ఈజిప్టులో స్టేడియంలో దూసుకెళ్లిన ఫ్యాన్స్
ఈజిప్టులో జరిగిన సాకర్ మ్యాచ్‌లో అపశృతి చోటు చేసుకుంది. అభిమానులు హింసకు దిగడంతో 73 మంది మృతి చెందారు. ఈజిప్టు లీగ్ మ్యాచ్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన ఎల్-అహ్లీ జీరో జట్టును పోర్ట్ సయీద్ సిటీకి చెందిన ఎల్-మస్రీ జట్టు ఓడించడంతో ఆగ్రహం చెందిన ఫ్యాన్స్.. ఒక్కసారిగా స్టేడియంలోకి దూసుకెళ్లడంతో 73 మంది మృతి చెందారు. ఆల్ – మస్రీ జట్టు ఆల్ – అహ్లీ జట్టును 3-0 స్కోరుతో ఓడించింది.
ఇరు జట్ల అభిమానులు రెండుగా విడిపోయి పరస్పరం రాళ్లు విసురుకున్నారు. రెఫరీ ఫైనల్ విజిల్ ఇవ్వగానే హింస ప్రారంభమైందని భద్రతాధికారులు అంటున్నారు. రాళ్లు రువ్వుకోవడంతో పాటు కత్తిపోట్ల వల్ల చాలామంది మరణించినట్లు తెలుస్తోంది.
భారీ ఎత్తున సాకర్ అభిమానులు హాజరైన ఈ పోటీలకు భద్రత అంతంత మాత్రంగానే ఉందని విమర్శలు వస్తున్నాయి. ఇంకా గాయపడిన వారిని, క్రీడాకారులను తరలించేందుకు సైనిక విమానాలు రంగంలోకి దిగాయి. అలాగే మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఈ సంఘటన ప్రపంచ సాకర్ చరిత్రలోనే హీనమైన సంఘటనగా మిగిలిపోయింది.
Tags: సాకర్

Comments