క్రీడా వార్తలు

రోమ్ మాస్టర్స్ టెన్నిస్ టోర్నమెంట్ వివరాలు
రోమ్ మాస్టర్స్ టెన్నిస్ టోర్నమెంట్లో టాప్ సీడ్ల హవా కొనసాగుతోంది. పురుషుల సింగిల్స్ విభాగంలో నోవాక్ జకోవిచ్, రఫెల్ నాదల్, రోజర్ ఫెదరర్‌లు క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించగా, మహిళల సింగిల్స్ విభాగంలో సెరెనా విలియమ్స్, వీనస్ విలియమ్స్ తమ తమ ప్రత్యర్థులను మట్టికరిపించారు.

అయితే నాలుగో సీడ్ ఆండీ ముర్రే మాత్రం 6-7 (1/7), 6-3, 6-2 పాయింట్ల తేడాతో ఫ్రెంచ్ ఆటగాడు రిచర్డ్ గాస్క్వెట్ చేతిలో ఓటమిని చవిచూసి ఈ టోర్నీ నుంచి నిష్క్రమించాడు. ఇక టాప్ సీడ్ నోవాక్ జకోవిచ్ అర్జెంటీనాకు చెందిన జువాన్ మొనాకోను 4-6, 6-2, 6-3 పాయింట్ల తేడాతో ఓడించి క్వార్టర్ ఫైనల్లో జో విల్ఫ్రెడ్ సోంగాతో పోటీకి రెడీ అయ్యాడు.

అలాగే స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్ కూడా 6-1, 6-1 వరుస సెట్ల తేడాతో మార్సెల్ గ్రానోల్లర్స్‌ను ఓడించి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. మరోవైపు స్విజ్ మాస్టర్ రోజర్ ఫెదరర్ మాజీ ప్రపంచ నెంబర్ వన్ జువాన్ కార్లోస్ ఫెర్రెరోను 6-2, 5-7, 6-1 పాయింట్ల తేడాతో ఓడించి క్వార్టర్ ఫైనల్ బెర్తును ఖరారు చేసుకున్నాడు.

ఇకపోతే.. మహిళల సింగిల్స్ విభాగంలో అమెరికా సోదరీమణులు సెరెనా, వీనస్ విలియమ్స్ తమ సత్తా చాటారు. తొమ్మిదో సీడెడ్ సెరీనా అనబెల్ మెడీనా గారీగ్యూస్ (స్పెయిన్)ను 6-3, 6-1 పాయింట్ల తేడాతో ఓడించగా, సమంత స్టోసూర్‌ను 6-4, 6-3 పాయింట్ల తేడాతో వీనస్ విలియమ్స్ మట్టికరిపించింది.

వీనస్ విలియమ్స్ స్టోసూర్‌పై నెగ్గడం ద్వారా యూఎస్ ఒలింపిక్ జట్టులో స్థానం దక్కించుకుంది. గత ఏడాది యూఎస్ ఓపెన్ తర్వాత విలియమ్స్ సిస్టర్స్ కోర్టులో మెరుగ్గా రాణించలేకపోతున్నారు. వీళ్లిద్దరిని గాయాలు ఒకవైపు అనారోగ్య సమస్యలు వెంటాడాయి. ప్రస్తుతం పూర్తి ఫిట్‌నెస్‌తో బరిలోకి దిగిన వీరిద్దరూ తమ తమ ప్రత్యర్థులపై గెలుపును నమోదు చేసుకున్నారు.

ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్: ఐదో గేమ్ వివరాలు
ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్‌లో విశ్వవిజేత విశ్వనాథన్ ఆనంద్ డ్రా పరంపరను కొనసాగిస్తున్నాడు. ఈ టోర్నీలో ఒక్క విజయం కూడా ఇంకా నమోదు చేసుకోలేని ఆనంద్ ఐదో గేమ్‌ను కూడా డ్రాగా ముగించాడు. టైటిల్ కోసం బోరిస్ గెల్ఫాండ్ (ఇజ్రాయెల్)తో తలపడుతున్న ఆనంద్‌కు గురువారం వరుసగా ఐదో డ్రా ఎదురయ్యింది. దీంతో ఇద్దరూ 2.5 పాయింట్లతో కొనసాగుతున్నారు.

