Sunday, May 20, 2012
 

టి.ఆర్.ఎస్ సీన్ రివర్స్

రాజీనామాలు  చేయడం, ఉప ఎన్నికల్లో పోటీ చేయడం లో విజయవంతమైన అనుభవం టి.ఆర్.ఎస్ కు  చాలానే ఉంది. అయితే అంత అనుభవం ఉన్నా కూడా, టి.ఆర్.ఎస్ ఈ సారిఉప  ఎన్నికలకు భయపడుతుంది. తెలంగాణ ప్రాంతం  అంతటా తనకు మాత్రమే మద్దతు ఉందని మొన్నటివరకు అనుకున్న టి.ఆర్.ఎస్ ఇప్పుడు  ఆలోచనలో పడింది. తెలంగాణ ప్రాంతంలో ఖాళీ అయిన స్థానాలకు త్వరలోనే ఉప ఎన్నికలు జరుగబోతున్నాయి.  అయితే ఈ ఉప ఎన్నికల్లో విజయం సాధించడం తెరాస కు నల్లేరుపై నడక మాత్రం కాదు. తెలంగాణ సాధన కోసమే అంటూ టి.డి.పి నుంచి బయటకు వచ్చిన నాగం జనార్ధనరెడ్డి పై పోటీ పెట్టే అవకాశం టి.ఆర్.ఎస్ కు లేదు. అలా అని నాగం తెరాసలో చేరనూ లేదు. అలాగే పరకాల నియోజకవర్గం కూడా డైలమాలోనే ఉంది. పరకాలలో  కొండా సురేఖను తప్ప తెలంగాణలో మరెక్కడా పోటీ చేయబోమని జగన్, కేసీఆర్ కు పరోక్షంగా స్నేహ హస్తం ఇచ్చారు. భవిష్యత్ అవసరాల దృష్ట్యా ఈ స్థానంలో కూడా తెరాస పెద్దగా ఆశలు పెట్టుకునే అవకాశం లేదు. మహబూబ్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే రాజేశ్వరరావు చనిపోవడంతో అక్కడ ఎన్నికలు జరగనున్నాయి. అక్కడ తెరాస ఎవరిని నుంచోబెట్టినా కూడా సానుభూతి పవనాలు రాజేశ్వరరావు భార్యకే ఉంటాయి గనుక ఆ స్థానం ఆశలు వదులుకున్నట్టే. రాజేశ్వరరావు భార్య మొదట టి.ఆర్.ఎస్ లో చేరతారని అనుకున్నా, కాంగ్రెస్ పెద్దలు జోక్యంతో ఆమె అధికార పార్టీలోనే ఉన్నారు. ఈ నియోజకవర్గంలోనే ఉద్యోగ సంఘాల నాయకుడు స్వామి గౌడ్ ను తెరాస తమ అభ్యర్ధిగా నిలపనుందని సమాచారం. అయితే ఆయనకు విజయావకాశాలు మాత్రం తక్కువే. కామారెడ్డి నియోజక వర్గం ఎమ్మెల్యే గంపా గోవర్ధన రెడ్డికి,  ఆ నియోజకవర్గంలో తీవ్ర వ్యతిరేకత ఉంది. కేవలం టి.ఆర్.ఎస్. పార్టీ అభ్యర్ధిగా నిలబడటం వలన అతను గెలిచే అవకాశాలు ఉండవు. ఇక స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం నుంచి ఎన్నికయిన టి.రాజయ్యపై కూడా నియోజకవర్గం లో వ్యతిరేకత ఉంది. ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నేత శ్రీహరికి మంచి క్యాడర్ ఉంది.  కడియం శ్రీహరి గనుక ఉపఎన్నికల్లో పోటీ చేస్తే టి.రాజయ్య ఆశలు వదులుకోవాల్సిందేనని రాజకీయవిశ్లేషకుల మాట. ఇలా నియోజకవర్గం వారీగా సమస్యలతో పాటు బి.జె.పి రూపంలో టి.ఆర్.ఎస్ కు పెద్ద ప్రమాదమే పొంచి ఉంది. కిషన్ రెడ్డి తెలంగాణ బిజెపి తోనే సాధ్యం అంటూ చేస్తున్న తెలంగాణ పోరు యాత్రకు మంచి స్పందన వస్తుంది. బిజేపే తన బలాన్ని అంచనా వేసుకోవడానికి ఈ ఉప  ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉంది. ఇదే జరిగితే బీజెపీ చీల్చేది టి.ఆర్.ఎస్ ఓట్లనే. తెలుగుదేశం తెలంగాణ ఫోరం కూడా నెమ్మదిగా తమ పార్టీ పునర్వైభం కోసం ప్రయత్నిస్తుంది. పోలవరం టెండర్లు, అర్ధాంతరంగా సకలజనుల సమ్మె ముగించడం వంటి విషయాలతో టి.ఆర్.ఎస్ పట్ల తెలంగాణ ఓటర్లకు ఏర్పడిన సందేహాలను ఆ పార్టీ తీర్చలేదు. ఈ విషయాలన్నీ ఎన్నికల్లో తెరాసకు ఎదురుదెబ్బ  తగిలేలా చేస్తాయని విశ్లేషకుల అంచనా.

There are no posts related to టి.ఆర్.ఎస్ సీన్ రివర్స్.

 

Tags: , ,

Comments

No comments so far.
  • Leave a Reply
     
    Your gravatar
    Your Name
     
     
     
     
     
 
About PravasaRajyam

ఎక్కడో పుట్టి… ఎక్కడో పెరిగి… ఎక్కడో వున్నాము…వి్వ వ్యాప్తంగా విస్తరించి వున్న మన తెలుగు ప్రజలందరం ఒక్క చోట చేరాలన్న ఆకాంక్షతో చేస్తున్న నా ఈ చిరు ప్రయత్నమే “ప్రవాసరాజ్యం”( www.pravasarajyam.com )

NRI Network

For info please go through NRI

For NRI Gallery Click NRI Events

Get in touch

UAE Phone: +971 509 772055
Email: uae@pravasarajyam.com

USA Phone: 912-246-6649
Email: usa@pravasarajyam.com

India Phone: +91-40-64592288
Email: ind@pravasarajyam.com

www.pravasarajyam.com