మూడు యూనికోడ్ తెలుగు ఫాంట్స్ విడుదల
హైదరాబాద్: సిలికానాంధ్ర సమితి సహకారంతో రాష్ట్ర ఐటీ శాఖ యూనికోడ్ ద్వారా రూపొందించిన మూడు తెలుగు ఫాంట్స్‌ను ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి మంగళవారమిక్కడ ఆవిష్కరించారు. జూబ్లీహాలులో జరిగిన మాతృభాషా దినోత్సవంలో ఆయన మాట్లాడుతూ.. తల్లిదండ్రులు పిల్లలతో తెలుగులోనే మాట్లాడాలని సూచించారు. ‘తెలుగు భాషకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ పెట్టాలని అందరూ కోరుతున్నారు. అయితే నాలుగైదు శాఖలతో పోర్ట్‌ఫోలియో ఇచ్చినా.. ఇంత చిన్న శాఖా అని అంటున్న తరుణంలో మరీ ఇంత చిన్న శాఖని ఏర్పాటుచేయడం కష్టమేమో’ అని వ్యాఖ్యానించారు. ఆంగ్లంలో అందుబాటులో ఉన్న వందలాది యూనికోడ్ ఫాంట్స్ తరహాలో అందరికీ అందుబాటులో ఉండేందుకు.. యూనికోడ్ కన్సార్షియంలో శాశ్వత సభ్యత్వం పొంది.. ఈ ఫాంట్లు రూపొందించినట్టు ఐటీ శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య తెలిపారు. ‘ఐటీ అభివృద్ధిలో తెలుగును జోడించేందుకు వీలుగా ఇంటర్నెట్‌లో సార్వత్రిక ఫాంట్‌ను రూపొందించడమే ఈ యూనికోడ్ ఫాంట్ల రూపకల్పన లక్ష్యం.
Tags: -

Comments