ఐదో గేమ్‌లో ఆనంద్ తెల్లపావులతో బరిలోకి దిగాడు. గేమ్ ముందుకు సాగే కొద్దీ గెల్ఫాండ్ దూకుడును ప్రదర్శించాడు. ఈ గేమ్ 26 ఎత్తుల్లో డ్రాగా ముగిసింది. కాగా శుక్రవారం జరిగే ఆరో గేమ్‌లో గెల్ఫాండ్ తెల్లపావులతో బరిలోకి దిగనున్నాడు.

లూకేకు తాత్కాలిక బెయిల్!
ఢిల్లీలో గురువారం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్ల మధ్య ఐపీఎల్ మ్యాచ్ ముగిసిన తర్వాత రాత్రి విందు సందర్భంగా బెంగళూరు క్రికెటర్ లూకే ఫోమర్స్ అమెరికాకు సంతతికి చెందిన భారత అమ్మాయిపై అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడు. ఇంకా అమెరికా అమ్మాయి ప్రియుడిపై దాడికి పాల్పడిన లూకేను పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం అరెస్టు చేసిన లూకేను పాటియాలా కోర్టులో హాజరుపరిచారు.

అయితే కోర్టులో వాదనలు జరుగుతుండగానే ఫోమర్స్ స్పృహతప్పి పడిపోయాడని, అనంతరం అతనిని అక్కడి నుంచి తీసుకెళ్లాల్సి వచ్చిందని పోలీసులు చెప్పారు. ఇకపోతే.. వాదనలు విన్న కోర్టు లుకేకు శనివారం వరకు తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది. అలాగే ఈ కేసుకు సంబంధించి సీసీటీవీ కెమెరా ఆధారాలను కోర్టుకు ఎందుకు సమర్పించలేదని పోలీసులను పాటియాలా న్యాయస్థానం ప్రశ్నించింది.

మరోవైప లుకే వ్యవహారంపై ఆర్సీబీ జట్టు యజమాని విజయ్ మాల్యా మాట్లాడుతూ.. ఫోమర్స్ ఇకపై జరుగనున్న ఐపీఎల్ మ్యాచ్‌ల్లో ఆడబోడని స్పష్టం చేశారు. లూకే ప్రవర్తన సరికాదని, దీనిపై న్యాయమైన విచారణ జరపాలని, ఇందుకు అధికారులకు సహకరిస్తామని మాల్యా వ్యాఖ్యానించారు.

బీజేపీ ఎంపీ మాజీ క్రికెటర్ కీర్తి ఆజాద్ మాట్లాడుతూ.. ఐపీఎల్ ఇలాంటి దుశ్చర్యలకు వేదికవుతుందని మండిపడ్డారు. ఐపీఎల్ ఛైర్మన్ రాజీవ్ శుక్లా స్పందిస్తూ.. ఈ వ్యవహారం లుకే వ్యక్తిగతమని, ఇందులో ఐపీఎల్‌కు ఎలాంటి సంబంధం లేదన్నారు. ఫోమర్స్ కేసులో చట్టం తన పని తాను చేసుకుపోతోందని శుక్లా వ్యాఖ్యానించారు.

