టైగా ముగిసిన భారత్, శ్రీలంక మ్యాచ్
* చివరి బంతికి స్కోరు సమం చేసిన భారత్
* శ్రీలంక స్కోరు 236/9
* భారత్ 236/9
* హైటెన్షన్ క్రియేట్ చేసిన అడిలైడ్ వన్డే
* ఆఖరు బంతికి మూడు పరుగులు చేసిన ధోనీ
* 58 రన్స్‌తో ధోనీ నాటౌట్
* ఈ మ్యాచ్‌లోనూ సెంచరీ మిస్సైన గంభీర్
అనూహ్య మలుపులు తిరుగుతూ… చివరి వరకు నరాలు తెగే ఉత్కంటగా సాగిన భారత్, శ్రీలంక మ్యాచ్ టైగా ముగిసింది. భారత విజయానికి ఒక బంతికి నాలుగు పరుగులు అవసరమైన దశలో… కెప్టెన్ ధోని మూడు పరుగులు మాత్రమే తీయడంతో మ్యాచ్‌లో ఫలితం తేలలేదు. క్రీజ్‌లో ఉన్న ధోని ఈ మ్యాచ్‌లోనూ గెలిపిస్తాడని
అభిమానులు ఆశించినప్పటికీ… టైతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
ధోని 58 పరుగులతో చివరి వరకు నాటౌట్‌గా ఉన్నాడు. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 236 పరుగులు చేసింది. చేజింగ్‌లో బరిలో దిగిన ధోనిసేన చివరి బంతి వరకు ఆడి లంక స్కోరును సమం చేసింది. భారత బ్యాటింగ్‌లో గౌతం గంభీర్ 91, లంక బ్యాటింగ్‌లో చండీమాల్ 81 పరుగులతో రాణించారు. ధోనికి మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఇరుజట్లు చెరీరెండు పాయింట్లు పంచుకున్నాయి.

Comments