట్లు భ్రమ కలుగుతుంది.

* ఒంటికి అంటిపెట్టుకుని ఉన్నట్లు ఉన్న వస్త్రాలు కాస్త పొడవుగా కనిపించేలా చేస్తాయి. వదులుగా ఉన్న డ్రెస్సులు, ప్యాంటులు, స్కర్ట్‌లు పొట్టిగా ఉన్నారనిపించే భ్రమని కలిగిస్తుంది.

* పొట్టిగా ఉన్నవారికి పెద్ద పెద్ద బెల్ట్‌లు అంతగా నప్పవు. ఒంటిని అంటిపెట్టుకునేలా ఉండే చిన్న బెల్ట్‌లు వాడడం వల్ల మరింత అందాన్నిస్తాయి.

* ఎక్కువ నడుము భాగాన్ని ఆక్రమించే స్కర్ట్‌లు, ప్యాంట్లు పొడవుగా కనిపించేలా చేస్తాయి. కానీ ఇవి కేవలం సన్నగా ఉన్నవారికి మాత్రమే నప్పుతుంది. చిన్న స్కర్ట్‌లు పొట్టిగా ఉన్నవారికి బాగా ఉపయోగపడతాయి. అయితే మోకాలిపైకి ఉండకుండా చూసుకోవాలి.

* చెవులకు ధరించే పొడవైన జుంకాలు, వదులుగా విరబోసుకున్న జుట్టు పొడవుగా ఉన్నట్లు భ్రమింపచేస్తాయి. పొడవైన హారాలు, పెండెంట్లు కూడా నప్పుతాయి.

* టీషర్ట్‌లు, స్వెట్టర్లు ‘వి’ ఆకృతిలో ఉండేవి ఎంచుకోండి. ఇవి మీ ఎత్తు పెరిగినట్లుగా కనిపించేలా చేస్తాయి.

అధరాల సౌందర్యం కోసం
ప్రతిరోజూ లిప్‌స్టిక్ వేసుకునే ముందు పెదాలకు వెన్నతో మసాజ్ చేయాలి. పగిలిన పెదాలకు వెన్నతో మసాజ్ చేయాలి. పగిలిన పెదాలకు లిప్‌స్టిక్ బాగుండదు. లిప్‌స్టిక్ ఎంతవరకు వేసుకోవాలో లైనర్‌తో మార్క్ చేసుకోవాలి.

పెదవులు లావుగా వున్నట్లైతే కాస్త లోపలి వైపు గీత గీసి డార్క్ కలర్ షేడ్ చేసి లోపలి భాగం లైట్ కలర్‌తో నింపాలి. అక్కడ కొద్దిగా పౌడర్ అద్ది మళ్ళీ మొదట చేసిన విధంగా చేయండి.

పెదవులు సన్నగా వుంటే కాస్తపైకి మార్క్ చేసుకుని ముందు డార్క్ కలర్ షేడ్ చేసిన తర్వాత లైట్ కలర్ వేయండి. ప్రతి ఒక్కరికీ డార్క్ షేడ్, రెడ్, మెరూన్, బ్రౌన్ కలర్స్ బాగుంటాయి. ఇతర కలర్స్, డ్రస్‌కు అయ్యే కలర్స్‌ నప్పనవి గుర్తుంచుకోండి. కలర్స్ వేసుకున్న తర్వాత లిప్ గ్లాస్ రాయండి.

ఓట్స్‌తో సహజ సౌందర్యం మీ సొంతం
వేసవిలో రకరకాల చర్మసమస్యలు బాధిస్తుంటాయి. వాటి పరిష్కారానికి వివిధ సౌందర్యోత్పత్తులు ప్రయత్నించే బదులు ఇంట్లో దొరికే పదార్థాలతోనే చికిత్స చేసుకోవచ్చు.

* ఓట్స్‌ను మెత్తగా చేసి అందులో చెంచా తేనె కలిపి ముఖానికి పూత వేసుకొని, పావుగంటయ్యాక మర్దన చేసి కడిగేస్తే మృతకణాలు తొలగి మేని మృదుత్వాన్ని పొందుతుంది.

* చర్మం పొడిబారినట్లు కనిపిస్తుంటే అరటిపండు గుజ్జులో కొద్దిగా పెరుగు, నాలుగైదు చుక్కల గులాబీ నీరు కలిపి మెత్తగా చేసి ముఖానికి రాసుకొని అరగంటయ్యాక కడిగేయాలి. తరచూ ఇలా చేయడం వల్ల చర్మం తేమను పొంది కాంతివంతంగా కనిపిస్తుంది.

* చర్మం కాంతివిహీనంగా మారినప్పుడు ఉడికించిన బంగాళాదుంపను మెత్తగా చేసి అందులో గుడ్డులోని తెల్లసొన కలిపి పూతలా వేయాలి. తేమ ఆరాక నీళ్లతో తడిపి మర్దన చేసి కడిగేయాలి.

* పంచదారను మెత్తగా చేసి అందులో చిటికెడు ఉప్పు, రెండు చెంచాల కమలా రసం కలిపి ముఖానికి మర్దన చేసి, అరగంటయ్యాక కడిగేస్తే, రెండు మూడు రోజులకోసారి ఈ నియమం పాటిస్తుంటే కళ్ల కింద, ముఖం చుట్టూ పేరుకుపోయిన మృతకణాలు క్రమంగా తొలగి చర్మం మెరుస్తుంది.