ఐపీఎల్ ఫిక్సింగ్.. సస్పెండ్ పై గవాస్కర్ అభిప్రాయం
ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐదో సీజన్లో స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడిన ఆటగాళ్లపై సస్పెన్షన్ వేటు వేయడం సరైందేనని భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ తెలిపాడు ఐదుగురు క్రికెటర్లను సస్పెండ్ చేస్తూ తీసుకున్న నిర్ణయం సరైందేనని వ్యాఖ్యానించిన గవాస్కర్.. ఇలాంటి ఫిక్సింగ్ ఆరోపణలు వచ్చిన సమయంలో ఆటగాళ్లపై తగిన చర్యలు తీసుకుని, విచారణ పూర్తయ్యే వరకు వారిని క్రికెట్ ఆడనివ్వకూడదని గవాస్కర్ తెలిపాడు.

స్పాట్ ఫిక్సింగ్‌పై బీసీసీఐ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు భారత మాజీ కెప్టెన్ అయిన సునీల్ గవాస్కర్ చెప్పారు. ఇదిలా ఉంటే స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడిన ఐదుగురిపై వేటు వేసిన సంగతి తెలిసిందే. స్టింగ్ ఆపరేషన్‌తో అడ్డంగా బుక్ అయిన డెక్కన్ ఛార్జర్స్ ఆటగాడు సుధీంద్ర, పంజాబ్ బౌలర్ శలబ్ శ్రీవాత్సవ, పుణె వారియర్స్ ఆటగాడు మోనిష్‌ మిశ్రాలతో పాటు అంకిత్ యాదవ్, అభినవ్ బలిలను 15 రోజుల పాటు సస్పెండ్ చేసింది.

రహస్యంగా పెళ్లి చేసుకున్న ఆసీస్ కెప్టెన్!!!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐదో సీజన్లో పుణే వారియర్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆస్ట్రేలియా కెప్టెన్ మైకేల్ క్లార్క్ రహస్యంగా వివాహం చేసుకున్నాడు. తన ప్రియసఖి, మోడల్ అయిన కైలీ బాల్డీని మైకేల్ క్లార్క్ మంగళవారం వివాహం చేసుకుని ఓ ఇంటివాడయ్యాడు. ఈ విషయాన్ని క్లార్క్ ట్విట్టర్లో పోస్ట్ చేశాడు.

సిడ్నీలోని హంటర్ వ్యాలీలో మైకేల్ క్లార్క్ వివాహం రహస్యంగా జరిగింది. కేవలం ఇరువర్గాల కుటుంబసభ్యులు మాత్రమే పాల్గొన్నట్లు సమాచారం. గతంలో క్లార్క్ మోడల్ లారా బింగిల్‌తో నిశ్చితార్థం చేసుకున్నాడు.

రెండేళ్ల క్రితం 2010లో న్యూజిలాండ్‌లో ఆస్ట్రేలియా పర్యటన సందర్భంలో ఈ ఎంగేజ్‌మెంట్ జరిగింది. అయితే వ్యక్తిగత కారణాలతో ఆ నిశ్చితార్థాన్ని రద్దు చేసుకున్నట్లు తెలిపాడు. ఈ నేపథ్యంలో కైలీ బాల్డీతో మంగళవారం తన వివాహం జరిగిందని క్లార్క్ ట్విట్టర్లో స్వయంగా ప్రకటించాడు.

Yuvi eyes comeback…!
India’s World Cup hero Yuvraj Singh hopes to return to cricket in “three to four months” after recovering from a cancerous tumour, media reports said on Thursday.

Yuvraj, asked by reporters in Chandigarh whether he could make a comeback in a year’s time, said: “One year is too late. I am hoping to make an early comeback, maybe by the next three to four months.”

The 30-year-old underwent chemotherapy treatment in the United States earlier this year after being diagnosed with a rare germ-cell tumour between his lungs.

On his return to India last month, Yuvraj said he wanted to force his way back into the Indian side but conceded that “it won’t be easy and will take time.”

The left-handed all-rounder played a key role in India’s World Cup triumph last year, scoring 362 runs and taking 15 wickets in nine matches to be the man of the tournament.

Yuvraj has not played competitive cricket since taking part in two home Tests against the West Indies in November.

Yuvraj has scored 8,051 runs in 274 one-dayers and 1,775 runs in 37 Tests since his international debut in 2000.

