ఉప ఎన్నికల అభ్యర్థుల ఎంపిక కొలిక్కి వచ్చింది
ఉప ఎన్నికల అభ్యర్థుల ఎంపిక కొలిక్కి వచ్చిందని రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. ఎన్నికల్లో తమ పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థుల పేర్లను ఇప్పటికే ఎంపిక చేశామని, ఆదివారం మరోసారి చర్చించి అభ్యర్థుల జాబితాను అధిష్టానానికి పంపిస్తామని కిరణ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు.
కాగా తెలంగాణలోని ఆరు, ఎస్పీఎస్ నెల్లూరు జిల్లాలోని కొవురూ నియోజకవర్గానికి ఈసి నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. తెలుగుదేశం, తెలంగాణ రాష్ట్ర సమితి అన్ని పార్టీల ఎమ్మెల్యేల నియోజకవర్గాలకు తాము నిధులు కేటాయిస్తున్నామని సీఎం చెప్పారు. పార్టీలకతీతంగా అన్ని పార్టీల ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో అవసరమైన చోట అభివృద్ధి పనులు జరుగుతున్నాయని వెల్లడించారు.
వచ్చే మూడేళ్లలో జలయజ్ఞం కింద మూడు లక్షల ఎకరాలకు అదనంగా నీరు అందిస్తామని చెప్పారు. జలయజ్ఞానికి నిధులు తగ్గించలేదని, నిధులు మిగిలి పోకుండా ఎంత ఖర్చు పెట్టారో అంతే ఇచ్చామని సీఎం తెలిపారు.
There are no posts related to ఉప ఎన్నికల అభ్యర్థుల ఎంపిక కొలిక్కి వచ్చింది.
Tags: జలయజ్ఞం, తెలంగాణ, తెలుగుదేశం, నోటిఫికేషన్

Comments