Source: Khaleej Times.

శ్రీలంక జట్టులో అజంతా మెండీస్‌కు అత్యునత స్థానం !
పాకిస్థాన్, భారత్ పర్యటనల్లో పాల్గొనే శ్రీలంక ప్రాబబుల్స్ జట్టులో శ్రీలంక స్పిన్నర్ అజంతా మెండీస్‌, ఫాస్ట్ బౌలర్ దిల్హారా ఫెర్నాండ్‌లకు చోటు దక్కింది. 30 మందితో కూడిన శ్రీలంక జట్టులో కొత్తవారికి సెలక్టర్లు స్థానం కల్పించలేదు. దక్షిణాఫ్రికాతో గత ఏడాది జరిగిన క్రికెట్ సిరీస్‌లో ఫెర్నాండో, మెండీస్‌లు ఆడారు.

అలాగే, గాయం నుంచి కోలుకున్న నువాన్ ప్రదీప్, లెగ్ స్పిన్నర్ లోకువారాచ్చి‌లు కూడా జట్టులో స్థానం దక్కించుకున్నాడు. జూన్, జూలైలలో పాకిస్థాన్‌ పర్యటించనున్న శ్రీలంక రెండు ట్వంటీ20లు, ఐదు వన్డేలు, మూడు మ్యాచ్‌లతో కూడిన టెస్టు సిరీస్‌‌లు ఆడనుంది. జూలై 22 నుంచి ఐదు వన్డేలు, ఏకైక ట్వంటీ20 మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి.

శ్రీలంక ప్రాబబుల్స్ జట్టు: మహేల జయవర్ధనే, తిలకరత్నే దిల్షాన్, కుమార సంగక్కర, తరంగ పరణవితన, త్రిమన్నే, ఉప్పుల్ తరంగ, దినేష్ చండీమాల్, సమరవీర, ప్రసన్న జయవర్ధనే, చమర సిల్వ, కపుగెదెర, మాథ్యూస్, పెరెరా, ఫర్వేజ్ మహరూఫ్ ఇసురు ఉగండ, లసిత్ మలింగ, నువాన్ కులశేఖర, వెలెగెదెర, లక్మల్, డమ్మికా ప్రసాద్, షామిండా ఎరంగ, దిల్హారా ఫెర్నాండో, నువాన్ ప్రదీప్, సూరజ్ రందీవ్, హెరాత్, సెనన్యకె, అజంతా మెండీస్, దిల్రువాన్ పెరెరా, జీవన్ మెండీస్, లోక్వారాచ్చి.

పాకిస్థాన్

44ఏళ్ల తర్వాత మాంచెస్టర్ విజయం
ఇంగ్లండ్ ప్రీమియర్ లీగ్ ఫుట్‌బాల్ ఫైనల్ పోరులో మాంచెస్టర్ సిటీ 3-2 గోల్స్ తేడాతో క్వీన్స్‌పార్క్ రేంజర్స్‌ను మట్టికరిపించి రికార్డు సృష్టించింది. ఫలితంగా 44 సంవత్సరాల తర్వాత ఇంగ్లండ్ ప్రీమియర్ లీగ్‌లో మాంచెస్టర్ సిటీ విజేతగా నిలిచింది.

ప్రీమియర్ లీగ్‌ ఫైనల్ మ్యాచ్‌లు ఆదివారం జరిగాయి. ఇప్పటి వరకు జరిగిన 37 మ్యాచ్‌ల ద్వారా మాంచెస్టర్ యునైటెడ్, మాంచెస్టర్ సిటీలు చెరో 86 పాయింట్లు సాధించాయి.

అయినప్పటికీ మాంచెస్టర్ సిటీ గోల్స్ తేడాతో అగ్రస్థానంలో నిలిచింది. ఇంకా మాంచెస్టర్ సిటీ 1968వ సంవత్సరానికి తర్వాత ఇంగ్లండ్ ప్రీమియర్ లీగ్‌లో విజేతగా నిలిచిన రికార్డులు లేవు. ఈ నేపథ్యంలో క్వీన్‌పార్క్ రేంజర్స్‌తో జరిగిన ఫైనల్ పోరులో మాంచెస్టర్ టైటిల్ సాధించింది.

చాలెంజర్స్‌పై ముంబై గెలుపు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఐదో సీజన్లో ఆంధ్రావాలా అంబటి రాయుడు తన సత్తా ఏంటో నిరూపించుకున్నాడు. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో రాయల్ చాలెంజర్స్‌తో సోమవారం చివరి ఓవర్ వరకూ ఉత్కంఠ భరితంగా సాగిన 62వ లీగ్ మ్యాచ్‌లో కీరన్ పొలార్డ్ (52)తో కలిసి దుమ్మురేపిన రాయుడు (64) 122 పరుగుల అజేయ భాగస్వామ్యంతో కదం తొక్కాడు. ఫలితంగా చాంపియన్స్ లీగ్ చాంపియన్ ముంబయి ఇండియన్స్‌ను 5 వికెట్ల తేడాతో గెలిపించి నాకౌట్ బెర్తును దాదాపు ఖాయం చేశాడు.

టాస్ గెలిచిన ముంబయి ఇండియన్స్ కెప్టెన్ హర్భజన్ సింగ్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో తొలుత బ్యాటింగ్ ప్రారంభించిన రాయల్ చాలెంజర్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 171 పరుగులు సాధించింది. అనంతరం 172 పరుగుల లక్ష్యంతో ఇన్నింగ్స్ ప్రారంభించిన ముంబయి ఇండియన్స్ జట్టులో టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మన్లంతా ఘోరంగా విఫలమయ్యారు.

కానీ అంబటి రాయుడు 81 పరుగులతో సూపర్ ఇన్నింగ్స్ ఆడటంతో 19.4 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 173 పరుగులు సాధించిన ముంబయి ఇండియన్స్ జట్టు మరో రెండు బంతులు మిగిలి ఉండగానే 5 వికెట్ల తేడాతో ‘చాలెంజర్స్’ను మట్టికరిపించి పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి దూసుకెళ్లింది.

ఈ సీజన్‌లో ఇప్పటివరకూ 14 మ్యాచ్‌లు ఆడిన ముంబయి ఇండియన్స్‌కు ఇది తొమ్మిదో విజయం కాగా, పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో కొనసాగుతున్న ‘చాలెంజర్స్’కు 14 మ్యాచ్‌లలో ఇది ఆరో ఓటమి కావడం గమనార్హం. ఇక ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డును అంబటి రాయుడు కైవసం చేసుకున్నాడు.

ప్రపంచ బాక్సింగ్ లో ఖంగుతిన్న గుల్సుమ్!
మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత బాక్సర్ ఎల్. సరితా దేవి 60 కిలోల లైట్ వెయిట్‌ విభాగంలో.. డిఫెండింగ్ చాంపియన్, ప్రపంచ ర్యాంకింగ్స్‌లో రెండో స్థానంలో కొనసాగుతున్న గుల్సుమ్ తతర్ (టర్కీ)పై సంచలన విజయం సాధించి ప్రీ-క్వార్టర్ ఫైనల్స్‌కు దూసుకెళ్లింది.

రెండు డివిజన్లు మారిన తర్వాత రెండోసారి అంతర్జాతీయ ఈవెంట్‌లో తలపడుతున్న ఆసియా చాంపియన్ సరితా దేవి నువ్వా-నేనా అన్నట్టు ఆద్యంతం హోరాహోరీగా సాగిన ఈ బౌట్‌లో 14-13 పాయింట్ల తేడాతో తతర్‌ను మట్టికరిపించి క్వార్టర్ ఫైనల్స్ బెర్తును ఖరారు చేసుకుంది.